త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ganja | తండ్రీకొడుకు క‌లిసి గంజాయి సాగు.. రూ. 1.50 కోట్ల విలువ చేసే మొక్క‌లు ధ్వంసం

Ganja | నిషేధిత గంజాయిని సాగు చేస్తున్న తండ్రీకొడుకుల‌ను అరెస్టు చేసిన‌ట్లు ఆసిఫాబాద్ ఎస్పీ నితిఖ‌ పంత్ పేర్కొన్నారు. త‌మ పొలంలో అంత‌ర పంట‌గా సాగు చేస్తున్న గంజాయి మొక్క‌ల‌ను పూర్తిగా ధ్వంసం చేసిన‌ట్లు ఆమె తెలిపారు.

S

Telangana | Published On Sep 15, 2026, 3.23 pm IST

Ganja | తండ్రీకొడుకు క‌లిసి గంజాయి సాగు.. రూ. 1.50 కోట్ల విలువ చేసే మొక్క‌లు ధ్వంసం
Advertisement

Ganja | త్రినేత్ర‌.న్యూస్ : నిషేధిత గంజాయిని సాగు చేస్తున్న తండ్రీకొడుకుల‌ను అరెస్టు చేసిన‌ట్లు ఆసిఫాబాద్ ఎస్పీ నితిఖ‌ పంత్ పేర్కొన్నారు. త‌మ పొలంలో అంత‌ర పంట‌గా సాగు చేస్తున్న గంజాయి మొక్క‌ల‌ను పూర్తిగా ధ్వంసం చేసిన‌ట్లు ఆమె తెలిపారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఎస్పీ మీడియాకు వెల్ల‌డించారు.

ఆదివారం రాత్రి జైనూరులో పోలీసులు వాహ‌నాల త‌నిఖీలు నిర్వ‌హించారు. త‌నిఖీల్లో భాగంగా అంబురే పుండ‌లీక్ అనే వ్య‌క్తి వ‌ద్ద 11 గ్రాముల ఎండు గంజాయిని గుర్తించారు. దాంతో అత‌న్ని అదుపులోకి తీసుకుని విచారించ‌గా, అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. త‌మ‌కున్న 10 ఎక‌రాల పొలంలో ప‌త్తి పంట వేశామ‌ని, దాంట్లో అంత‌ర‌పంట‌గా గంజాయి సాగు చేస్తున్నామ‌ని తెలిపాడు.

ఈ క్ర‌మంలో పుండ‌లీక్ పంట పొలాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలించి, గంజాయి మొక్క‌ల‌ను పోలీసులు తొల‌గించారు. అనంత‌రం వాటిని లెక్క పెట్టేందుకు 10 గంట‌ల స‌మ‌యం ప‌ట్టింద‌న్నారు. ధ్వంసం చేసిన గంజాయి విలువ రూ. 1.50 కోట్లు ఉంటుంద‌ని తెలిపారు. అరెస్టు చేసిన తండ్రీకుమారుల‌ను రిమాండ్‌కు పంపిన‌ట్లు చెప్పారు.

Advertisement
Advertisement