Sanjay Malhotra | ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సవాళ్లు.. అప్రమత్తతే కీలకం: ఆర్‌బీఐ గవర్నర్
Sanjay Malhotra | ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. దేశాల మధ్య పెరుగుతున్న విభేదాలు, వాణిజ్య పరిమితులు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు, సాంకేతిక పరిణామాలు, వాతావరణ మార్పులు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.
Sanjay Malhotra | ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. దేశాల మధ్య పెరుగుతున్న విభేదాలు, వాణిజ్య పరిమితులు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు, సాంకేతిక పరిణామాలు, వాతావరణ మార్పులు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక ముప్పులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. కోవిడ్ మహమ్మారి అనంతరం ప్రపంచం వరుస సంక్షోభాలను చవిచూసిందని మల్హోత్రా పేర్కొన్నారు. ఆరోగ్య సంక్షోభంతో పాటు సరఫరా సమస్యలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, భౌగోళిక-రాజకీయ పరిణామాలు వంటి అంశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేశాయని తెలిపారు. అయినప్పటికీ వ్యవస్థ అనేక ఒడిదుడుకులను తట్టుకుని నిలబడిందన్నారు.
స్థిరత్వంతో మరో ముప్పు
ఆర్థిక పరిస్థితులు కొంతకాలం స్థిరంగా కొనసాగితే మరో రకమైన ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని గవర్నర్ హెచ్చరించారు. గతంలో ఎదురైన సంక్షోభాల అనుభవాలు క్రమంగా మరుగునపడితే.. వ్యక్తులు, సంస్థలు, ఆర్థిక వ్యవస్థలోని భాగస్వాములు రిస్క్ తీసుకునే ధోరణిని పెంచుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ముఖ్యంగా అధికంగా అప్పులు చేయడం, సామర్థ్యానికి మించి రిస్క్ తీసుకోవడం వంటి పరిణామాలకు ఇది దారితీయొచ్చన్నారు. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో పేరుకుపోయిన సమస్యలు ఒక్కసారిగా వెలుగులోకి రావచ్చని మల్హోత్రా పేర్కొన్నారు. అయితే సంక్షోభం తలెత్తిన తర్వాత దాన్ని చక్కదిద్దేందుకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుందని చెప్పారు. అందువల్ల పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పుడే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మారుతున్న ప్రపంచ వాణిజ్య వ్యవస్థ
ఇప్పటివరకు ప్రపంచ ఆర్థిక వృద్ధికి దోహదం చేసిన విధానాల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయని గవర్నర్ తెలిపారు. దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక విభేదాలు పెరగడం, వాణిజ్య పరిమితులు, సరఫరా గొలుసుల్లో అంతరాయాలు వంటి అంశాలు అంతర్జాతీయ ఆర్థిక వాతావరణాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయని చెప్పారు. ఇలాంటి పరిణామాలు గతంలోనూ ప్రపంచ వృద్ధి, ద్రవ్యోల్బణం, ఆర్థిక మార్కెట్లపై ప్రభావం చూపినట్లు ఆర్‌బీఐ విశ్లేషణల్లో పేర్కొంది. ప్రపంచ ఆర్థిక పరిణామాలు పరస్పరం అనుసంధానమై ఉన్నందున కేంద్ర బ్యాంకులు కేవలం దేశీయ ద్రవ్యోల్బణం, ఆర్థిక స్థిరత్వానికే పరిమితం కాకుండా అంతర్జాతీయ పరిస్థితులనూ నిరంతరం పర్యవేక్షించాలని మల్హోత్రా సూచించారు. ప్రపంచ పరిణామాల్లో ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నప్పుడు వాటి ప్రభావం దేశీయ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉన్నందున ముందస్తు అప్రమత్తత అవసరమని స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bollywood Debut | అడవి నుంచి కెమెరా ముందుకు..! మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్
అక్టోబర్ 3, 2026

TG Weather | తెలంగాణకు ఐఎండీ తీపి కబురు.. మళ్లీ జోరందుకోనున్న వానలు..!
అక్టోబర్ 3, 2026

Men’s Hockey Team | ఆసియా క్రీడల్లో హాకీ గోల్డ్.. మలేసియాపై భారత్ సూపర్ విక్టరీ.. ఒలింపిక్స్‌కు అర్హత
అక్టోబర్ 3, 2026
తాజావార్తలు
- ●Chintala Ramachandra Reddy | "ఉపఎన్నిక కోసం కొట్లాడింది మేము.. గెలిచేదీ మేమే": విజయా రెడ్డి పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం
- ●Bollywood Debut | అడవి నుంచి కెమెరా ముందుకు..! మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్
- ●Parliamentary Committee on Defence 2026 | పార్లమెంట్ రక్షణ కమిటీ పునర్వ్యవస్థీకరణ: తెలంగాణ నుంచి దామోదర్ రావు, ఏపీ నుంచి కేశినేని చిన్నికి చోటు.. చైర్మన్‌గా రాధా మోహన్ సింగ్
- ●TG Weather | తెలంగాణకు ఐఎండీ తీపి కబురు.. మళ్లీ జోరందుకోనున్న వానలు..!
- ●Kayadu Lohar | రెట్రో లుక్‌లో కయదు - క్యూట్ ఫాటోలతో మాయ చేసిన ప్యారడైజ్ హీరోయిన్
- ●Hyderabad Police Overstaying Foreigners | వీసా గడువు ముగిసినా హైదరాబాద్‌లోనే అక్రమంగా ఉంటూ విదేశీయులు ఏం చేస్తున్నారంటే?

Chintala Ramachandra Reddy | "ఉపఎన్నిక కోసం కొట్లాడింది మేము.. గెలిచేదీ మేమే": విజయా రెడ్డి పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం

Bollywood Debut | అడవి నుంచి కెమెరా ముందుకు..! మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్

Parliamentary Committee on Defence 2026 | పార్లమెంట్ రక్షణ కమిటీ పునర్వ్యవస్థీకరణ: తెలంగాణ నుంచి దామోదర్ రావు, ఏపీ నుంచి కేశినేని చిన్నికి చోటు.. చైర్మన్‌గా రాధా మోహన్ సింగ్

TG Weather | తెలంగాణకు ఐఎండీ తీపి కబురు.. మళ్లీ జోరందుకోనున్న వానలు..!



