Tanvi Sharma | తైపీ ఓపెన్‌లో తన్వి శర్మ సంచలనం.. 17 ఏళ్లకే చరిత్ర సృష్టించిన భారత షట్లర్
Tanvi Sharma | భారత బ్యాడ్మింటన్‌లో మరో యువ సంచలనం వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌కు చెందిన 17 ఏళ్ల షట్లర్ తన్వి శర్మ తైపీ ఓపెన్ సూపర్-300 టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆరో సీడ్ థుయ్ లిన్ న్గుయెన్ (వియత్నాం)పై 21-16, 21-16 తేడాతో విజయం సాధించిన తన్వి.. తన కెరీర్‌లో తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్‌ను అందుకుంది. కేవలం 36 నిమిషాల్లోనే ఫైనల్ మ్యాచ్‌ను ముగించడం విశేషం.
Tanvi Sharma | భారత బ్యాడ్మింటన్‌లో మరో యువ సంచలనం వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌కు చెందిన 17 ఏళ్ల షట్లర్ తన్వి శర్మ తైపీ ఓపెన్ సూపర్-300 టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆరో సీడ్ థుయ్ లిన్ న్గుయెన్ (వియత్నాం)పై 21-16, 21-16 తేడాతో విజయం సాధించిన తన్వి.. తన కెరీర్‌లో తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్‌ను అందుకుంది. కేవలం 36 నిమిషాల్లోనే ఫైనల్ మ్యాచ్‌ను ముగించడం విశేషం.
18 ఏళ్ల తర్వాత సైనా నెహ్వాల్ తర్వాత..
తైపీ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన రెండో భారత క్రీడాకారిణిగా తన్వి శర్మ నిలిచింది. 2008లో ఈ టైటిల్‌ను సాధించిన భారత బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ తర్వాత మళ్లీ ఈ ఘనత అందుకున్న భారత షట్లర్‌గా రికార్డు సృష్టించింది. అలాగే తన కెరీర్‌లో తొలి బీడబ్ల్యూఎఫ్ సూపర్-300 టైటిల్‌ను కూడా సొంతం చేసుకుంది. గత ఏడాది యూఎస్ ఓపెన్ సూపర్-300 టోర్నీలో ఫైనల్‌కు చేరిన తన్వి.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈసారి మాత్రం తుది పోరులో విజయం సాధించి టైటిల్‌ను ఒడిసిపట్టింది.
అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు
తైపీ ఓపెన్ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో టైటిల్ గెలిచిన ప్లేయర్‌గా తన్వి రికార్డు నెలకొల్పింది. 17 ఏళ్ల 222 రోజుల వయసులో ఛాంపియన్‌గా నిలిచిన తన్వి.. ఈ టోర్నీలో అత్యంత పిన్న వయస్కురాలైన ఫైనలిస్ట్‌గానూ ఘనత సాధించింది. ఈ క్రమంలో దక్షిణ కొరియా దిగ్గజం లీ యోంగ్ డే పేరిట ఉన్న రికార్డును అధిగమించింది.
ఆరంభం నుంచే ఆధిపత్యం
పీవీ సింధు మాజీ కోచ్ పార్క్ టే-సాంగ్ శిష్యురాలైన తన్వి.. ఫైనల్లో ఆరంభం నుంచే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. అద్భుతమైన డ్రాప్ షాట్లు, క్రాస్‌కోర్ట్ స్మాష్‌లు, నెట్ ప్లేతో తొలి గేమ్‌లో 10-2 ఆధిక్యం సాధించింది. మధ్యలో కొన్ని తప్పిదాలు చేసినా వెంటనే తేరుకుని 21-16తో తొలి గేమ్‌ను ముగించింది. రెండో గేమ్‌లో వియత్నాం క్రీడాకారిణి 3-0 ఆధిక్యంలోకి వెళ్లినా.. తన్వి ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. పటిష్ఠమైన డిఫెన్స్, ప్రత్యర్థిని బోల్తా కొట్టిస్తూ వరుసగా పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి వచ్చింది. చివర్లో ఏడు మ్యాచ్ పాయింట్లు దక్కించుకున్న ఆమె.. నాలుగో అవకాశంలో విజయాన్ని ఖాయం చేసుకుంది.
కోచ్‌కు అంకితం..
టైటిల్ గెలిచిన అనంతరం జరిగిన మెడల్ ప్రదాన కార్యక్రమంలో ప్రత్యేక దృశ్యం కనిపించింది. తనకు మార్గనిర్దేశం చేసిన కోచ్ పార్క్ టే-సాంగ్ మెడలో తన్వి తన బంగారు పతకాన్ని వేసింది. అనంతరం ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఈ దృశ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. మాజీ ప్రపంచ జూనియర్ నంబర్ వన్ అయిన తన్వి శర్మ ఇప్పటికే పలు ఘనతలు సాధించింది. ఒకే ఎడిషన్ ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది. అలాగే ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తొలి స్వర్ణ పతకం సాధించిన జట్టులో భాగమైంది. తాజాగా తైపీ ఓపెన్ టైటిల్‌తో తన ప్రతిభను మరోసారి చాటుకున్న తన్వి.. భారత బ్యాడ్మింటన్‌కు భవిష్యత్ ఆశ కిరణంగా నిలుస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Moon Crater | చంద్రుడిపై కొత్తగా భారీ గొయ్యి.. స్పేస్ఎక్స్ రాకెట్ ఢీకొట్టడంతోనే..!
ఆగస్టు 11, 2026

