Goru Chikkudu | 12 అడుగుల ఎత్తులో గోరు చిక్కుడు.. ఆశ్చర్యంగా తిలకిస్తున్న స్థానికులు
Goru Chikkudu | సాధారణంగా కూరగాయల మొక్కలు రెండు నుంచి మూడు అడుగుల వరకు పెరుగుతాయి. కొన్ని మొక్కలైతే నాలుగు నుంచి ఐదు అడుగుల వరకు కూడా పెరుగుతాయి. అలాంటి వాటిలో గోరు చిక్కుడు మొక్క ఒకటి.
Goru Chikkudu | త్రినేత్ర.న్యూస్ : సాధారణంగా కూరగాయల మొక్కలు రెండు నుంచి మూడు అడుగుల వరకు పెరుగుతాయి. కొన్ని మొక్కలైతే నాలుగు నుంచి ఐదు అడుగుల వరకు కూడా పెరుగుతాయి. అలాంటి వాటిలో గోరు చిక్కుడు మొక్క ఒకటి. కానీ ఈ గోరు చిక్కుడు మొక్క మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఏకంగా 12 అడుగుల ఎత్తుకు పెరిగి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరి ఈ మొక్క ఎక్కడ పెరిగిందంటే..?
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురానికి చెందిన రైతు రాయల వెంకటేశ్వర్లు.. తన ఇంటి ఆవరణలో కూరగాయల మొక్కలు పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మూడు నెలల క్రితం గోరు చిక్కుడు విత్తనాలు నాటగా అవి మొలకెత్తాయి. మొత్తం 15 మొక్కలు మొలకెత్తగా.. ఇందులో ఒక మొక్క మాత్రం 12 అడుగుల ఎత్తు వరకు పెరిగింది. ఈ మొక్క నుంచి ఇప్పటికీ మూడు సార్లు గోరు చిక్కుడు కాయలు కోశాడు రైతు. ఈ మొక్కను స్థానికులు ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు.
ఈ గోరు చిక్కుడు మొక్క భారీ పెరుగుదలపై మధిర వ్యవసాయ పరిశోధన కేంద్రం సైంటిస్ట్ డాక్టర్ రుక్మిణీదేవిని రైతు సంప్రదించగా.. మొక్క పెరుగుదలకు సారవంతమైన నేలనే కారణమని తెలిపారు. ఎరువులు కూడా సకాలంలో వేయడంతో మొక్కలు ఇలా ఎత్తు పెరుగుతాయని పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Konda Murali | ఢిల్లీకి రామ్మ అంటే గూడా సురేఖమ్మ పోతలేదు
- ●NIMS | చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు
- ●CM Revanth Reddy | రోశయ్య దూర దృష్టి వల్లే తెలంగాణకు మిగులు బడ్డెట్
- ●RGV on Artificial Intelligence | జేబులో చిల్లిగవ్వ లేనప్పుడు ఎదురుగా నగదుతో నిండిన పెద్ద లాకర్ ఉంటే దాన్ని తెరవకుండా ఎంతసేపు ఉండగలరు?
- ●TG Weather | మరో మూడురోజులు తెలంగాణలో భారీ వర్షాలు.. ఐఎండీ వార్నింగ్..!
- ●Rashmika Mandanna | ఆనంద్ దేవరకొండ ఎపిక్‌కు రష్మిక మందన్న రివ్యూ - కన్నీళ్లు పెట్టుకున్నా విజయ్ దేవరకొండ

Konda Murali | ఢిల్లీకి రామ్మ అంటే గూడా సురేఖమ్మ పోతలేదు

NIMS | చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు

CM Revanth Reddy | రోశయ్య దూర దృష్టి వల్లే తెలంగాణకు మిగులు బడ్డెట్

RGV on Artificial Intelligence | జేబులో చిల్లిగవ్వ లేనప్పుడు ఎదురుగా నగదుతో నిండిన పెద్ద లాకర్ ఉంటే దాన్ని తెరవకుండా ఎంతసేపు ఉండగలరు?




