Ujjwala Cylinders | ఇకపై ఏడాదికి నాలుగే.. ఉజ్వల రాయితీ సిలిండర్లలో కోత
Ujjwala Cylinders | పేదలకు ఉచితంగా ఎల్పీజీ (LPG) కనెక్షన్లు అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఉజ్వల యోజన పథకంలో (PMUY) కేంద్ర ప్రభుత్వం కోత విధించింది. ఈ పథకం కింద ఇస్తున్న సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను (Ujjwala Cylinders) మరింత కుదించింది.
Ujjwala Cylinders | త్రినేత్ర.న్యూస్: పేదలకు ఉచితంగా ఎల్పీజీ (LPG) కనెక్షన్లు అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఉజ్వల యోజన పథకంలో (PMUY) కేంద్ర ప్రభుత్వం కోత విధించింది. ఈ పథకం కింద ఇస్తున్న సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను (Ujjwala Cylinders) మరింత కుదించింది. ఇప్పటి వరకు ఏడాదికి ఇస్తున్న 9 సిలిండర్ల సంఖ్యను నాలుగుకు పరిమితం చేసింది. 2016లో ఈ పథకం ప్రవేశపెట్టినప్పుడు ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లను సబ్సిడీపై అందించేవారు. దానిని గతేడాది 9కి తగ్గించారు. కుటుంబ సగటు వినియోగానికి అనుగుణంగా ఈ మార్పు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
గతంలో ఏడాదికి 12 సిలిండర్ల వరకు ఒక్కో సిలిండర్‌కు రూ.200 చొప్పున బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. 2023లో సబ్సిడీ మొత్తాన్ని రూ.300కు పెంచింది. కాగా, ఉజ్వల వినియోగదారులకు రాయితీ అనంతరం రూ.642కే గ్యాస్ సిలిండర్ లభిస్తున్నది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇకపై నాలుగు సిలిండర్‌లకు రూ.300 చొప్పున ఏడాదికి కేవలం రూ.1200 మాత్రమే సబ్సిడీ లభించనుంది.
ఉజ్వల అసలు ఉద్దేశం..
వంట కోసం కట్టెలు, బొగ్గు, పెండ పిడకల వంటి సాంప్రదాయ ఇంధనాలపై ఆధారపడే గ్రామీణ, నిరుపేద మహిళల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంలో 2016లో ఉజ్వల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పొగ వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కల్పించి, మహిళల సాధికారతకు తోడ్పడటం ఈ పథకం లక్ష్యం. దీని ద్వారా లబ్ధిదారులకు ఎల్‌పీజీ కనెక్షన్‌తో పాటు మొదటి గ్యాస్ సిలిండర్, స్టవ్ పూర్తిగా ఉచితంగా ఇస్తారు. అయితే లబ్దిదారుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం కుదిస్తూ పోతున్నది.
దేశవ్యాప్తంగా లబ్ధిదారులు..
దేశవ్యాప్తంగా ఉజ్వల పథకం కింద ఇప్పటివరకు 10.57 కోట్లకు పైగా (10,57,25,000+) ఉచిత గ్యాస్ కనెక్షన్లను పేద మహిళలకు అందజేశారు. దీంతో దేశంలో మొత్తం గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 33.39 కోట్లకు పెరిగింది. 2014లో ఈ సంఖ్య 14.52 కోట్లుగా ఉన్నది.
తెలంగాణలో..
రాష్ట్రంలో పీఎంయూవై కింద 11,31,536 మంది లబ్దిదారులకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. ఈ పథకం మొదటి దశలో తెలంగాణ వ్యాప్తంగా 10,71,118 ఉచిత కనెక్షన్లు ఇవ్వగా, రెండో దశలో 60,418 కనెక్షన్లు ఇచ్చారు. నల్లగొండలో అత్యధికంగా 70,598 మంది లబ్దిదారులు ఉండగా, ఖమ్మంలో 68,347, భద్రాద్రి కొత్తగూడెం 68,315 తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
తాజావార్తలు
- ●Yellamma First Look | పర్షి వచ్చేశాడు - ఎల్లమ్మ మూవీ నుంచి దేవిశ్రీప్రసాద్ ఫస్ట్ లుక్ రిలీజ్
- ●Tanvi Sharma | తైపీ ఓపెన్‌లో తన్వి శర్మ సంచలనం.. 17 ఏళ్లకే చరిత్ర సృష్టించిన భారత షట్లర్
- ●IND Vs SL | బుమ్రా ఫిట్..! టీమిండియాకు ఊరట..
- ●Bandi Sanjay | రేవంత్‌ను ఎదురించాల్సిందే.. బండి సంజయ్ పిలుపు
- ●RTC Retired Employees Association | ఈనెల 4న రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల చలో బస్సు భవన్
- ●Explosion in Moscow restaurant | మాస్కోలోని రెస్టారెంట్లో పేలుడు.. ముగ్గురు మృతి

Yellamma First Look | పర్షి వచ్చేశాడు - ఎల్లమ్మ మూవీ నుంచి దేవిశ్రీప్రసాద్ ఫస్ట్ లుక్ రిలీజ్

Tanvi Sharma | తైపీ ఓపెన్‌లో తన్వి శర్మ సంచలనం.. 17 ఏళ్లకే చరిత్ర సృష్టించిన భారత షట్లర్

IND Vs SL | బుమ్రా ఫిట్..! టీమిండియాకు ఊరట..

Bandi Sanjay | రేవంత్‌ను ఎదురించాల్సిందే.. బండి సంజయ్ పిలుపు






