త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nayanthara | ఐదోసారి జోడీ కుదిరిందా? – ధ‌ర్మ‌న్‌లో సూప‌ర్ స్టార్ వ‌ర్సెస్ లేడీ సూప‌ర్‌స్టార్‌

ర‌జ‌నీకాంత్ ధ‌ర్మ‌న్ మూవీకి సంబంధించి మ‌రో ఇంట్రెస్టింగ్ రూమ‌ర్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీలో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ర‌జ‌నీకాంత్‌కు ధీటుగా సాగే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర కోసం న‌య‌న్‌ను మేక‌ర్స్ సెలెక్ట్ చేసిన‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Oct 18, 2026, 12.23 pm IST

Nayanthara | ఐదోసారి జోడీ కుదిరిందా? – ధ‌ర్మ‌న్‌లో సూప‌ర్ స్టార్ వ‌ర్సెస్ లేడీ సూప‌ర్‌స్టార్‌
Advertisement

Nayanthara |  ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టించిన జైల‌ర్ 2 మూవీ ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. నెల్స‌న్ ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద కుమ్మేస్తోంది. మూడు రోజుల్లోనే మూడు వంద‌ల కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ర‌జ‌నీకాంత్ కెరీర్‌లో హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్‌ రాబ‌ట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.

క‌మ‌ల్‌హాస‌న్ నిర్మాత‌....

జైల‌ర్ 2 సెట్స్‌పై ఉండ‌గానే ధ‌ర్మ‌న్ సినిమాను అంగీక‌రించారు ర‌జ‌నీకాంత్‌. కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అశ్వ‌త్ మారిముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో వ‌య‌లెంట్ డాక్ట‌ర్ పాత్ర‌లో ర‌జ‌నీకాంత్ క‌నిపించ‌బోతున్నారు. అనౌన్స్‌మెంట్ నుంచే ధ‌ర్మ‌న్ అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో ప‌లువురు పాన్ ఇండియ‌న్ స్టార్లు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. తాజాగా ధ‌ర్మ‌న్‌కు సంబంధించి మ‌రో ఇంట్రెస్టింగ్ రూమ‌ర్ త‌మిళ సినీ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

లేడీ సూప‌ర్‌స్టార్‌...

ధ‌ర్మ‌న్‌లో లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ర‌జ‌నీకాంత్‌కు ధీటుగా ఈ సినిమాలో ప‌వ‌ర్‌ఫుల్ హీరోయిన్ రోల్‌ను డైరెక్ట‌ర్ అశ్వ‌త్ మారిముత్తు క్రియేట్ చేసిన‌ట్లు స‌మాచారం. ఈ క్యారెక్ట‌ర్ కోసం న‌య‌న‌తార‌ను మేక‌ర్స్ అప్రోచ్ అయిన‌ట్లు టాక్‌. పాత్ర‌కు ఉన్న ఇంపార్టెన్స్‌తో పాటు ర‌జ‌నీకాంత్ సినిమా కావ‌డంతో ధ‌ర్మ‌న్‌లో న‌టించ‌డానికి న‌య‌న్ ఓకే చెప్పింద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే ధ‌ర్మ‌న్ సెట్స్‌లో న‌య‌న‌తార అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు స‌మాచారం. ర‌జ‌నీకాంత్‌, న‌య‌న‌తార కాంబినేష‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు సినిమాలు వ‌చ్చాయి. ధ‌ర్మ‌న్‌తో ఐదోసారి వీరిద్ద‌రు జోడీ క‌ట్ట‌బోతుండ‌టం గ‌మ‌నార్హం.

విల‌న్‌గా రామ్‌...

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని విల‌న్‌గా క‌నిపంచ‌బోతున్నారు. సిమ్రాన్‌, రాశీఖ‌న్నా హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ సినిమాలో శ్రీలీల ఓ స్పెష‌ల్ సాంగ్ చేస్తోంది. తాజాగా న‌య‌న‌తార కూడా ఈ సినిమాలో భాగం కాబోతుండ‌టం కోలీవుడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ధ‌ర్మ‌న్ మూవీ వ‌చ్చే ఏడాది వేస‌విలో థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

 

Advertisement
Advertisement