త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | వాట్ నెక్స్ట్ – స్టార్ హీరోయిన్ల కొత్త సినిమా క‌బురు ఎప్పుడు?

శ్రీలీల‌, త‌మ‌న్నా, మృణాల్ ఠాకూర్‌ల‌కు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. హిట్లు ఉన్నాయి. కానీ ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ‌లు టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చి ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తున్నారు. తెలుగులో వీరు కొత్త సినిమాను ఎప్పుడు అనౌన్స్‌చేస్తార‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

N

Entertainment | Published On Oct 18, 2026, 11.59 am IST

Tollywood | వాట్ నెక్స్ట్ – స్టార్ హీరోయిన్ల కొత్త సినిమా క‌బురు ఎప్పుడు?
Advertisement

Tollywood |  సినిమా ఇండ‌స్ట్రీలో హీరోల‌తో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ భిన్నంగా సాగుతుంటుంది. హీరోలు రెండు, మూడేళ్ల‌కు ఓ సినిమా చేస్తే హీరోయిన్లు మాత్రం ఏడాదిలోనే నాలుగైదు సినిమాల‌తో అభిమానుల‌ను ప‌ల‌క‌రిస్తుంటారు. అందాల నాయిక‌ల చేతిలో ఎప్ప‌డూ ఓ కొత్త సినిమా ఉండాల్సిందే. చిన్న గ్యాప్ ఇచ్చినా అవకాశాలు చేజారిపోతుంటాయి. అందుకే కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే వీలైనన్ని ఎక్కువ అవ‌కాశాలు ద‌క్కించుకోవాల‌ని స్టార్ హీరోయిన్లు క‌ల‌లు కంటుంటారు. కానీ తిరుగులేని క్రేజ్‌, స్టార్‌డ‌మ్ ఉన్న కొంద‌రు నాయిక‌లు టాలీవుడ్‌కు గ్యాప్ ఇస్తున్నారు. ఇత‌ర భాష‌ల్లో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో కొత్త సినిమా క‌బురు వినిపించే విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆ హీరోయిన్లు ఎవ‌రంటే?...

కోలీవుడ్‌లో బిజీ కానీ...

అతి త‌క్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది శ్రీలీల‌. అంతే త్వ‌ర‌గా ఈ ధ‌మాకా బ్యూటీ కెరీర్ డౌన్‌ఫాల్ అయ్యింది. నాలుగేళ్ల వ్య‌వ‌ధిలోనే తెలుగులో ప‌ద‌కొండు సినిమాలు చేసింది. స్టార్ హీరోల‌తో జోడీక‌ట్టింది. కానీ ఈ అమ్మ‌డికి అదృష్టం మాత్రం క‌లిసిరాలేదు. భ‌గ‌వంత్ కేస‌రి, ధ‌మాకా మిన‌హా మిగిలిన సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తాకొట్టాయి. ఈ డిజాస్ట‌ర్ల‌తో శ్రీలీల తెలుగు కెరీర్ డైల‌మాలో ప‌డింది. తెలుగులో చివ‌ర‌గా ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌లో హీరోయిన్‌గా న‌టించింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా చేశాన‌నే పేరుత‌ప్ప శ్రీలీల‌కు ఈ సినిమా ఏ విధంగాను క‌లిసిరాలేదు. ఉస్తాద్ రిలీజై ఆరు నెల‌లు దాటిపోయినా తెలుగులో కొత్త సినిమాపై సంత‌కం చేయ‌లేదు శ్రీలీల‌. టాలీవుడ్‌లో శ్రీలీల‌ నెక్స్ట్ మూవీని ఎప్పుడూ అనౌన్స్‌చేస్తుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అవ‌కాశాలు రావ‌డం లేదా? మంచి పాత్ర‌లు దొర‌క్క టాలీవుడ్‌కు గ్యాప్ ఇస్తుందా? ఈ ధ‌మాకా బ్యూటీనే చెప్పాల‌ని ఫ్యాన్స్ అంటున్నారు. తెలుగు సినిమాల‌కు గ్యాప్ ఇచ్చిన శ్రీలీల త‌మిళం, బాలీవుడ్‌లో మాత్రం బిజీగా ఉంది.

త‌మ‌న్నా పేరు వినిపించ‌డం లేదు...

