త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aadhaar Authentication to TDR Portal | టీడీఆర్ పోర్టల్‌కు ఆధార్ అథెంటికేషన్‌.. ఉత్త‌ర్వులు జారీ

Aadhaar Authentication to TDR Portal | తెలంగాణ‌లో టీడీఆర్ పోర్ట‌ల్‌కు ఆధార్ అథెంటికేష‌న్‌ (Aadhaar Authentication to TDR Portal)కు భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ అనుమతించింది.

S

Telangana | Published On Oct 22, 2026, 4.08 pm IST

Aadhaar Authentication to TDR Portal | టీడీఆర్ పోర్టల్‌కు ఆధార్ అథెంటికేషన్‌.. ఉత్త‌ర్వులు జారీ
Advertisement

Aadhaar Authentication to TDR Portal | త్రినేత్ర న్యూస్‌: తెలంగాణ‌లో టీడీఆర్ పోర్ట‌ల్‌కు ఆధార్ అథెంటికేష‌న్‌ (Aadhaar Authentication to TDR Portal)కు భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ అనుమతించింది. ఆర్థిక, ఇతర సబ్సిడీలు, ప్రయోజనాలు, సేవల పంపిణీ చట్టం- 2016లోని నిబంధనల ప్రకారం ఆధార్ ప్రామాణీకరణ సేవలను నిర్వహించడానికి గురువారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆస్తి యజమానులు, బిల్డర్లు, డెవలపర్లకు ఈ సదుపాయం క‌ల్పించారు. DTCP, GHMC అధికారుల ఆన్‌లైన్ పరిపాలనా కార్యకలాపాలకూ ఆధార్ అథెంటికేషన్ త‌ప్ప‌నిస‌రిగా చేయాల్సి ఉంటుంది.

లావాదేవీలలో మోసాలను అరికట్టడానికి, పారదర్శకతను పెంచడానికి ప్రభుత్వం ఆధార్ అనుసంధానం, ఆధార్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేస్తూ అనుమతులిచ్చింది. గతంలో జారీ చేసిన మాన్యువల్ టీడీఆర్ (TDR) సర్టిఫికెట్లను ఆన్‌లైన్ ఫార్మాట్‌లోకి మార్చేటప్పుడు, సదరు ఆస్తి అసలు యజమానిని గుర్తించడానికి ఆధార్ కార్డును, సెల్ఫ్-డిక్లరేషన్ ఫామ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. దీనివల్ల నకిలీ సర్టిఫికెట్లతో జరిగే మోసాలకు అడ్డుకట్ట వేసే వెసులుబాటు ఉంటుంది.

జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోని యజమానులు తమ టీడీఆర్‌ల‌ను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో నమోదు చేసుకునేటప్పుడు ఈ ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి కానుంది. పోర్టల్‌లో కొత్త యూజర్ రిజిస్ట్రేషన్, టీడీఆర్‌ సర్టిఫికెట్ల అప్‌డేషన్ లేదా ఇతర డెవలపర్లకు బదిలీ చేసే సమయంలో ఆధార్ నంబర్ లింకింగ్, ఓటీపీ/ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రక్రియలను అధికారిక గైడ్‌లైన్స్‌లో చేర్చారు.

Advertisement
Advertisement