Gas e-KYC | ముంచుకొస్తున్న గడువు.. గ్యాస్ ఈ-కేవైసీ పూర్తిచేశారా?.. లేదంటే సబ్సిడీ కట్
Gas e-KYC | మీరు వంట గ్యాస్ కనెక్షన్ ఈ-కేవైసీ (Gas e-KYC) పూర్తిచేశారా?, ఇంకా చేయకపోతే త్వరపడండి. గడువు ముంచుకొస్తున్నది. మరో 12 రోజులే ఇంకా సమయం ఉంది. జూన్ 30తో గడువు ముగియనుంది. ఈ-కేవైసీ పూర్తి చేయనివారికి జూలై 1వ తేదీ నుంచి గ్యాస్ సబ్సిడీని (Gas Subsidy) కేంద్రం నిలిపివేయనుంది.
Gas e-KYC | త్రినేత్ర.న్యూస్: మీరు వంట గ్యాస్ కనెక్షన్ ఈ-కేవైసీ (Gas e-KYC) పూర్తిచేశారా?, ఇంకా చేయకపోతే త్వరపడండి. గడువు ముంచుకొస్తున్నది. మరో 12 రోజులే ఇంకా సమయం ఉంది. జూన్ 30తో గడువు ముగియనుంది. ఈ-కేవైసీ పూర్తి చేయనివారికి జూలై 1వ తేదీ నుంచి గ్యాస్ సబ్సిడీని (Gas Subsidy) కేంద్రం నిలిపివేయనుంది. సబ్సిడీకే కాదు, గ్యాస్ బుక్ చేయాలన్నా ఈ-కేవైసీ తప్పనిసరి అని ప్రభుత్వం ప్రకటించింది. అందుకే మరింత ఆలస్యం చేయకుండా కేవైసీ పూర్తిచేయండి. గ్యాస్ ఏజెన్సీ కార్యాలయంలోనే కాదు.. దగ్గర్లోని మీ సేవా కేంద్రం, ఇంట్లోనే ఆన్ ద్వారా కూడా ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చు.
ఏడాదిగా సాగుతున్న ఈ ప్రక్రియ ఈ నెలాఖరుతో ముగిసిపోనుంది. అక్రమ గ్యాస్ కనెక్షన్లను అడ్డుకట్ట వేయడంతో పాటు రాయితీ దుర్వినియోగం కాకుండా చేసేందుకు ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టింది. గ్యాస్ కనెక్షన్లను ఆధార్‌తో అనుసంధానం చేయడంతో పాటు ముఖ గుర్తింపు, వేలిముద్రలు లేదా ఐరిస్ మూడు విధానాలతో ఎల్‌పీజీ వినియోగదారుల ఈ-కేవైసీని పూర్తి చేయనున్నారు.
మరోవైపు ఈ-కేవైసీ పూర్తి చేయని వినియోగదారులు గ్యాస్ సిలిండర్ బుకింగ్‌లను నిలిపివేయకూడదని పౌరసరఫరాలశాఖ స్పష్టం చేసింది. కొన్ని ఏజెన్సీలు ఈ-కేవైసీ పూర్తికాలేదని సిలిండర్లను బుక్ చేయడానికి అనుమతించడం లేదని, ఇది సరికాదని వెల్లడించింది.
కేవైసీ ఇలా..
- ముందుగా గూగుల్‌లో www.mylpg.in అని టైప్ చేయాలి. అనంతరం ఎల్‌పీజీ గ్యాస్ అధికారిక వెబ్‌సైట్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఐడీ అడుగుతుంది. కుడివైపు పైన భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్, ఇండేన్ కంపెనీలకు సంబంధించిన సిలిండర్ చిత్రాలు కనిపిస్తాయి. అందులో మీరు ఏ కంపెనీ గ్యాస్ వాడుతున్నారో ఆ సిలిండర్‌పైన క్లిక్ చేయాలి.
- అనంతరం కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. కుడివైపు పైన Sign In, New User ఆప్షన్స్ ఉంటాయి.
ఒకవేళ మీరు ఇప్పటికే రిజిస్టర్ చేసుకుంటే ఫోన్ నంబర్‌తో సైన్ ఇన్ చేసుకోవచ్చు. లేదా New User అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. - న్యూ యూజర్ పేజ్‌లోకి వెళ్లిన తర్వాత గ్యాస్ కన్య్జూమర్ నంబర్ సహా పూర్తి వివరాలు నమోదుచేయాలి.
గ్యాస్ కనెక్షన్ ఐడీ నంబర్‌తో లాగిన్ అయిన తర్వాత.. స్క్రీన్‌పై మీ గ్యాస్ కనెక్షన్‌కు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. - అనంతరం ఎడమ వైపు కనిపించే 'ఆధార్ అథెంటికేషన్' ఆప్షన్ ఎంచుకుని గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరుతో ఉందో వారి ఆధార్ నంబర్ నమోదు చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. ఆధార్‌తో లింక్ చేసిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని అక్కడ నమోదు చేసి అథెంటికేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీకు అథెంటికేషన్ పూర్తయినట్లు సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వస్తుంది.
తాజావార్తలు
- ●Revanth Reddy | తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్
- ●Norway vs Iraq | ఫిఫా ప్రపంచకప్‌లో నార్వే సంచలనం
- ●Ragging | ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. ఫైనల్ ఇయర్ విద్యార్థులు సస్పెండ్
- ●AIIMS Recruitment | ఎయిమ్స్‌లో 1484 నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. జూన్ 30 వరకు దరాఖాస్తు గడువు
- ●మెస్సీ హ్యాట్రిక్.. ఫిఫా వరల్డ్ కప్‌లో అర్జెంటీనా శుభారంభం
- ●Pani Puri | పానీపూరీ తిని 18 మంది చిన్నారులకు తీవ్ర అస్వస్థత..

Revanth Reddy | తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్

Norway vs Iraq | ఫిఫా ప్రపంచకప్‌లో నార్వే సంచలనం

Ragging | ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. ఫైనల్ ఇయర్ విద్యార్థులు సస్పెండ్

AIIMS Recruitment | ఎయిమ్స్‌లో 1484 నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. జూన్ 30 వరకు దరాఖాస్తు గడువు