Smart Ration Cards | 3.43 కోట్ల మందికి ‘స్మార్ట్’ ఆహార భద్రత
ఆగస్టు 11, 2026

Janhvi Kapoor | అలా అయితే గుహలో ఉండాల్సి వస్తుంది..! జాన్వీ కపూర్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆగస్టు 11, 2026
తాజావార్తలు
- ●SBI Recruitment | SBI జూనియర్ అసోసియేట్స్ రిక్రూట్మెంట్.. 9,124 పోస్టులకు దరఖాస్తులు షురూ
- ●‘హస్తం’ గూటిలో ‘గులాబీ’ల త్రిశంకు స్వర్గం: అభివృద్ధి ఆశలు.. గౌరవం గల్లంతు: ఫిరాయింపు నేతల రాజకీయ తంటాలు!
- ●Horoscope | ఆగస్టు 12 రాశిఫలాలు.. ఈ రాశి వారు పాత మిత్రులను తిరిగి కలుస్తారు!
- ●Genetics and longevity | స్మోకింగ్, డ్రింకింగ్ చేసినా కొందరు వందేళ్లు ఎలా బతుకుతారు? ఆయుష్షు వెనకున్న అసలు రహస్యాన్ని విప్పిన సైంటిస్టులు
- ●Petroleum Dealers Association | పెట్రోల్ డీలర్ల డిమాండ్లపై ఢిల్లీలో కీలక భేటీ: పార్లమెంటరీ ప్యానెల్ ఛైర్మన్‌తో అసోసియేషన్ చర్చలు
- ●Section 22A lands Telangana | 22A భూముల చిక్కులు: ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఆ లిస్ట్‌లోనే.. ప్రభుత్వానికి నిపుణుల కీలక సూచనలు

SBI Recruitment | SBI జూనియర్ అసోసియేట్స్ రిక్రూట్మెంట్.. 9,124 పోస్టులకు దరఖాస్తులు షురూ

‘హస్తం’ గూటిలో ‘గులాబీ’ల త్రిశంకు స్వర్గం: అభివృద్ధి ఆశలు.. గౌరవం గల్లంతు: ఫిరాయింపు నేతల రాజకీయ తంటాలు!

Horoscope | ఆగస్టు 12 రాశిఫలాలు.. ఈ రాశి వారు పాత మిత్రులను తిరిగి కలుస్తారు!

Genetics and longevity | స్మోకింగ్, డ్రింకింగ్ చేసినా కొందరు వందేళ్లు ఎలా బతుకుతారు? ఆయుష్షు వెనకున్న అసలు రహస్యాన్ని విప్పిన సైంటిస్టులు



