V Hanumantha Rao | బీసీలు తిరగబడితే బీజేపీ ప్రభుత్వం కుప్పకూలుతుంది : వీ హనుమంతరావు
V Hanumantha Rao | దేశంలోని బీసీలందరూ తిరగబడితే బీజేపీ ప్రభుత్వం కుప్పకూలుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు హెచ్చరించారు. మోదీ బీసీ అన్నారు.. మరి బీసీలకు ఎందుకు న్యాయం చేయడం లేదని నిలదీశారు. అభివృద్ధిలో పాలు పంచుకోకుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఓటమి పాలవడం ఖాయమని వీహెచ్ హెచ్చరించారు.
V Hanumantha Rao | త్రినేత్ర.న్యూస్ : దేశంలోని బీసీలందరూ తిరగబడితే బీజేపీ ప్రభుత్వం కుప్పకూలుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు హెచ్చరించారు. మోదీ బీసీ అన్నారు.. మరి బీసీలకు ఎందుకు న్యాయం చేయడం లేదని నిలదీశారు. అభివృద్ధిలో పాలు పంచుకోకుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఓటమి పాలవడం ఖాయమని వీహెచ్ హెచ్చరించారు. సోమవారం వీహెచ్ మీడియాతో మాట్లాడారు.
కిషన్ రెడ్డి ఎక్కువ మాట్లాడుతున్నారు.. రాహుల్ గాంధీ ప్రధాని కాలేరు అని అంటున్నాడు.. నువ్వు అప్పుడే పెద్దొడివి అయిపోయావా..? కేంద్రమంత్రి స్టేట్‌మెంట్లకే పరిమితం అయ్యాడు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రమంత్రిగా నీ పాత్ర లేదా..? సీఎంను మోదీ దగ్గరికి తీసుకెళ్లట్లేదు.. అభివృద్ధికి అడ్డుపడుతున్నది కేంద్ర మంత్రినే అని వీహెచ్ ధ్వజమెత్తారు.
కిషన్ రెడ్డి.. బీసీలకు వ్యతిరేకం
బీహార్‌లో 60 శాతం బీసీల జనాభా ఉంది.. తెలంగాణలో 55 శాతం ఉంది. మొత్తంగా దేశంలోనే మా జనాభా ఎక్కువగా ఉంది. సర్ గెజిట్‌లో మా కులాల పేర్లే లేవు.. బీసీ ఓట్లతో గెలిచిన కిషన్ రెడ్డి.. ఆ బీసీలకే వ్యతిరేకంగా ఉన్నాడు. బీసీలకు అన్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ గమనించారు. సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డికి బీసీల ఓట్లు పడవు.. వద్దని చెప్తాను. రాష్ట్రమంతా తిరిగి బీసీ వ్యతిరేకి బీజేపీ అని ప్రచారం చేస్తాను. కిషన్ రెడ్డి ఓటమి ఖాయమని హెచ్చరించారు.
అగ్రకులాల ఓట్లతోనే బీజేపీ గేలుస్తుందా..?
అగ్రకులాల ఓట్లతోనే బీజేపీ గేలుస్తుందా..? బీసీలం అవసరం లేదా..? బీసీల ఓట్లతోనే కేంద్రంలోనూ బిల్లులు పాస్ అవుతున్నాయి. జనగణనలో కులగణన అయితే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. జనగణనలో కులగణన చేస్తే తప్పేముంది..? మోదీకి మా పట్ల ప్రేమ లేదు.. మోదీ హిందూ అంటూ ఓట్లు అడుగుతున్నరు.. హిందువుల్లోనూ బీసీలు ఉన్నారని వీ హనుమంతరావు తెలిపారు.
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద రూ. 110 కోట్లతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ : భట్టి విక్రమార్క
జూన్ 8, 2026

Minister Sridhar Babu | మునిగిపోయే కారుకు పది సీట్లు రావు.. హరీశ్‌రావుకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్
జూన్ 8, 2026

Traffic Restrictions | రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ మార్గాల్లో అసలు వెళ్లకండి..!
జూన్ 8, 2026
తాజావార్తలు
- ●Minister Sridhar Babu | మునిగిపోయే కారుకు పది సీట్లు రావు.. హరీశ్‌రావుకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్
- ●Peddi | మరో వివాదంలో పెద్ది - అట్రాసిటీ కేసు పెట్టాలంటూ ఆదివాసీల డిమాండ్
- ●Airtel | ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ సేవలను సమర్థించుకున్న ఎయిర్ టెల్.. నిబంధనల ఉల్లంఘన లేదని స్పష్టీకరణ..
- ●Traffic Restrictions | రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ మార్గాల్లో అసలు వెళ్లకండి..!
- ●Dasoju Sravan Kumar | తెలంగాణ జనాక్రోశమే ఈ కవిత్వం.. సీఎం రేవంత్‌కు అంకితం
- ●N Ramachander Rao | హిట్లర్ లాగే రేవంత్ ప్రభుత్వానికి మరణం తప్పదు : ఎన్ రామచందర్ రావు

Minister Sridhar Babu | మునిగిపోయే కారుకు పది సీట్లు రావు.. హరీశ్‌రావుకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్

Peddi | మరో వివాదంలో పెద్ది - అట్రాసిటీ కేసు పెట్టాలంటూ ఆదివాసీల డిమాండ్

Airtel | ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ సేవలను సమర్థించుకున్న ఎయిర్ టెల్.. నిబంధనల ఉల్లంఘన లేదని స్పష్టీకరణ..

Traffic Restrictions | రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ మార్గాల్లో అసలు వెళ్లకండి..!



