Suicide | తోటి ఉద్యోగిని, విలేకరులు వేధిస్తున్నారని.. గ్యాస్ గోదాం మేనేజర్ ఆత్మహత్య
Suicide | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో విషాదం చోటుచేసుకుంది. తోటి ఉద్యోగి, ఆమె భర్త వేధింపులు తాళలేక గ్యాస్ గోదాం మేనేజర్ ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు.
Suicide | త్రినేత్ర న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో విషాదం చోటుచేసుకుంది. తోటి ఉద్యోగి, ఆమె భర్త వేధింపులు తాళలేక గ్యాస్ గోదాం మేనేజర్ ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. అనంతుల లక్ష్మీనారయణ (56) పాల్వంచ గ్యాస్ గోదాం మేనేజర్‌గా (Gas Godown Manager) పని చేస్తున్నారు. గోదాంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న రజిత సుమారు నెల రోజుల క్రితం ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) విచారణ చేపట్టింది. దీంతో లక్ష్మీనారయణ గత 21 రోజులుగా లీవ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో లక్ష్మీనారాయణ తాను పనిచేస్తున్న కార్యాలయ వాట్సాప్ గ్రూపులో సూసైడ్ నోట్ పోస్టు చేశారు.
గమనించిన తోటి ఉద్యోగులు ఆయన ఆచూకీ కోసం గాలించగా, పట్టణంలోని (Palvancha) గోదావరి లాడ్జిలో ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు లాడ్జికి చేరుకునేసరికి ఉరి వేసుకుని ఉన్నారు. దీంతో హుటాహుటిన ఆయనను భద్రాచలం ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
కాగా, సూసైడ్ నోట్లో తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను లక్ష్మీనారాయణ ఖండించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తనను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపిస్తూ రజిత, ఆమె భర్త ఆమె భర్త నాయిని రాజేశ్ (ఓ దినపత్రిక రిపోర్టర్)తోపాటు నాగచందు (10టీవీ రిపోర్టర్), కలీమ్ (హెచ్‌పీ గ్యాస్ ఉద్యోగి, రిపోర్టర్), వెంకన్న (బిగ్ టీవీ రిపోర్టర్), రవి (టీవీ9 రిపోర్టర్) పేర్లను సూసైడ్ అందులో ప్రస్తావించారు. ఫిర్యాదు వాపసు తీసుకునేందుకు రూ. కోటి అడుగుతున్నట్లు కలీం చెప్పాడని మెసేజ్‌లో తెలిపారు. మృతుని కుమార్తె ఫిర్యాదు మేరకు ఆరుగురు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కీలక విషయాలు
లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకునే ముందు మరణ వాంగూల్మం పేరుతో వాట్సాప్ గ్రూపులో పెట్టిన లేఖలో కీలక విషయాలు తెలిపారు. పాల్వంచ గ్యాస్ ఆఫీసులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని 2025లోనే జిల్లా మేనేజరుకు లేఖ రాసినట్టు తెలిపారు. సీసీ కెమెరాలు లేకపోవటంతో ఓ మహిళా ఉద్యోగి అవినీతికి తెరలేపారని, తాను అడ్డుకున్నందుకు తనపై కక్షగట్టారని ఆరోపించారు. ‘మీరు వినియోగదారుల వద్ద ఎందుకు ఎక్కువ డబ్బులు తీసుకోరు? మీరు తీసుకోరు.. మమ్మల్ని కూడా తీసుకోనివ్వరు. ఇలా అయితే ఎలా సార్’ అని ఆ మహిళా ఉద్యోగి తనను ప్రశ్నించేదని లేఖలో ప్రస్తావించారు. ఆ ఉద్యోగినితోపాటు ఆమె భర్త.. మూడు ప్రముఖ టీవీ చానళ్లకు చెందిన ముగ్గురు విలేకరులు, మరికొందరు కలిసి తనను తీవ్రంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశాడు. తనను బూతులు తిట్టి బెదిరించారని ఆరోపించాడు. సదరు మహిళా ఉద్యోగి తనపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా విచారణ చేశారని తెలిపారు.
తాజావార్తలు
- ●Prabhas Spirit | అఫీషియల్ : ప్రభాస్ స్పిరిట్ వాయిదా - ఫౌజీ కోసమేనా?
- ●Shami Tree | శమీ వృక్షాలు నాటి పెంచుతాం.. పర్యావరణహితానికి ప్రతిన తీసుకుంటాం
- ●Nayanthara | ఐదోసారి జోడీ కుదిరిందా? - ధర్మన్‌లో సూపర్ స్టార్ వర్సెస్ లేడీ సూపర్‌స్టార్
- ●Moon shrinking | కుచించుకుపోతున్న చంద్రుడు..
- ●Tollywood | వాట్ నెక్స్ట్ - స్టార్ హీరోయిన్ల కొత్త సినిమా కబురు ఎప్పుడు?
- ●Harish Rao | పండుగలు వస్తే చాలు.. ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలను బాదుడేనా రేవంత్?: హరీశ్ రావు

Prabhas Spirit | అఫీషియల్ : ప్రభాస్ స్పిరిట్ వాయిదా - ఫౌజీ కోసమేనా?

Shami Tree | శమీ వృక్షాలు నాటి పెంచుతాం.. పర్యావరణహితానికి ప్రతిన తీసుకుంటాం

Nayanthara | ఐదోసారి జోడీ కుదిరిందా? - ధర్మన్‌లో సూపర్ స్టార్ వర్సెస్ లేడీ సూపర్‌స్టార్

Moon shrinking | కుచించుకుపోతున్న చంద్రుడు..






