Harish Rao | పండుగలు వస్తే చాలు.. ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలను బాదుడేనా రేవంత్?: హరీశ్ రావు
Harish Rao | పండుగల వేళ ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరుతో చార్జీలను రెండింతలు చేసి వసూలు చేస్తుండటంపై బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ చార్జీలు (Bus Fare Hike) పెంచి ప్రజలపై భారం మోపడమేంటని సీఎం రేవంత్ రెడ్డిని (Revanth Reddy) ప్రశ్నించారు.
Harish Rao | త్రినేత్ర న్యూస్: పండుగల వేళ ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరుతో చార్జీలను రెండింతలు చేసి వసూలు చేస్తుండటంపై బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ చార్జీలు (Bus Fare Hike) పెంచి ప్రజలపై భారం మోపడమేంటని సీఎం రేవంత్ రెడ్డిని (Revanth Reddy) ప్రశ్నించారు. బతుకమ్మ, దసరా పండుగవేళ (Dasara Festival) ప్రజలకు కానుకలు ఇవ్వాల్సింది పోయి.. టికెట్ ధరలను డబుల్ చేసి నిలువుదోపిడీ చేయడం సిగ్గుచేటన్నారు. రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గమని దుయ్యబట్టారు.
జేబీఎస్ నుంచి కరీంనగర్‌కు (Karimnagar) రూ.230 ఉండే టికెట్‌ను ఏకంగా రూ.400కు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ నుంచి ఎంజీబీఎస్‌కు మొన్నటివరకు రూ.220 ఉండగా.. ఇప్పుడు రూ.290 పైగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారని చెప్పారు. దానికి సంబంధించిన ఆర్టీసీ టికెట్‌ను ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
`రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రూట్లలో టికెట్ ఛార్జీలు డబుల్ చేసి, జేబులు గుల్ల చేసి, ప్రజలకు పండుగ సంబురం లేకుండా చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచకుండా, రెగ్యులర్ గా నడిచే బస్సులకే పండుగ స్పెషల్ బోర్డులు తగిలించి చేస్తున్న ఈ దోపిడీ ముమ్మాటికీ ప్రజాపీడనే అవుతుంది. మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి.. పురుషుల నుంచి డబుల్ చార్జీలు వసూలు చేస్తారా?. భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్ వసూలు చేస్తే, మహిళలకు రాయితీ ఇచ్చినట్టా? లేక ఆ భారాన్ని తిరిగి అదే కుటుంబంపై మోపినట్టా?. ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన?.
ఇప్పటికే మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో ఆర్టీసీ టికెట్ చార్జీలను (Bus Charges) 5 సార్లు పెంచారు. ఇప్పుడు పండుగల పేరుతో డబుల్ చార్జీలు వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారు. రేవంత్ ప్రభుత్వ తీరుతో పండుగలకు సొంతూళ్లకు వెళ్లాలంటేనే పేద, మధ్యతరగతి ప్రజలు భయపడే దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే స్పందించి, పండుగల పేరుతో పెంచిన అడ్డగోలు చార్జీలను తగ్గించాలి. రెగ్యులర్ బస్సులను యథావిధిగా నడిపి, పేద, మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడకుండా చూడాలని` డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

Kavitha | ఒక వైపు ధరలు పెరుగుతుంటే.. ఎన్హెచ్ఎం ఉద్యోగుల జీతాలు తగ్గిస్తారా?.. రేవంత్ సర్కార్‌పై కవిత ఆగ్రహం
అక్టోబర్ 18, 2026

Dandiya Event | దాండియా వేడుకలో కూలిన లైటింగ్ సిస్టమ్.. విద్యార్థిని మృతి
అక్టోబర్ 18, 2026

Harish Rao | 7 వేలకే పోలీసు నోటిఫికేషన్.. నిరుద్యోగులను వంచించడమే
అక్టోబర్ 17, 2026
తాజావార్తలు
- ●Kavitha | ఒక వైపు ధరలు పెరుగుతుంటే.. ఎన్హెచ్ఎం ఉద్యోగుల జీతాలు తగ్గిస్తారా?.. రేవంత్ సర్కార్‌పై కవిత ఆగ్రహం
- ●France Protests | భగ్గుమన్న ఫ్రాన్స్.. 143 ఏండ్ల చారిత్రక భవనానికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు
- ●Lorry Tyre | రన్నింగ్‌లో ఉండగా ఊడిన లారీ టైరు.. హైవేపై పరుగులు.. వాహనదారులకు తప్పిన ప్రమాదం.. వీడియో
- ●TTD | రేపు తిరుమల శ్రీనివాసుడి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
- ●Rain Update | నేడు, రేపు ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు
- ●Bedi Anjaneya Swamy | ఆంజనేయుడికి బేడీలు ఎందుకు?

Kavitha | ఒక వైపు ధరలు పెరుగుతుంటే.. ఎన్హెచ్ఎం ఉద్యోగుల జీతాలు తగ్గిస్తారా?.. రేవంత్ సర్కార్‌పై కవిత ఆగ్రహం

France Protests | భగ్గుమన్న ఫ్రాన్స్.. 143 ఏండ్ల చారిత్రక భవనానికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు

Lorry Tyre | రన్నింగ్‌లో ఉండగా ఊడిన లారీ టైరు.. హైవేపై పరుగులు.. వాహనదారులకు తప్పిన ప్రమాదం.. వీడియో

TTD | రేపు తిరుమల శ్రీనివాసుడి ఆర్జిత సేవా టికెట్లు విడుదల



