Yellamma First Look | పర్షి వచ్చేశాడు – ఎల్లమ్మ మూవీ నుంచి దేవిశ్రీప్రసాద్ ఫస్ట్ లుక్ రిలీజ్
దేవిశ్రీప్రసాద్ బర్త్‌డే సందర్భంగా ఎల్లమ్మ మూవీ నుంచి మేకర్స్ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నారు. అతడి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో రెట్రో గెటప్‌లో దేవిశ్రీప్రసాద్ కనిపించడం ఆసక్తిని పంచుతోందఎల్లమ్మతోనే ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.
Entertainment | Published On Aug 2, 2026, 6.03 pm IST
Yellamma First Look | తెలుగు సినిమా సంగీతానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్లలో దేవిశ్రీప్రసాద్ ఒకరు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో వందకుపైగా సినిమాలకు సంగీతం అందించారు. నేషనల్ అవార్డ్‌తో పాటు ఎన్నో పురస్కారాలను అందుకున్న దేవిశ్రీప్రసాద్ ఎల్లమ్మ మూవీతో ఫస్ట్ టైమ్ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు బలగం ఫేమ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు నిర్మిస్తున్నారు.
ఫస్ట్ లుక్ రిలీజ్...
దేవిశ్రీప్రసాద్ బర్త్‌డే సందర్భంగా ఆదివారం ఎల్లమ్మ మూవీ నుంచి అతడి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కిరీటం చేతిలో పట్టుకొని రెట్రో గెటప్‌లో దేవిశ్రీప్రసాద్ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఎల్లమ్మ మూవీలో పర్షిగా అనే పాత్రలో దేవిశ్రీప్రసాద్ కనిపించబోతున్నాడు. మట్టి నుంచి పుట్టిన ఈ పర్షి ఎప్పటికీ గుర్తుండిపోతాడు. అతడి ప్రయాణాన్ని ఎవరూ మర్చిపోలేరు అంటూ ఈ పోస్ట్ లుక్‌ను ఉద్దేశించి మేకర్స్ పేర్కొన్నారు.
నిమ్న కులానికి...
ఎల్లమ్మలో నాటకాల పిచ్చి ఉన్న యువకుడిగా దేవిశ్రీప్రసాద్ కనిపించబోతున్నట్లు సమాచారం. నిమ్న కులానికి చెందిన కళాకారుడి జీవితం గమనంలో ఎదురైన అడ్డంకులు, సంఘర్షణ నేపథ్యంలో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోన్నట్లు చెబుతున్నారు. బలగం తరహాలోనే స్వచ్ఛమైన అనుబంధాలు, అప్యాయతలతో ఈ సినిమా తెరకెక్కుతోన్నట్లు సమాచారం.
ఐదు భాషల్లో...
హీరోగా నటిస్తూనే ఎల్లమ్మకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
మమితా బైజు, మృణాల్ ఠాకూర్...
ఎల్లమ్మ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. మమితా బైజు, మృణాల్ ఠాకూర్, భాగ్యశ్రీ బోర్సేతో పాటు పటువురు కథానాయికల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఎవరిని ఫైనల్ చేయలేదు. ఎల్లమ్మలో ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
The birth of an actor...
On the day of his birth ❤️🔥A name called PARSHI.
A world called #Yellamma.
A journey we are all waiting to witness 🔥#HBDDeviSriPrasad #SVC61 Rockstar @thisisdsp @VenuYeldandi9 #DilRaju #Shirish @muraligdop @Hr_3555 #HanshithaReddy @svc_official… pic.twitter.com/9yo6QzBN8X— Sri Venkateswara Creations (@SVC_official) August 2, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Nani – Nithiin | నాని నిర్మాత…నితిన్ హీరో – అలియాస్ రుక్మిణి టైటిల్ గ్లింప్స్ రిలీజ్
ఆగస్టు 3, 2026

Tollywood | పొలిమేర వరల్డ్‌లోకి యాక్షన్ కింగ్ అర్జున్ ఎంట్రీ – హారర్‌తో భయపెట్టడానికి రెడీ
జులై 27, 2026

Rasha Thadani | అమ్మ స్టార్ హీరోయిన్ – నాన్న పెద్ద ప్రొడ్యూసర్ – శ్రీనివాస మంగాపురం హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
జులై 26, 2026
తాజావార్తలు
- ●Priyanka Chopra | ఆస్కార్ విన్నింగ్ యాక్టర్‌తో గ్లోబల్ స్టార్ రొమాన్స్ - హాలీవుడ్లో జాక్‌పాట్
- ●Krishank | ఇందిరమ్మ చీరలను ఎలుకలు కొరుకుతున్నయ్.. 10 నెలల నుంచి ఎందుకు పంచలే?
- ●Niranjan Reddy | ఉన్న నీళ్లను వదిలిపెట్టి వరుణ యాగమా..?
- ●Kangana Ranaut | యువతే దేశానికి బలమైన శక్తి.. జెన్‌జీ విషయంలో స్వరం మార్చిన కంగన
- ●Hyderabad | ఆటో డ్రైవర్ హత్య.. హైడ్రా సహాయంతో సరూర్‌నగర్ చెరువులో కత్తి వెలికితీత
- ●Bhagyashri Borse | రాకా మ్యూజిక్ డైరెక్టర్‌తో భాగ్యశ్రీ బోర్సే స్టెప్పులు - ఒక్క పాటకు రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?

Priyanka Chopra | ఆస్కార్ విన్నింగ్ యాక్టర్‌తో గ్లోబల్ స్టార్ రొమాన్స్ - హాలీవుడ్లో జాక్‌పాట్

Krishank | ఇందిరమ్మ చీరలను ఎలుకలు కొరుకుతున్నయ్.. 10 నెలల నుంచి ఎందుకు పంచలే?

Niranjan Reddy | ఉన్న నీళ్లను వదిలిపెట్టి వరుణ యాగమా..?

Kangana Ranaut | యువతే దేశానికి బలమైన శక్తి.. జెన్‌జీ విషయంలో స్వరం మార్చిన కంగన



