Jupally Krishna Rao | వ్యక్తుల కంటే పార్టీయే సుప్రీం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం
Jupally Krishna Rao | వ్యక్తుల కంటే పార్టీనే సుప్రీం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. పార్టీ ప్రయోజనాలే అందరికీ ప్రథమ ప్రాధాన్యంగా ఉండాలని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందన్నారు.
- ఆసిఫాబాద్‌లో గ్రూపు విభేదాలు భావ్యం కాదు.. సమష్టిగా పని చేయండి
- పదవుల విషయంలో టీపీసీసీ, సీఎం రేవంత్‌దే తుది నిర్ణయం
- ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
Jupally Krishna Rao | త్రినేత్ర.న్యూస్: వ్యక్తుల కంటే పార్టీనే సుప్రీం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. పార్టీ ప్రయోజనాలే అందరికీ ప్రథమ ప్రాధాన్యంగా ఉండాలని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఉందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మరోసారి కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపడం ఖాయమని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ఉట్నూర్‌లో సోమవారం నిర్వహించారు.
ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా, నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, సంస్థాగత బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలు సమీక్షించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసిన నాయకులు, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి భవిష్యత్తులో తగిన అవకాశాలు లభిస్తాయని హామీ ఇచ్చారు. ఎస్ఐఆర్ తదుపరి ప్రక్రియను పార్టీ శ్రేణులు అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటు తొలగిపోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మధ్య ఉన్న గ్రూపు విభేదాలు పార్టీ బలోపేతానికి ఆటంకంగా మారకూడదన్నారు. నేతల మధ్య సమన్వయం లోపించడం సరికాదని, ఎవరికి వారే అన్నట్లుగా కాకుండా సమష్టిగా పనిచేయాలని కోరారు. పార్టీ పదవులు, నియామకాల విషయంలో నాయకులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలియజేయవచ్చని, అయితే తుది నిర్ణయం టీపీసీసీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అని స్పష్టం చేశారు. నాయకులందరికీ ఎంతో అనుభవం ఉందని, గత విభేదాలను పక్కనపెట్టి ఐక్యతతో ముందుకు సాగాలన్నారు. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోయం బాపురావు, కంది శ్రీనివాస్ రెడ్డి, ఆడే గజేందర్, ఆత్రం సుగుణ తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●కల్యాణ లక్ష్మిపై వెనక్కి తగ్గేది లేదు
- ●Dasoju Sravan | మీనాక్షి నటరాజన్‌కు దండం పెట్టి చెబుతున్న.. రేవంత్‌ను నందిగ్రామ్‌లో శిక్షణకు పంపించండి
- ●E20 Petrol | పాత వాహనాల కోసం ఈ10 పెట్రోల్‌ను అందుబాటులో ఉంచాలి.. చీఫ్ ఎకనామిస్ట్ నాగేశ్వరన్
- ●Bigg Boss | హీరోగా తెలుగు బిగ్‌బాస్ కంటెస్టెంట్ - డైరెక్టర్‌గా ప్రభాస్ ఈశ్వర్ యాక్టర్ - "సాV3" టీజర్ రిలీజ్
- ●Ramchandar Rao | వందేమాతర గేయాన్ని అవమానించారు.. కాంగ్రెస్‌వాళ్లకు సిగ్గు మిగిలి ఉంటే క్షమాపణ చెప్పాలి
- ●Malavika Sharma | బీఫ్ ఇష్టమా? - మలయాళ మూవీ ప్రమోషన్స్‌లో టాలీవుడ్ హీరోయిన్‌కు ప్రశ్న - నెటిజన్లు ఫైర్

కల్యాణ లక్ష్మిపై వెనక్కి తగ్గేది లేదు

Dasoju Sravan | మీనాక్షి నటరాజన్‌కు దండం పెట్టి చెబుతున్న.. రేవంత్‌ను నందిగ్రామ్‌లో శిక్షణకు పంపించండి

E20 Petrol | పాత వాహనాల కోసం ఈ10 పెట్రోల్‌ను అందుబాటులో ఉంచాలి.. చీఫ్ ఎకనామిస్ట్ నాగేశ్వరన్

Bigg Boss | హీరోగా తెలుగు బిగ్‌బాస్ కంటెస్టెంట్ - డైరెక్టర్‌గా ప్రభాస్ ఈశ్వర్ యాక్టర్ - "సాV3" టీజర్ రిలీజ్




