Hash Oil | హైదరాబాద్‌లో 14.2 కిలోల హాషిష్ ఆయిల్ స్వాధీనం
Hash Oil | హైదరాబాద్ నగరంలో భారీగా హాషిష్ ఆయిల్ పట్టుబడింది. ఎల్‌బీనగర్ ఎస్‌వోటీ, నాగోల్ పోలీసులు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో 14.2 కిలోల హాషిష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Hash Oil | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలో భారీగా హాషిష్ ఆయిల్ పట్టుబడింది. ఎల్‌బీనగర్ ఎస్‌వోటీ, నాగోల్ పోలీసులు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో 14.2 కిలోల హాషిష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ ఆయిల్ విలువ సుమారు రూ. 1.75 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.
నిందితులు తల్లే నాగరాజు(30), నాగుల నారాయణ అలియాస్ కిరణ్(39) కలిసి ఈనెల 21న గౌరెల్లి ఎక్స్ రోడ్ మీదుగా బైక్‌పై వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా.. మొత్తం 14 ప్యాకెట్లలో 14.2 కిలోల హాషిష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి రెండు సెల్‌ఫోన్లు, యమహా ఎంటీ -15 బైక్, రూ. 2500 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ కూడా అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వారని, గతంలోనూ గంజాయి కేసుల్లో పట్టుబడ్డారని తెలిపారు. ఒడిశాకు చెందిన సరఫరాదారు తమరా గోపాల్ పరారీలో ఉన్నట్లు సమాచారం.
అయితే హైదరాబాద్‌లో డ్రగ్స్ డెలివరీ చేయడానికి ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున ఇస్తామని ఒప్పందం చేసుకున్నట్లు విచారణలో తేలింది. నిందితులపై నాగోల్ పోలీసు స్టేషన్‌లో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు.
తాజావార్తలు
- ●Milad-un-Nabi | మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు శాంతియుతంగా నిర్వహించాలి
- ●Rain Alert | తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు.. హెచ్చరించిన ఐఎండీ
- ●Job Mela | ఆగస్టు 24న హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా
- ●Minister Komatireddy | రోడ్ల పనుల్లో జాప్యం వద్దు.. వేగం పెంచాలి: కోమటిరెడ్డి
- ●కొండా ఫ్యామిలీకి ఒకలా?… కోమటిరెడ్డి ఫ్యామిలీకి మరోలా? తెలంగాణ కాంగ్రెస్‌లో డబుల్ స్టాండర్డ్స్ రచ్చ!!
- ●Adluri Laxman Kumar | ఆశ్రమ పాఠశాలల్లోని సీఆర్టీ సిబ్బంది సమస్యలు పరిష్కారిస్తాం : మంత్రి అడ్లూరి

Milad-un-Nabi | మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు శాంతియుతంగా నిర్వహించాలి

Rain Alert | తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు.. హెచ్చరించిన ఐఎండీ

Job Mela | ఆగస్టు 24న హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా

Minister Komatireddy | రోడ్ల పనుల్లో జాప్యం వద్దు.. వేగం పెంచాలి: కోమటిరెడ్డి




