Adilabad Airport | ఆదిలాబాద్ విమానాశ్రయానికి రూ.2,278 కోట్లు.. 2 వేల ఎకరాల భూసేకరణ
Adilabad Airport | ఆదిలాబాద్ విమానాశ్రయ (Adilabad Airport) నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణాన్ని ఆనుకుని దాదాపు 2 వేలకుపైగా ఎకరాల విస్తీర్ణంలో చేపట్టే ప్రాజెక్టుకు భూసేకరణ (Land Acquisition), మౌలిక వసతుల కల్పనకు రూ.2,278.14 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Adilabad Airport | త్రినేత్ర.న్యూస్: ఆదిలాబాద్ విమానాశ్రయ (Adilabad Airport) నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణాన్ని ఆనుకుని దాదాపు 2 వేలకుపైగా ఎకరాల విస్తీర్ణంలో చేపట్టే ప్రాజెక్టుకు భూసేకరణ (Land Acquisition), మౌలిక వసతుల కల్పనకు రూ.2,278.14 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 2,009.23 ఎకరాల భూమిని సేకరించాలని అందులో పేర్కొంది. ఇందులో భారత వైమానిక దళం (Indian Airforce) శిక్షణ, ఆపరేషన్స్ కోసం 1,609.23 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతం వాయుసేన అధీనంలో ఉన్న 369.45 ఎకరాలకు అదనంగా భూమిని సేకరించి ప్రభుత్వం ఉచితంగా అందించనుంది.
కాగా, 400 ఎకరాలు ప్రయాణికుల విమాన (Civil Aviation) సేవలు, కార్గో సౌకర్యాలు, ఎంఆర్‌ఓ, హ్యాంగర్ల నిర్మాణానికి సేకరించనున్నారు. వైమానిక దళం, ఎయిర్‌బస్ లాంటి పెద్ద రవాణా విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు 9 వేల అడుగుల పొడవైన రన్ వేను నిర్మిస్తారు.
ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా..
రూ. 2,278.14 కోట్ల బడ్జెట్‌లో భూసేకరణతో పాటు విమానాశ్రయ నిర్మాణానికి, అడ్డంకిగా ఉన్న రహదారులు, విద్యుత్ లైన్లు, నీటిపారుదల మార్గాలను మళ్లించడానికి నిధులు కేటాయించారు. కగా, విమానాశ్రయం కోసం గతంలో 700 ఎకరాల భూసేకరించాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 2,009.23 ఎకరాలు సేకరించాలని నిర్ణయించింది. భూసేకరణ ప్రక్రియతో పాటు విద్యుత్ లైన్లు, రోడ్ల మళ్లింపు పనులన్నింటినీ డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేసింది.
వరంగల్ మామునూరులోనూ ప్రభుత్వం మరో ఎయిర్‌పోర్టును నిర్మిస్తున్నది. దీనికి సంబంధించిన ఇప్పటికే ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక కొత్తగూడెంలోనూ ఎయిర్‌పోర్టు నిర్మించాలని అనుకున్నప్పటికీ.. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా అక్కడ సాధ్యం కాదని కేేంద్రం వెల్లడించింది.
సంబంధిత వార్తలు

Saptha Gundala Waterfalls | జాలువారుతున్న సప్తగుండాల జలపాతం.. ప్రకృతి ప్రేమికుల గుండెల్లో జలసవ్వడి
జులై 21, 2026

Ilambarthi | ఎల్‌నినోను సమష్టిగా ఎదుర్కొందాం
జులై 20, 2026

Student Missing | చదువుపై అయిష్టంతో కాలేజీ నుంచి విద్యార్థిని అదృశ్యం.. మూడు రోజులపాటు ఉచిత బస్సులో చక్కర్లు..
జులై 9, 2026
తాజావార్తలు
- ●Rain Update | నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
- ●UPSC Recruitment | బీఈడీ అర్హతతో యూపీఎస్సీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఉద్యోగాలు
- ●Horoscope | జూలై 27 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఆకస్మిక లాభనష్టాలు ఉండవచ్చు!
- ●Tencent Employee Fired | రూ.4.5 కోట్ల ప్యాకేజీ.. ఆన్లైన్లో లీకైన శాలరీ డీటెయిల్స్: ఉద్యోగిని ఫైర్ చేసిన కంపెనీ
- ●Rice Business Success | టీసీఎస్ జాబ్ రిజెక్ట్ చేసి.. బియ్యం అమ్మి ఏటా రూ.25 లక్షలు సంపాదిస్తున్నాడు!
- ●Mumbai Cop Vinod Kalukhe | సీజేపీ ఆందోళనల్లో స్పెషల్ అట్రాక్షన్: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ముంబై 'పూకీ' కాప్.. ఇతని స్టోరీ ఇదే!

Rain Update | నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు

UPSC Recruitment | బీఈడీ అర్హతతో యూపీఎస్సీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఉద్యోగాలు

Horoscope | జూలై 27 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఆకస్మిక లాభనష్టాలు ఉండవచ్చు!

Tencent Employee Fired | రూ.4.5 కోట్ల ప్యాకేజీ.. ఆన్లైన్లో లీకైన శాలరీ డీటెయిల్స్: ఉద్యోగిని ఫైర్ చేసిన కంపెనీ



