త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

GHMC | జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ.. కొత్త జోన్లు, స‌ర్కిళ్లు ఇవే..

GHMC | గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం మూడు విభాగాలుగా విభ‌జించింది. జీహెచ్ఎంసీ( GHMC )తో పాటు కొత్త‌గా సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్( CMC ), మ‌ల్కాజ్‌గిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌( MMC )గా విభ‌జిస్తూ ప్ర‌భుత్వం బుధ‌వారం ఉదయం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

S

Telangana | Published On Feb 11, 2026, 2.48 pm IST

GHMC | జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ.. కొత్త జోన్లు, స‌ర్కిళ్లు ఇవే..
Advertisement

మూడు కార్పొరేష‌న్లుగా గ్రేట‌ర్ హైద‌రాబాద్
జీహెచ్ఎంసీతో పాటు కొత్త‌గా సీఎంసీ, ఎంఎంసీ
జీహెచ్ఎంసీ 6 జోన్లు, సీఎంసీ, ఎంఎంసీ మూడు జొన్ల చొప్పున‌
కొత్త క‌మిష‌న‌ర్ల నియామ‌కం..
ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు జారీ

GHMC | త్రినేత్ర‌.న్యూస్ : గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం మూడు విభాగాలుగా విభ‌జించింది. జీహెచ్ఎంసీ( GHMC )తో పాటు కొత్త‌గా సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్( CMC ), మ‌ల్కాజ్‌గిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌( MMC )గా విభ‌జిస్తూ ప్ర‌భుత్వం బుధ‌వారం ఉదయం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇక జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌గా ఆర్వీ క‌ర్ణ‌న్‌ను కొన‌సాగిస్తూ.. సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు శ్రీజ‌న‌, మ‌ల్కాజ్‌గిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు విన‌య్ కృష్ణారెడ్డిని నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

పాత గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని 150 డివిజ‌న్లు డీలిమిటేష‌న్‌తో 243 అయ్యాయి. విలీన మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల సంస్థ‌ల ప‌రిధిలో 57 డివిజ‌న్లు ఏర్పాట‌య్యాయి. మొత్తం 300 డివిజ‌న్ల‌కు విస్త‌రించిన జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిపాల‌న సౌల‌భ్యం, అధికార వికేంద్రీక‌ర‌ణ ల‌క్ష్యాల‌తో మూడు కార్పొరేష‌న్లుగా విభ‌జించింది. జీహెచ్ఎంసీ చ‌ట్టం-1995, సెక్ష‌న్‌-3(1) ప్ర‌కారం జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీని ఏర్పాటు చేసింది.

జీహెచ్ఎంసీని మొత్తం 6 జోన్లు, 30 స‌ర్కిళ్లు, 150 వార్డులుగా ప్ర‌భుత్వం విభ‌జించింది. శంషాబాద్, రాజేంద్ర‌న‌గ‌ర్‌, చార్మినార్, గోల్కొండ‌, ఖైర‌తాబాద్, సికింద్రాబాద్‌ల‌ను జోన్లుగా నిర్ణ‌యించింది. ఆయా జోన్ల ప‌రిధిలో స‌ర్కిళ్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

జీహెచ్ఎంసీ(ఆరు జోన్లు, 30 స‌ర్కిళ్లు)

1. శంషాబాద్ జోన్‌(4 స‌ర్కిళ్లు) : ఆదిభ‌ట్ల‌, బడంగ్‌పేట్‌, జ‌ల్‌ప‌ల్లి, శంషాబాద్
2. రాజేంద్ర‌న‌గ‌ర్‌(6 స‌ర్కిళ్లు) : రాజేంద్ర‌న‌గ‌ర్‌, అత్తాపూర్, బ‌హ‌దూర్‌పురా, ఫ‌ల‌క్‌నూమా, చాంద్ర‌య‌ణ‌గుట్ట‌, జంగంపేట్‌
3. చార్మినార్ జోన్‌(5 స‌ర్కిళ్లు) : సంతోష్ న‌గ‌ర్‌, యాకుత్‌పురా, మ‌ల‌క్‌పేట్, చార్మినార్, ముసారాంబాగ్‌
4. గోల్కొండ జోన్‌(5 స‌ర్కిళ్లు) : గోషామ‌హ‌ల్‌, కార్వాన్, గోల్కొండ‌, మెహిదీప‌ట్నం, మాస‌బ్‌ట్యాంక్
5. ఖైర‌తాబాద్ జోన్‌(5 స‌ర్కిళ్లు) : ఖైర‌తాబాద్, జూబ్లీహిల్స్‌, బోరబండ‌, యూసుఫ్‌గూడ‌, అమీర్‌పేట‌
6. సికింద్రాబాద్ జోన్‌(5 స‌ర్కిళ్లు) : క‌వాడిగూడ‌, ముషీరాబాద్‌, అంబ‌ర్‌పేట్‌, తార్నాక‌, మెట్టుగూడ‌

సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్(మూడు జోన్లు, 16 స‌ర్కిళ్లు)

1. శేరిలింగంప‌ల్లి జోన్‌(5 స‌ర్కిళ్లు) : నార్సింగి, ప‌టాన్‌చెరు, అమీన్‌పూర్, మియాపూర్, శేరిలింగంప‌ల్లి.
2. కూక‌ట్‌ప‌ల్లి జోన్‌(4 స‌ర్కిళ్లు) : మాదాపూర్, అల్విన్ కాల‌నీ, కూక‌ట్‌ప‌ల్లి, మూసాపేట్‌
3. కుత్బుల్లాపూర్ జోన్‌(7 స‌ర్కిళ్లు) : చింత‌ల్, జీడిమెట్ల‌, కొంప‌ల్లి, గాజుల‌రామారం, నిజాంపేట్‌, దుండిగ‌ల్‌, మేడ్చ‌ల్‌

మ‌ల్కాజ్‌గిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(మూడు జోన్లు, 14 స‌ర్కిళ్లు)

1. మ‌ల్కాజ్‌గిరి జోన్‌(5 స‌ర్కిళ్లు) : కీస‌ర‌, అల్వాల్, బోయిన్‌ప‌ల్లి, మౌలాలి, మ‌ల్కాజ్‌గిరి
2. ఉప్ప‌ల్ జోన్‌(5 స‌ర్కిళ్లు) : ఘ‌ట్‌కేస‌ర్, కాప్రా, నాచారం, ఉప్ప‌ల్, బోడుప్ప‌ల్
3. ఎల్‌బీన‌గ‌ర్ జోన్(4 స‌ర్కిళ్లు) : నాగోల్, స‌రూర్‌న‌గ‌ర్, ఎల్‌బీన‌గ‌ర్‌, హ‌య‌త్‌న‌గ‌ర్

కొత్త జోన్లు, స‌ర్కిళ్ల మ్యాపులు ఇవే..

Advertisement
Advertisement