Prabhas Spirit | అఫీషియల్ : ప్రభాస్ స్పిరిట్ వాయిదా – ఫౌజీ కోసమేనా?
ప్రభాస్ ఫ్యాన్స్‌కు స్పిరిట్ టీమ్ ఓ గుడ్‌న్యూస్‌తో పాటు బ్యాడ్‌న్యూస్ వినిపించింది. ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ఆదివారం ప్రకటించి అభిమానులను నిరాశపరిచింది. అదే సమయంలో ప్రభాస్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ను ఖుషి చేశారు. ఫౌజీ కోసమే స్పిరిట్‌ను వాయిదా వేసినట్లు వార్తలొస్తున్నాయి.
Entertainment | Published On Oct 18, 2026, 12.57 pm IST
Prabhas Spirit |రెబెల్ స్టార్ ప్రభాస్ , డైరెక్టర్ సందీప్ వంగా కాంబినేషన్లో తెరకెక్కుతోన్న స్పిరిట్ మూవీ వాయిదాపడింది. వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా దీపావళికి పోస్ట్‌పోన్ అయ్యింది. కొత్త రిలీజ్ డేట్‌ను వెల్లడించారు. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా డైరెక్టర్ సందీప్ వంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్గా కనిపించబోతుంది. వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్నారు.
రూమర్లు...
స్పిరిట్ మూవీ వాయిదాపడనున్నట్లు గత కొద్ది రోజులుగా టాలీవుడ్ వర్గాల్లో రూమర్లు వినిపిస్తున్నాయి. మార్చి 5న విడుదల కావాల్సిన ఈ సినిమా ఆరు నెలలు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
దీపావళికి...
ఈ పోస్ట్‌పోన్ రూమర్లపై డైరెక్టర్ సందీప్ వంగా ఆదివారం క్లారిటీ ఇచ్చారు. వాయిదా నిజమేనని ప్రకటించారు. మార్చి 5న కాకుండా దీపావళికి స్పిరిట్ థియేటర్లలోకి రానున్నట్లు వెల్లడించారు. 2027 అక్టోబర్ 29న ఈ పాన్ ఇండియన్ మూవీ రిలీజ్ కానుందని వెల్లడించారు.
పోస్టర్ వైరల్....
రిలీజ్ డేట్‌తో పాటు ప్రభాస్ కొత్త పోస్టర్‌ను సందీప్ వంగా అభిమానులతో పంచుకున్నారు. క్యాప్, కళ్లద్ధాలు ధరించి గడ్డంతో సీరియస్ లుక్‌లో ఈ పోస్టర్లో ప్రభాస్ కనిపిస్తున్నారు. స్పిరిట్ కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫౌజీ కోసమే వాయిదా?
ఫౌజీ కోసమే స్పిరిట్ మూవీని వాయిదా వేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఫౌజీ మూవీ డిసెంబర్లో రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్, పోస్ట్‌ప్రొడక్షన్ పనుల డిలే వల్ల ఈ హిస్టారికల్ మూవీ అనుకున్న టైమ్‌కు ప్రేక్షకుల ముందుకు రావడం కష్టంగా మారింది. సినిమా రిలీజ్ ఆలస్యమవుతుందని ఇటీవలే నిర్మాతలు కూడా ప్రకటించారు.
వేసవిలో రిలీజ్...
వచ్చే ఏడాది వేసవికి అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్‌కు ఫౌజీ రెడీగా ఉండే అవకాశం ఉందని సమాచారం. ఒకేసారి ఫౌజీ, స్పిరిట్ రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కంటే ఓ సినిమాను వాయిదా వేయడమే మంచిదని మేకర్స్ ఫిక్సయ్యినట్లు తెలిసింది. అందుకే స్పిరిట్‌ను వాయిదా వేసి ఆ డేట్‌కు ఫౌజీని విడుదల చేస్తారని అంటున్నారు. త్వరలోనే ఫౌజీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Check this out........ 😊
#Spirit
#InSpiritMode
@TSeries
@VangaPictures
#IndiasBiggestSuperStar
29TH OCTOBER DIWALI 2027 💥
Worldwide RELEASE DATE 👆 https://t.co/SmPjKHzuVE— Sandeep Reddy Vanga (@imvangasandeep) October 18, 2026
సంబంధిత వార్తలు

Nayanthara | ఐదోసారి జోడీ కుదిరిందా? – ధర్మన్‌లో సూపర్ స్టార్ వర్సెస్ లేడీ సూపర్‌స్టార్
అక్టోబర్ 18, 2026

Tollywood | వాట్ నెక్స్ట్ – స్టార్ హీరోయిన్ల కొత్త సినిమా కబురు ఎప్పుడు?
అక్టోబర్ 18, 2026

Rashmika Mandanna | సద్దుల బతుకమ్మ సంబరాల్లో విరోష్ జోడీ – రష్మికకు డిప్యూటీ సీఎం దంపతుల కానుక
అక్టోబర్ 17, 2026
తాజావార్తలు
- ●Suicide | తోటి ఉద్యోగిని, విలేకరులు వేధిస్తున్నారని.. గ్యాస్ గోదాం మేనేజర్ ఆత్మహత్య
- ●Shami Tree | శమీ వృక్షాలు నాటి పెంచుతాం.. పర్యావరణహితానికి ప్రతిన తీసుకుంటాం
- ●Nayanthara | ఐదోసారి జోడీ కుదిరిందా? - ధర్మన్‌లో సూపర్ స్టార్ వర్సెస్ లేడీ సూపర్‌స్టార్
- ●Moon shrinking | కుచించుకుపోతున్న చంద్రుడు..
- ●Tollywood | వాట్ నెక్స్ట్ - స్టార్ హీరోయిన్ల కొత్త సినిమా కబురు ఎప్పుడు?
- ●Harish Rao | పండుగలు వస్తే చాలు.. ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలను బాదుడేనా రేవంత్?: హరీశ్ రావు

Suicide | తోటి ఉద్యోగిని, విలేకరులు వేధిస్తున్నారని.. గ్యాస్ గోదాం మేనేజర్ ఆత్మహత్య

Shami Tree | శమీ వృక్షాలు నాటి పెంచుతాం.. పర్యావరణహితానికి ప్రతిన తీసుకుంటాం

Nayanthara | ఐదోసారి జోడీ కుదిరిందా? - ధర్మన్‌లో సూపర్ స్టార్ వర్సెస్ లేడీ సూపర్‌స్టార్

Moon shrinking | కుచించుకుపోతున్న చంద్రుడు..



