త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Balapur Ganesh | రూ. 40 ల‌క్ష‌ల వ్య‌యంతో బాలాపూర్ గ‌ణేశ్ మండ‌పం ఏర్పాటు.. ప్ర‌త్యేక‌త ఏంటంటే..?

Balapur Ganesh | హైద‌రాబాద్ న‌గ‌రంలో ఖైర‌తాబాద్ బడా గ‌ణేశ్( Khairatabad ganesh ) త‌ర్వాత అత్యంత ఆద‌ర‌ణ పొందిన గ‌ణ‌నాథుడు ఎక్క‌డ ఉన్నాడంటే.. అది బాలాపూర్ గ‌ణేశ్( Balapur Ganesh ) అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ గ‌ణ‌నాథుడి ల‌డ్డూ అంత ప్ర‌త్యేకం. అంతేకాదు.. వినాయ‌క చ‌వితికి ప్ర‌తి ఏడాది ఏర్పాటు చేసే మండపం కూడా స్పెష‌లే.

S

Hyderabad | Published On Sep 15, 2026, 4.13 pm IST

Balapur Ganesh | రూ. 40 ల‌క్ష‌ల వ్య‌యంతో బాలాపూర్ గ‌ణేశ్ మండ‌పం ఏర్పాటు.. ప్ర‌త్యేక‌త ఏంటంటే..?
Advertisement

Balapur Ganesh | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో ఖైర‌తాబాద్ బడా గ‌ణేశ్( Khairatabad ganesh ) త‌ర్వాత అత్యంత ఆద‌ర‌ణ పొందిన గ‌ణ‌నాథుడు ఎక్క‌డ ఉన్నాడంటే.. అది బాలాపూర్ గ‌ణేశ్( Balapur Ganesh ) అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ గ‌ణ‌నాథుడి ల‌డ్డూ అంత ప్ర‌త్యేకం. అంతేకాదు.. వినాయ‌క చ‌వితికి ప్ర‌తి ఏడాది ఏర్పాటు చేసే మండపం కూడా స్పెష‌లే.

గ‌తంలో స్వ‌ర్ణ‌గిరి శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి టెంపుల్, అయోధ్య రామ మందిరం, అరుణాచ‌లం, తిరుమ‌ల వంటి ఆధ్యాత్మిక ప్ర‌దేశాల‌ను త‌ల‌పించేలా మండ‌పాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి పూరీ జ‌గ‌న్నాథ ఆల‌యాన్ని త‌ల‌పించేలా బాలాపూర్ గ‌ణేశ్ మండపాన్ని తీర్చిదిద్దారు.

పూరీ జ‌గ‌న్నాథ టెంపుల్ సెట‌ప్ కోసం రూ. 40 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టిన‌ట్టు బాలాపూర్ గ‌ణేశ్ ఉత్స‌వ స‌మితి ప్రెసిడెంట్ క‌ల్లెం నిరంజ‌న్ రెడ్డి వెల్ల‌డించారు. డెక‌రేట‌ర్ సుధాక‌ర్ రెడ్డి నేతృత్వంలో ఈ నమూనా త‌యారు చేయ‌బ‌డింద‌ని తెలిపారు. శామీర్‌పేట‌లోని ఓ వ‌ర్క్ షాపులో 70 మంది క‌ళాకారులు రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి పూరీ ఆల‌య న‌మూనాను తీర్చిదిద్దార‌ని పేర్కొన్నారు.

బాలాపూర్ గ‌ణేషుడిని ఆది వినాయ‌క అని కూడా పిలుస్తారు. ఇక ఈ లంబోదరుడి ల‌డ్డూకు విప‌రీత‌మైన డిమాండ్ ఉంటుంది. ఈ ల‌డ్డూను తొలిసారిగా 1994లో వేలం వేశారు. రూ. 450 నుంచి ప్రారంభ‌మైన వేలం.. గ‌తేడాది రూ. 35 ల‌క్ష‌లు ప‌లికింది. ల‌డ్డూను వేలం పాట‌లో ద‌క్కించుకునేందుకు తెలంగాణ నుంచే కాదు.. పొరుగు రాష్ట్రం ఏపీ నుంచి కూడా పోటీ ప‌డుతుంటారు.

Advertisement
Advertisement