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా తెలుగు సిల్వ‌ర్‌స్క్రీన్‌పై క‌నిపించి ఏడాదిన్న‌ర‌దాటిపోయింది. ఓదెల త‌ర్వాత తెలుగులో సినిమా చేయ‌లేదు. ఈ అమ్మ‌డి పేరు కూడా టాలీవుడ్‌లో ఎక్క‌డ వినిపించ‌డం లేదు. టాలీవుడ్‌కు త‌మ‌న్నా టాటా చెప్పేసిన‌ట్లే క‌నిపిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలుగులో క‌మ్‌బ్యాక్ ఇవ్వ‌డానికి మిల్కీ బ్యూటీ చాలానే ప్ర‌య‌త్నాలు చేస్తోన్న‌ట్లు స‌మాచారం. హీరోయిన్‌గానే కాకుండా స్పెష‌ల్ సాంగ్స్ కూడా చేయ‌డానికి రెడీగా ఉన్న‌ట్లు హింట్ ఇస్తోంది. కానీ తెలుగు ద‌ర్శ‌కులు మాత్రం త‌మ‌న్నా వైపు క‌న్నెత్తికూడా చూడ‌టం లేద‌ని టాక్‌. ఇటీవ‌లే బాలీవుడ్ మూవీ వాన్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. హార‌ర్ ఫాంట‌సీగా తెర‌కెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మోస్తారు హిట్‌గా నిలిచింది. ఈ స‌క్సెస్‌తోనైనా త‌మ‌న్నాకు తెలుగులో అవ‌కాశం వ‌స్తుందో లేదో చూడాల్సిందే? తొ

తొమ్మిది నెల‌లు....

కొత్త సినిమా ఒప్పుకొని తొమ్మిది నెల‌లు దాటిపోయింది...ఇటీవ‌ల మృణాల్ ఠాకూర్ ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్ బాలీవుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ద‌క్షిణాదిలో మృణాల్ ఠాకూర్ మంచి స్టార్‌డ‌మ్‌, ఫేమ్ ఉన్నాయి. అయినా ఈ బ్యూటీ తెలుగు సినిమాల‌కు గ్యాప్ ఇవ్వ‌డం అభిమానుకు అంతుప‌ట్ట‌డం లేదు. సీతారామం సినిమాతో తెలుగులో ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ‌కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్‌తో అవ‌కాశాలు వ‌చ్చాయి. కానీ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. గ్లామ‌ర్ రోల్స్ దూరంగా ఉంటోంది. ఈ ఏడాది అడివిశేష్ డెకాయిట్‌లో త‌ల్లి పాత్ర‌లో క‌నిపించింది. ఇందులో మృణాల్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. డెకాయిట్ త‌ర్వాత మృణాల్ నెక్స్ట్ తెలుగు మూవీ కోసం అభిమానులు ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ రాకాలో మృణాల్ ఓ హీరోయిన్‌గా న‌టిస్తోన్న‌ట్లు చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ ఇటు మృణాల్‌తో పాటు అటు మూవీ టీమ్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.

అనుష్క అలా...భాగ్య‌శ్రీ ఇలా...

ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్ల‌కు స్ఫూర్తిగా నిలిచింది అనుష్క‌. లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో వ‌రుస‌గా హిట్లు అందుకుంది. కానీ అదంతా గ‌తం. ఇప్పుడు అనుష్క‌తో సినిమా చేయ‌డానికి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎవ‌రూ సిద్ధంగా లేరు. గ‌త ఏడాది క్రిష్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఘాటీ అనుష్క చివ‌రి మూవీ. ఈ సినిమా రిలీజై ఏడాది దాటినా అనుష్క నుంచి కొత్త సినిమా క‌బురు మాత్రం రాలేదు. ఫ్లాపుల్లో ఉన్న టైమ్‌లో గ్యాప్ లేకుండా తెలుగులో సినిమాలు అంగీక‌రించింది భాగ్య‌శ్రీ బోర్సే . గ‌త ఏడాది మూడు సినిమాలు చేసింది. లెనిన్ మూవీతో కెరీర్‌లో తొలి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. హిట్టు ద‌క్కిన త‌ర్వాత రూటు మార్చింది. తెలుగు సినిమాల‌కు గ్యాప్ ఇచ్చి త‌మిళం, మ‌ల‌యాలంలో బిజీ అవుతోంది.

Advertisement
Advertisement