త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

K Laxman | సేవ్ డెమోక్రసీ కాదు.. సేవ్ డైనాస్టీ మార్చ్ : కే లక్ష్మణ్

K Laxman | కాంగ్రెస్‌ చేపట్టిన ‘సేవ్ డెమోక్రసీ మార్చ్’ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని, కుటుంబ వారసత్వాన్ని కాపాడుకునేందుకేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్‌ విమర్శించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌, రాహుల్‌ గాంధీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

P

Telangana | Published On Oct 2, 2026, 7.28 pm IST

K Laxman | సేవ్ డెమోక్రసీ కాదు.. సేవ్ డైనాస్టీ మార్చ్ : కే లక్ష్మణ్
Advertisement

K Laxman | కాంగ్రెస్‌ చేపట్టిన ‘సేవ్ డెమోక్రసీ మార్చ్’ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని, కుటుంబ వారసత్వాన్ని కాపాడుకునేందుకేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్‌ విమర్శించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌, రాహుల్‌ గాంధీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్‌ ఈవీఎంలు, ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తోందన్నారు. కాంగ్రెస్‌ గెలిచిన రాష్ట్రాల్లో ప్రజా తీర్పును అంగీకరించి, ఓడిన చోట ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా దొంగ, డూప్లికేట్‌, మృతుల ఓట్లను తొలగిస్తుంటే కాంగ్రెస్‌ ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. మజ్లిస్‌కు అనుకూలంగా దొంగ ఓట్లను కాపాడేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన చరిత్ర కాంగ్రెస్‌దేనని లక్ష్మణ్‌ విమర్శించారు. ఎన్నికల సంఘం, రాజ్యాంగంపై మాట్లాడే ముందు కాంగ్రెస్‌ తన గతాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ‘ఆర్ఆర్ రాజ్యాంగం’ నడుస్తోందా? అని రాహుల్‌ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. రాజ్యాంగం గురించి మాట్లాడే రాహుల్‌కు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు కనిపించడం లేదా అన్నారు. ఈవీఎంలను వ్యతిరేకిస్తున్న రాహుల్‌ గాంధీ.. రాజీవ్‌ గాంధీ హయాంలో వాటిని ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలని లక్ష్మణ్‌ అన్నారు. ‘వన్‌ నేషన్‌–వన్‌ ఎలక్షన్‌’ను కాంగ్రెస్‌ ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు తగిన సమయంలో సమాధానం చెబుతారని పేర్కొన్నారు.

Advertisement
Advertisement