త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shami Tree | శ‌మీ వృక్షాలు నాటి పెంచుతాం.. ప‌ర్యావ‌ర‌ణహితానికి ప్ర‌తిన తీసుకుంటాం

Shami Tree | గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్య‌వ‌స్థాప‌కులు సంతోశ్‌కుమార్ స్ఫూర్తితో మ‌హారాష్ట్ర‌లోని నాందేడ్ జిల్లా ధ‌ర్మాబాద్‌ (Dharmabad) లోని స్వామి స‌మ‌ర్థ ఆల‌య ప్రాంగ‌ణంలో మ‌హిళ‌లు ఆదివారం శ‌మీ వృక్షం నాటారు.

S

Telangana | Published On Oct 18, 2026, 12.56 pm IST

Shami Tree | శ‌మీ వృక్షాలు నాటి పెంచుతాం.. ప‌ర్యావ‌ర‌ణహితానికి ప్ర‌తిన తీసుకుంటాం
Advertisement
  • మ‌హారాష్ట్ర‌లోని ఆల‌య ప్రాంగ‌ణంలో శ‌మీ మొక్క‌ నాటి సంతోశ్‌కుమార్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మ‌హిళ‌లు

Shami Tree | త్రినేత్ర న్యూస్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్య‌వ‌స్థాప‌కులు సంతోశ్‌కుమార్ స్ఫూర్తితో మ‌హారాష్ట్ర‌లోని నాందేడ్ జిల్లా ధ‌ర్మాబాద్‌ (Dharmabad) లోని స్వామి స‌మ‌ర్థ ఆల‌య ప్రాంగ‌ణంలో మ‌హిళ‌లు ఆదివారం శ‌మీ వృక్షం నాటారు. “శమీ వృక్షం- విశ్వాసం, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణల సమ్మేళనం” అనే గొప్ప సందేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన‌ట్లు స్థానిక మ‌హిళ‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా వారు సంతోశ్‌కుమార్‌కు, గ్రీన్ ఇండియా ప్రతినిధి రాఘవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

పర్యావరణ పరిరక్షణ కోసం విస్తృతంగా చేపట్టిన ఈ ఉద్యమానికి వారు అందించిన మార్గదర్శకత్వం, మద్దతు, ప్రజల్లో అవగాహన కల్పించడం గొప్ప విష‌య‌మ‌న్నారు. మహారాష్ట్రలోని ఆలయాలు, మఠాలు, గృహాల్లో శమీ వృక్షాలను నాటాలనే సంకల్పాన్ని వ్యాప్తి చేసినందుకు వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు.

మహారాష్ట్ర నేలపై మతపరమైన, సాంస్కృతిక, పర్యావరణ ప్రాధాన్యం కలిగిన శమీ వృక్షాలను ప్రతి ఆలయం, ప‌రిసరాల్లో నాటాల‌న్నారు. పర్యావరణ అనుకూల సమాజాన్ని నిర్మించాలనే సామూహిక సంకల్పాన్ని వ్యక్తం చేశారు. శమీ వృక్షాన్ని నాటి, దాన్ని పెంచి పోషించే బాధ్యతను తీసుకుంటామని వారు ప్రతిజ్ఞ చేశారు.

Advertisement
Advertisement