Ramya Krishnan | కమల రెడ్డిగా శివగామి – మంచు మనోజ్ సినిమాలో పవర్‌ఫుల్ రోల్
మంచు మనోజ్ హీరోగా డేవిడ్ రెడ్డి పేరుతో ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. రమ్యకృష్ణ బర్త్‌డే సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Entertainment | Published On Sep 15, 2026, 4.08 pm IST
Ramya Krishnan | రాజమౌళి బాహుబలి మూవీలో ప్రభాస్, రానా దగ్గుబాటి వంటి స్టార్స్‌కు ధీటుగా పవర్‌ఫుల్ పాత్రతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. సెకండ్ ఇన్నింగ్స్‌లో సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా అడుగులు వేస్తోంది రమ్యకృష్ణ. బాహుబలి తర్వాత ఆమె ఒప్పుకున్న సినిమాల కంటే వదిలేసిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. కొంత గ్యాప్ తర్వాత మరో డిఫరెంట్ రోల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
డేవిడ్ రెడ్డి...
మంచు మనోజ్ హీరోగా డేవిడ్ రెడ్డి పేరుతో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. బ్రిటీషర్లను ఎదురించి పోరాడిన ఓ వీరుడి కథతో ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. కమలరెడ్డి అనే పాత్రలో ఆమె నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
స్పెషల్ పోస్టర్...
రమ్యకృష్ణ బర్త్‌డే సందర్భంగా మంగళవారం ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో చేతిలో కత్తితో సింహాసనం లాంటి పెద్ద కుర్చీలో కూర్చొని రమ్యకృష్ణ కనిపిస్తోంది. చుట్టూ శవాలు, చేతితో పాటు ఆమె చీరనిండా రక్తం మరకలు ఉండటం ఆసక్తిని పంచుతోంది. రమ్యకృష్ణ కెరీర్‌లో మరో ఐకానిక్ పాత్రగా కమల రెడ్డి నిలుస్తుందని మేకర్స్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్ నటి...
డేవిడ్ రెడ్డిలో ఉక్రెయిన్ నటి మరియా ర్యాబోషప్కా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ఏడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగులో రూపొందుతోన్న ఈ సినిమాను తమిళం, హిందీతో పాటు మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ అనౌన్స్ – నాలుగోసారి విజయ్ దేవరకొండకు జోడీగా రష్మిక?
సెప్టెంబర్ 15, 2026

Bold OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి తెలుగు అడల్ట్ కామెడీ మూవీ – డబుల్ మీనింగ్ డైలాగ్స్, బోల్డ్ సీన్స్ ఎక్కువే!
సెప్టెంబర్ 15, 2026

Samantha | సమంత సీమంతం ఫొటోలు – హాజరైన అతిథులు ఎవరంటే?
సెప్టెంబర్ 15, 2026
తాజావార్తలు
- ●Balapur Ganesh | రూ. 40 లక్షల వ్యయంతో బాలాపూర్ గణేశ్ మండపం ఏర్పాటు.. ప్రత్యేకత ఏంటంటే..?
- ●Supreme Court | సుప్రీంలో హైడ్రాకు భారీ షాక్.. ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత
- ●Stock Markets | ఊహించినట్లే జరిగింది.. స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్.. రూ.9 లక్షల కోట్లు ఆవిరి..
- ●BJP MLA Parag Shah Beggar | రూ.3,300 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్లు, సెక్యూరిటీ వదిలేసి ముంబై రోడ్లపై బిచ్చగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే
- ●DK Shivakumar | ట్రంప్ కూడా కాంగ్రెస్ పథకాలనే కాపీ కొడుతున్నారు.. డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ●Redmi Note 17 Pro | 10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రెడ్మీ కొత్త ఫోన్లు. ధర ఎంతంటే..

Balapur Ganesh | రూ. 40 లక్షల వ్యయంతో బాలాపూర్ గణేశ్ మండపం ఏర్పాటు.. ప్రత్యేకత ఏంటంటే..?

Supreme Court | సుప్రీంలో హైడ్రాకు భారీ షాక్.. ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత

Stock Markets | ఊహించినట్లే జరిగింది.. స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్.. రూ.9 లక్షల కోట్లు ఆవిరి..

BJP MLA Parag Shah Beggar | రూ.3,300 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్లు, సెక్యూరిటీ వదిలేసి ముంబై రోడ్లపై బిచ్చగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే



