Gas Cylinder | ఉన్నది 60 సిలిండర్లు.. వచ్చిందేమో 200 మంది.. చివరికి పోలీసుల జోక్యంతో..
Gas Cylinder | ఇరాన్, అమెరికా యుద్ధంతో దేశంలో గ్యాస్ కొరత (Gas) నెలకొన్నది. డిమాండ్‌కు సరిపడినట్లుగా పంపిణీ సంస్థలు గ్యాస్ సిలిండర్లను (Gas Cylinder) సరఫరా చేయలేకపోతున్నాయి. దీంతో వాణిజ్య సిలిండర్లపై ఆంక్షలు విధించిన కేంద్ర ప్రభుత్వం, గృహావసరాలకు వినియోగించే సిలిండర్ల బుకింగ్, పంపిణీ గడువును పెంచింది.
Gas Cylinder | త్రినేత్ర.న్యూస్: ఇరాన్, అమెరికా యుద్ధంతో దేశంలో గ్యాస్ కొరత (Gas) నెలకొన్నది. డిమాండ్‌కు సరిపడినట్లుగా పంపిణీ సంస్థలు గ్యాస్ సిలిండర్లను (Gas Cylinder) సరఫరా చేయలేకపోతున్నాయి. దీంతో వాణిజ్య సిలిండర్లపై ఆంక్షలు విధించిన కేంద్ర ప్రభుత్వం, గృహావసరాలకు వినియోగించే సిలిండర్ల బుకింగ్, పంపిణీ గడువును పెంచింది. దీంతో సిలిండర్ బుకింగ్, డెలివరీకి మధ్య 45 రోజులకుపైగా సమయం పడుతున్నది. సింగిల్ సిలిండర్ ఉన్న వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల పోలీసుల పహారాలో గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని గ్యాస్ ఏజెన్సీకి మంగళవారం 60 సిలిండర్లు వచ్చాయి. బుకింగ్ చేసుకున్న వారికి ఈ విషయం తెలియడంతో ఏజెన్సీకి దాదాపు 200 మంది వచ్చారు. అవి అందరికీ అందే పరిస్థితి లేకపోవడంతోపాటు, ఎండ గంటల తరబడి వేచిఉండటంతో సహనం కోల్పోయిన వినియోగదారులు కార్యాలయంలోకి చొరబడ్డారు. దీంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు అక్కడి చేరుకున్నారు.

రోజుల తరబడి సిలిండర్ల కోసం చూస్తున్నామని, ఇంకెన్ని రోజులు ఏజెన్సీ చుట్టు తిరగాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో వచ్చిన వారందరి వద్ద గ్యాస్ పుస్తకాలు తీసుకున్న పోలీసులు బుకింగ్ ఆధారంగా 60మందికి సిలిండర్లు సరఫరా చేయించారు. దీంతో మిగిలినవారు నిరాశగా వెనుతిరిగారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | తెల్వని దొంగ మోదీ.. సీఎం రేవంత్ విమర్శ
ఆగస్టు 13, 2026

POCSO Case | లెక్కలు చెబుతానంటే మైనర్ బాలికపై అఘాయిత్యం.. టీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్పై పోక్సో కేసు
ఆగస్టు 9, 2026

Suicide Attempt | ప్రభుత్వానికి సూసైడ్ నోట్.. ఉద్యోగ నోటిఫికేషన్లు రావడంలేదని యువకుడు ఆత్మహత్యాయత్నం
ఆగస్టు 2, 2026
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు



