త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Doctor Suicide | క‌రీంన‌గ‌ర్‌లో డాక్ట‌ర్ ఆత్మ‌హ‌త్య‌

Doctor Suicide | కరీంన‌గ‌ర్ రూర‌ల్‌లోని ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో ప‌ని చేస్తున్న డాక్ట‌ర్ గౌత‌మ్ ప‌సుల ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

S

Telangana | Published On Sep 15, 2026, 4.38 pm IST

Doctor Suicide | క‌రీంన‌గ‌ర్‌లో డాక్ట‌ర్ ఆత్మ‌హ‌త్య‌
Advertisement

Doctor Suicide | త్రినేత్ర‌.న్యూస్ : కరీంన‌గ‌ర్ రూర‌ల్‌లోని ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో ప‌ని చేస్తున్న డాక్ట‌ర్ గౌత‌మ్ ప‌సుల ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. వ‌రుస‌గా రెండుసార్లు పీజీ మెడిక‌ల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసిన‌ప్ప‌టికీ, ఉత్తీర్ణ‌త సాధించ‌లేదు. ఈ క్ర‌మంలో గౌత‌మ్ మాన‌సిక ఒత్తిడికి గురవుతున్న‌ట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార‌ణంతోనే గౌత‌మ్ ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉండొచ్చని కుటుంబ స‌భ్యులు అనుమానం వ్య‌క్తం చేశారు.

కరీంనగర్ హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్‌ఆర్‌డిఎ) ఉపాధ్యక్షుడిగా గౌత‌మ్ సేవ‌లందించారు. గ‌డ్డి మందు పారాక్వాట్ డైక్లోరైడ్‌ను నిషేధించాల‌ని ఉద్య‌మం కూడా చేశారు. డాక్ట‌ర్ మృతిప‌ట్ల హెచ్ఆర్‌డీఏ స‌భ్యులు సంతాపం వ్య‌క్తం చేశారు. “ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్టు పద్ధతిలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తూ, ప్ర‌జారోగ్యానికి చిత్త‌శుద్ధితో ప‌ని చేశారు. వైద్యుల హ‌క్కులు, వారి గౌర‌వం, సంక్షేమం కోసం గౌత‌మ్ పాటుప‌డ్డార‌ని పేర్కొన్నారు.

Advertisement
Advertisement