త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gongidi Sunitha | రేవంత్ రెడ్డి సీఎంగా, హోం, ఎడ్యుకేష‌న్ మినిస్ట‌ర్‌గా ఫెయిల్

Gongidi Sunitha | త్రినేత్ర‌.న్యూస్ : రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా, హోం మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయ్యారు.. కాబ‌ట్టి త‌క్ష‌ణ‌మే ఆయా ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Aug 20, 2026, 5.10 pm IST

Gongidi Sunitha | రేవంత్ రెడ్డి సీఎంగా, హోం, ఎడ్యుకేష‌న్ మినిస్ట‌ర్‌గా ఫెయిల్
Advertisement

Gongidi Sunitha | త్రినేత్ర‌.న్యూస్ : రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా, హోం మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయ్యారు.. కాబ‌ట్టి త‌క్ష‌ణ‌మే ఆయా ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత డిమాండ్ చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మాజీ జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్ తుల ఉమ‌తో క‌లిసి గొంగిడి సునీత గురువారం మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు రేవంత్ రెడ్డికి గాలికి వదిలేశారనే అనుమానం వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ స్పష్టంగా క‌నిపిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మళ్లీ వచ్చాయి. కేసీఆర్ షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళలకు భద్రత కల్పించారని ఆమె గుర్తు చేశారు.

ఈగల్ ఫోర్స్ పని చేస్తుందా..? ఈగలు కొడుతుందా..?

తెలంగాణలో వందల కోట్లు విలువ చేసే డ్రగ్స్ దొరికాయి. రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగింది. రేవంత్ రెడ్డి డ్రగ్స్ అరికట్టడంలో మాటలకే పరిమితం అయ్యారు. ఈగల్ ఫోర్స్ పని చేస్తుందా..? ఈగలు కొడుతుందా..? అనే అనుమానం వస్తోంది. కొండమల్లెపల్లిలో ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్య వెనుక డ్రగ్స్ మాఫీయా హస్తంపై విచారణ చేయాలి. ఈ హత్య వెనుక ఏమైనా కుట్ర ఉందా అనే కోణంలో విచారణ చేయాలి. గ్రామాల్లో డ్రగ్స్, గంజాయి, మద్యంతో యువత బలైపోతోంది. యువత మద్యం మత్తులో ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు అనే భావనలో సీఎం ఉన్న‌ట్టు అనిపిస్తుంద‌ని సునీత పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డికి వ్యాపారాలపై ఉన్న ప్రేమ ప్ర‌జ‌ల‌పై లేదు..

కేంద్ర మంత్రి కొడుకుకు సీఎం రేవంత్ రెడ్డి రక్షణ కల్పించారు. పోక్సో చట్టాలకు అనుగుణంగా శిక్ష వేయాలి కానీ యథేచ్ఛగా పోక్సో నిందితుడు బయట తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. మైనర్ బాలికపై వృద్దుడు అసభ్యంగా ప్రవర్తిస్తే ప్రభుత్వం పట్టించుకోలేదు. షాబాద్‌లో ఒక ఉన్మాది ఆరుగురు మహిళలను హత్య చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు జరుగుతున్నాయి. సీఎం లండన్, అమెరికా టూర్లకు వెళ్లారు. రేవంత్ రెడ్డికి వ్యాపారాలపై ఉన్న ప్రేమ ప్ర‌జ‌ల‌పై లేదు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం మాటలకు పరిమితం కాకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి అని గొంగిడి సునీత డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement