Harini Murdered Case | బైకు క్లచ్ వైర్‌తో గొంతుకు బిగించి ప్రేయసి హత్య.. అసలెందుకు చంపాడంటే!
Harini Murdered Case | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెంలో సంచలనం సృష్టించిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఇంద్రవెల్లి హరిణి (18) హత్య కేసును పోలీసులు ఛేదించారు.
- దూరం పెట్టినందుకే ఘాతుకం
- బైక్ కోసం వచ్చి చిక్కిన నిందితుడు పవన్
- నర్సింగ్ విద్యార్థిని హరిణి హత్య కేసును ఛేదించిన పోలీసులు.. వివరాలు వెల్లడించిన కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ
Harini Murdered Case | త్రినేత్ర న్యూ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెంలో సంచలనం సృష్టించిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఇంద్రవెల్లి హరిణి (18) హత్య కేసును పోలీసులు ఛేదించారు. అప్పటివరకు లవ్‌లో ఉండి ఒక్కసారిగా దూరం పెట్టడంతోనే నిందితుడు పవన్‌కుమార్ కక్ష పెంచుకుని హత్య చేశాడని పోలీసులు తెలిపారు. తనతో పాటు తెచ్చుకున్న బైకు క్లచ్ వైర్‌తో గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడని పేర్కొన్నారు. జూలూరుపాడు పోలీస్ స్టేషన్‌లో గురువారం విలేకరుల సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు.
డీఎస్పీ ఆదినారాయణ వివరాల ప్రకారం.. వెంగన్నపాలెం గ్రామానికి చెందిన సతీష్, రాజేశ్వరి దంపతుల కుమార్తె హరిణి, నిందితుడు దేవరకొండ పవన్ కుమార్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పవన్ కుమార్ ఎలాంటి పని చేయకుండా మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతుండడంతో హరిణి ఇటీవల అతడిని దూరం పెట్టింది. ఈ క్రమంలో ఏడాది క్రితం ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. పవన్ కుమార్ ప్రవర్తన సరిగా లేనందున తమ కూతురు హరిణిని ఇచ్చి పెళ్లి చేయలేమని కుటుంబ సభ్యులు తేల్చిచెప్పారు.
అయినా పవన్ హరిణిని కలిసి మళ్లీ ప్రేమకు ఒప్పించాడు. మళ్లీ కొన్ని రోజులు ప్రేమించుకున్నారు. అయినా పవన్‌లో మార్పు రాకపోవడంతో మళ్లీ దూరం పెట్టింది. దీంతో తరచూ ఆమె వెంటపడుతూ వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. విసిగిపోయిన హరిణి అతడి ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేయడంతో పాటు తన ఇన్‌స్టా ఖాతాను మార్చేసింది. దీంతో పవన్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. సెప్టెంబర్ 22న మధ్యాహ్నం సమయంలో వెంగన్నపాలెంలోని హరిణి ఇంటికి వెళ్లి ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో తీవ్ర ఆవేశానికి గురైన పవన్ తన వెంట తెచ్చుకున్న బైక్ గేర్ వైరుతో హరిణి మెడకు బిగించి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇంటి పక్కన ఉన్న మెట్ల పక్కన సందులో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
పోస్టుమార్టం రిపోర్టుతో..
హరిణి తల్లి రాజేశ్వరి ఫిర్యాదు మేరకు జూలూరుపాడు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదికలో యువతి మెడకు వైరు లాంటిది బిగించి చంపినట్లు వైద్యులు నిర్ధారించడంతో పోలీసులు హత్య కేసుగా మార్చి దర్యాప్తును ముమ్మరం చేశారు.
ర్యాపిడో నడుపుకుందామని ప్లాన్..
నిందితుడు పవన్ కుమార్ తన గ్లామర్ బైక్‌ను ఒంటిగుడిసె రోడ్డులోని సీతారామ ప్రాజెక్టు కాల్వ వద్ద ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టాడు. అక్కడి నుంచి విశాఖపట్నం పారిపోయాడు. ఆ తర్వాత తిరుపతి వెళ్లి, అక్కడి నుంచి తిరిగి ఖమ్మం వచ్చాడు. వేరే ప్రాంతానికి వెళ్లి రాపిడో నడుపుకుంటూ బతుకుదామన్న ఉద్దేశంతో దాచిపెట్టిన బైక్ తీసుకునేందుకు జూలూరుపాడు చేరుకున్నాడు. పక్కా సమాచారంతో పవన్‌ను పట్టుకున్నారు. అతడి నుంచి హత్యకు ఉపయోగించిన బైక్ గేర్ వైర్, గ్లామర్ బైక్, రెండు మొబైల్ ఫోన్లు, హత్య సమయంలో నిందితుడు ధరించిన షర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన జూలూరుపాడు పోలీసు సిబ్బందిని డీఎస్పీ ఆదినారాయణ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో సీఐ శ్రీలక్ష్మి, ఎస్ఐ జీనత్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Physiotherapists Jobs | జర్మనీలో ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాలు.. వివరాలివే..
- ●Hrithik Roshan | ఐదేళ్ల ప్రేమాయణం - ప్రియురాలితో రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన హృతిక్ రోషన్
- ●Adluri Laxman | 33 జిల్లాల్లో వృద్ధాశ్రమాలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
- ●KTR | రేవంత్ నల్లమల పులి కాదు.. చంద్రబాబు దగ్గర పిల్లి
- ●CBI | రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కేసులో మరో ఛార్జ్‌షీట్.. 11 మందిపై సీబీఐ కేసు..
- ●India manufacturing PMI September 2026 | దూసుకెళ్లిన భారత తయారీ రంగం: 7 నెలల గరిష్టానికి పీఎంఐ.. భారీగా పెరిగిన ఉద్యోగాలు

Physiotherapists Jobs | జర్మనీలో ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాలు.. వివరాలివే..

Hrithik Roshan | ఐదేళ్ల ప్రేమాయణం - ప్రియురాలితో రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన హృతిక్ రోషన్

Adluri Laxman | 33 జిల్లాల్లో వృద్ధాశ్రమాలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్

KTR | రేవంత్ నల్లమల పులి కాదు.. చంద్రబాబు దగ్గర పిల్లి




