త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

World Giraffe Day | ప్ర‌పంచ జిరాఫీ దినోత్స‌వం.. హైద‌రాబాద్ జూలో ‘బ‌న్నీ’ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌

World Giraffe Day | ప్ర‌పంచ జిరాఫీ దినోత్స‌వం( World Giraffe Day ) సంద‌ర్భంగా హైద‌రాబాద్ జూ పార్కు( Hyderabad Zoo Park )లో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌ణ‌పై ప‌ర్యాట‌కుల‌కు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మాల్లో భాగంగా జూలో ఉన్న జిరాఫీకి బ‌ర్త్ డే( Giraffe Birth Day ) సెల్ర‌బేష‌న్స్ ఘ‌నంగా నిర్వ‌హించారు.

S

Telangana | Published On Jun 22, 2026, 3.01 pm IST

World Giraffe Day | ప్ర‌పంచ జిరాఫీ దినోత్స‌వం.. హైద‌రాబాద్ జూలో ‘బ‌న్నీ’ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌
Advertisement

World Giraffe Day | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌పంచ జిరాఫీ దినోత్స‌వం( World Giraffe Day ) సంద‌ర్భంగా హైద‌రాబాద్ జూ పార్కు( Hyderabad Zoo Park )లో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌ణ‌పై ప‌ర్యాట‌కుల‌కు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మాల్లో భాగంగా జూలో ఉన్న జిరాఫీకి బ‌ర్త్ డే( Giraffe Birth Day ) సెల్ర‌బేష‌న్స్ ఘ‌నంగా నిర్వ‌హించారు.

పండ్లు, కూర‌గాయాలు, ఆకుప‌చ్చ‌ని ఆకులు, బీన్స్, న‌ట్స్‌తో కూడిన కేక్‌ను త‌యారు చేశారు. 10 ఏండ్ల వ‌య‌సున్న జిరాఫీ(బ‌న్నీ) వ‌ద్ద ఆ కేక్‌ను క‌ట్ చేశారు. అనంత‌రం కేక్‌ను జిరాఫీ ఆర‌గించింది. జిరాఫీ కేక్ తిన‌డాన్ని ప‌ర్యాట‌కులు ఎంజాయ్ చేశారు. త‌మ కెమెరాల్లో ఆ చిత్రాల‌ను బంధించి సంతోషం వ్య‌క్తం చేశారు.

అసిస్టెంట్ ఎనిమ‌ల్ కీప‌ర్ బుచ్చ‌న్న‌, జూ ఎడ్యుకేష‌న్ ఆఫీస‌ర్ దీప‌క్ త‌రుణ్ క‌లిసి ప‌ర్యాట‌కుల‌కు, విద్యార్థుల‌కు బ‌న్నీ జిరాఫీ యొక్క ప్ర‌త్యేక‌త‌లు, ఆహార‌పు అల‌వాట్లు, దాని యొక్క ప్ర‌వ‌ర్త‌న‌ను వివ‌రించారు. ప‌ర్యాట‌కులు కూడా ఎంతో ఆస‌క్తిగా విన్నారు.

ఈ సంద‌ర్భంగా డిప్యూటీ క్యూరేట‌ర్ జే ముర‌ళీధ‌ర్ మాట్లాడుతూ.. ప్ర‌తి ఏడాది జూన్ 21వ తేదీన సుదీర్ఘంగా ప‌గ‌లు ఉంటుంది. ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన జంతువు కూడా జిరాఫీ కాబట్టి.. జూన్ 21ని ప్ర‌పంచ జిరాఫీ దినోత్స‌వంగా జరుపుకుంటున్న‌ట్లు తెలిపారు. జిరాఫీలు ఆఫ్రికా దేశానికి చెందిన‌వ‌ని, ఇవి పూర్తిగా శాఖాహారులు అని పేర్కొన్నారు. వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి జిరాఫీ యొక్క చ‌ర్మం రంగును మార్చుకుంటుంద‌ని చెప్పారు.

Advertisement
Advertisement