త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Municipal Elections | డిసెంబ‌ర్‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. హైద‌రాబాద్‌తోపాటు వ‌రంగ‌ల్, ఖ‌మ్మం కార్పొరేష‌న్ల‌కు కూడా.!

Municipal Elections | రాష్ట్రంలో రెండో దశ మున్సిపల్‌ ఎన్నికలకు (Municipal Elections) రంగం సిద్ధమవుతున్న‌ది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి కార్పొరేషన్లతో పాటు ఎన్నికలు వాయిదా పడిన ఇతర పురపాలక సంస్థలకు డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించాల‌ని ప్రభుత్వం యోచిస్తున్న‌ట్లు సమాచారం

G

Telangana | Published On Aug 25, 2026, 7.46 am IST

Municipal Elections | డిసెంబ‌ర్‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. హైద‌రాబాద్‌తోపాటు వ‌రంగ‌ల్, ఖ‌మ్మం కార్పొరేష‌న్ల‌కు కూడా.!
Advertisement

Municipal Elections | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో రెండో దశ మున్సిపల్‌ ఎన్నికలకు (Municipal Elections) రంగం సిద్ధమవుతున్న‌ది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి కార్పొరేషన్లతో పాటు ఎన్నికలు వాయిదా పడిన ఇతర పురపాలక సంస్థలకు డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించాల‌ని ప్రభుత్వం యోచిస్తున్న‌ట్లు సమాచారం. దీంతో పురపాలక శాఖ అధికారులు ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి సారించినట్లు తెలుస్తున్న‌ది. స‌ర్ (SIR) ప్ర‌క్రియ అక్టోబ‌ర్ 19తో ముగియ‌నుండ‌టంతో ఆ త‌ర్వాత మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ వెలువ‌డే అవ‌కాశం ఉంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. అయితే అప్పటికి జీహెచ్‌ఎంసీ (GHMC), వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్ల పదవీకాలం పూర్తికాకపోవడంతో ఎన్నికలు నిర్వహించలేదు. అదేవిధంగా మందమర్రి, మణుగూరు, అచ్చంపేట, నకిరేకల్‌, కొత్తూరు, సిద్దిపేట మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగలేదు. కాగా, జీహెచ్ఎంసీని ప్ర‌భుత్వం సీఎంసీ (CMC), జీహెచ్ఎంసీ, ఎంఎంసీ (MMC)గా విభ‌జించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం అవి ప్ర‌త్యేక అధికారుల పాల‌న‌లో ఉన్నాయి. వాస్త‌వానికి పాల‌క‌మండ‌ళ్ల‌ కాల‌ప‌రిమితి ముగిసిన ఆరు నెల‌లోపు ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉంది. అయితే మున్సిపాలిటీల పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ నేప‌థ్యంలో ఎన్నిక‌ల ప్ర‌క్ర‌య ఆల‌స్య‌మైంది. ఈనేప‌థ్యంలో వీలైనంత త్వ‌రాగా వీట‌న్నింటికి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ది.

రాష్ట్రంలో ప్రస్తుతం ‘సర్‌’ ప్రక్రియ కొనసాగుతున్న‌ది. అధికారులు ప్ర‌ధానంగా దానిపైనే దృష్టిసారించారు. అక్టోబర్‌ 19 నాటికి ఆ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో ఆ త్వ‌రాత కొంత సమయం తీసుకుని డిసెంబరులో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలనే ప్రభుత్వం ఆలోచిస్తున్న‌ట్లు సమాచారం.

Advertisement
Advertisement