Suicide | నానక్‌రాంగూడలో విషాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
Suicide | సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నానక్‌రాంగూడలో విషాదం నెలకొంది. ఓ 29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్( Software Engineer ).. స్థానికంగా ఉన్న గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య( Suicide ) చేసుకున్నాడు.
Suicide | త్రినేత్ర న్యూస్ : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నానక్‌రాంగూడలో విషాదం నెలకొంది. ఓ 29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్( Software Engineer ).. స్థానికంగా ఉన్న గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య( Suicide ) చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేటకు చెందిన ఉప్పల భరత్(29) కొద్ది రోజుల క్రితం వరకు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేశాడు. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ నగరానికి వచ్చాడు. గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగాడు. ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో అపార్ట్‌మెంట్ పైనుంచి కిందకు దూకగా, నిలిపి ఉంచిన కారుపై పడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. ఆత్మహత్యకు ముందు బెంగళూరులోనే రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా చెప్పాలని తన స్నేహితులకు సంక్షిప్త సందేశాలు పంపినట్లు పోలీసులు తెలిపారు. అతనికి ఇటీవల ఓ యువతితో పెళ్లి కుదిరినట్లు సమాచారం.
తాజావార్తలు
- ●Uppal Stadium | 14న ఉప్పల్ స్టేడియంల్ క్రికెట్ మ్యాచ్.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
- ●Governors | ఆరు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం..
- ●Rain Alert | ఎల్లుండి నుంచి తెలంగాణలో వర్షాలు..!
- ●Horoscope | అక్టోబర్ 13 రాశిఫలాలు.. మీ రాశి ఫలం ఎలా ఉందంటే..?
- ●Shakti Peethas | దసరా నవరాత్రుల్లో దర్శించాల్సిన 18 శక్తిపీఠాలు
- ●Chandraghanta | శాంతికి ప్రతీక.. ధైర్యానికి స్ఫూర్తి..! చంద్రఘంట అలంకారంలో దుర్గమ్మ విశ్వరూప తత్త్వం

Uppal Stadium | 14న ఉప్పల్ స్టేడియంల్ క్రికెట్ మ్యాచ్.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Governors | ఆరు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం..

Rain Alert | ఎల్లుండి నుంచి తెలంగాణలో వర్షాలు..!

Horoscope | అక్టోబర్ 13 రాశిఫలాలు.. మీ రాశి ఫలం ఎలా ఉందంటే..?






