త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bollywood Debut | అడ‌వి నుంచి కెమెరా ముందుకు..! మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్

Bollywood Debut | ఒకప్పుడు అడవుల్లో తుపాకులు పట్టిన చేతులు ఇప్పుడు కెమెరా ముందుకు రానున్నాయి. హింసకు స్వస్తి పలికి జనజీవన స్రవంతిలోకి వచ్చిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన తొమ్మిది మంది మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్‌లో నటించే అవకాశం దక్కింది. ఇటీవల రాయ్‌పూర్‌లో నిర్వహించిన ఫ్యాషన్ షోలో వారు చేసిన ర్యాంప్ వాక్‌కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ అవకాశం వచ్చినట్లుగా స‌మాచారం.

P

National | Published On Oct 3, 2026, 8.13 pm IST

Bollywood Debut | అడ‌వి నుంచి కెమెరా ముందుకు..! మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్
Advertisement

Bollywood Debut | ఒకప్పుడు అడవుల్లో తుపాకులు పట్టిన చేతులు ఇప్పుడు కెమెరా ముందుకు రానున్నాయి. హింసకు స్వస్తి పలికి జనజీవన స్రవంతిలోకి వచ్చిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన తొమ్మిది మంది మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్‌లో నటించే అవకాశం దక్కింది. ఇటీవల రాయ్‌పూర్‌లో నిర్వహించిన ఫ్యాషన్ షోలో వారు చేసిన ర్యాంప్ వాక్‌కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ అవకాశం వచ్చినట్లుగా స‌మాచారం. సుక్మా జిల్లాకు చెందిన ఈ తొమ్మిది మంది మహిళలు ఆగస్టులో రాయ్‌పూర్‌లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర గ్రామోద్యోగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్ షోలో సంప్రదాయ దుస్తులు ధరించి ర్యాంప్‌పై సందడి చేశారు. గతంలో ఎదుర్కొన్న పరిస్థితులకు భిన్నంగా ఎంతో ఆత్మవిశ్వాసంతో వారు ర్యాంప్ వాక్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వీడియో చిత్ర దర్శకుడు ఆకాశ్ ఆదిత్య లామా దృష్టిలో పడింది.

కీలక పాత్రలకు అవకాశం

‘బెంగాల్ 1947’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆకాశ్ ఆదిత్య లామా తన తదుపరి చిత్రంలో ఈ మహిళలకు అవకాశం కల్పించేందుకు ఆసక్తి చూపినట్లు సమాచారం. 1994లో బస్తర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ సున్నితమైన వాస్తవ ఘటన ఆధారంగా సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. మావోయిజం ప్రభావిత ప్రాంతాల్లో జీవించిన అనుభవం ఉన్నందున.. సినిమాలోని పాత్రలకు వీరి సహజమైన నటన మరింత బలాన్ని చేకూరుస్తుందని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా చిత్రీకరణను నవంబర్, డిసెంబర్ నెలల్లో బస్తర్ అడవుల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. నటించే అవకాశం దక్కిన తొమ్మిది మందికి ముందుగా ఆడిషన్లు నిర్వహించనున్నారు. అనంతరం సుమారు 10 నుంచి 15 రోజుల పాటు నటనపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

సీఎం విష్ణుదేవ్ సాయ్ హ‌ర్షం

మాజీ మహిళా మావోయిస్టులకు సినీ రంగంలో అవకాశం లభించడంపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్‌ హర్షం వ్యక్తం చేశారు. హింసను విడిచిపెట్టి సాధారణ జీవితంలోకి వచ్చిన వారికి ఇలాంటి అవకాశాలు లభించడం పునరావాస ప్రక్రియకు ఊతమివ్వడంతో పాటు సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఒకప్పుడు అడవుల్లో తుపాకులు పట్టిన మహిళలు.. ఇప్పుడు అదే చేతులతో కెమెరా ముందు నటించేందుకు సిద్ధమవుతుండటం ఈ పరిణామంలో ప్రత్యేకతగా నిలిచింది.

Advertisement

తాజావార్తలు

Advertisement