త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Katanapalli Municipality | క్యాత‌న‌ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మ‌న్‌, వైస్‌చైర్మ‌న్ ఎన్నిక‌.. మంత్రి వివేక్ ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడాలి: గంగుల క‌మ‌లాక‌ర్‌

Katanapalli Municipality | పెద్ద‌ప‌ల్లి జిల్లా క్యాత‌న‌ప‌ల్లి మున్సిప‌ల్ (Katanapalli Municipality) చైర్మ‌న్‌, వైస్‌చైర్మ‌న్ ఎన్నిక మ‌రికొన్ని గంట‌ల్లో జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా క‌రీంన‌గ‌ర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ (Gangula Kamalakar) మాట్లాడుతూ.. క్యాతనపల్లి కౌన్సిలర్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడార‌న్నారు.

G

Telangana | Published On Apr 4, 2026, 9.12 am IST

Katanapalli Municipality | క్యాత‌న‌ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మ‌న్‌, వైస్‌చైర్మ‌న్ ఎన్నిక‌.. మంత్రి వివేక్ ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడాలి: గంగుల క‌మ‌లాక‌ర్‌
Advertisement

Katanapalli Municipality | త్రినేత్ర‌.న్యూస్‌: పెద్ద‌ప‌ల్లి జిల్లా క్యాత‌న‌ప‌ల్లి మున్సిప‌ల్ (Katanapalli Municipality) చైర్మ‌న్‌, వైస్‌చైర్మ‌న్ ఎన్నిక మ‌రికొన్ని గంట‌ల్లో జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా క‌రీంన‌గ‌ర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ (Gangula Kamalakar) మాట్లాడుతూ.. క్యాతనపల్లి కౌన్సిలర్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడార‌న్నారు. మంత్రి వివేక్ ప్రజల తీర్పును వివేక్ గౌరవించాలని, ప్రజాస్వామ్యన్ని కాపాడాల‌ని చెప్పారు. పోలీసులను పెట్టి అడ్డుకుంటే సహించేదిలేద‌ని స్ప‌ష్టం చేశారు. క్యాత‌న‌ప‌ల్లిలో అవాంఛ‌నీయ ఘటనలు జరుగకుండా వివేక్ చూడాలని డిమాండ్ చేశారు. ఇది బీఆర్ఎస్ డే అని.. మూడు మున్సిపాలిటీలను గెలుచుకుంటామ‌ని న‌మ్మ‌కం వ్య‌క్తంచేశారు.

కాగా, ఫిబ్రవరి 11న రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ నిర్వహించారు. అదేనెల‌ 14న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అనంతరం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ పదవుల ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. క్యాతనపల్లిలో కూడా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికత‌కు దారితీసింది. దీంతో ఆప్ర‌క్రియ‌ ఆగిపోయింది. ఈ క్ర‌మంలో క్యాతనపల్లితోపాటు ఖానాపూర్‌, ఇబ్ర‌హీంప‌ట్నం మున్సిపాలిటీల్లో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక శ‌నివారం జ‌రుగ‌నుంది.

క్యాత‌న‌ప‌ల్లిలో మొత్తం 22 వార్డులు ఉండ‌గా రెండు ఎక్స్‌ అఫిషియో ఓట్లు ఉన్నాయి. బీఆర్ఎస్, సీపీఐ కూట‌మికి 14, ఎక్స్‌ అఫిషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 10 ఉంది. చైర్మ‌న్ ఎన్నిక‌కు మ్యాజిక్ ఫిగర్ 13. చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవుల కోసం బీఆర్ఎస్-సీపీఐ కూటమి, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి.

మ‌రోవైపు ఖానాపూర్ మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో బీజేపీ 4, బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1 చొప్పున ద‌క్కించుకున్నారు. చైర్మ‌న్ ప‌ద‌వికి ఏడుగురు స‌భ్యుల మ‌ద్ద‌తు అవ‌సరం. ఎమ్మెల్యే, ఎక్స్ అఫిషియో, ఇండిపెండెంట్‌ కౌన్సిలర్‌, మరో బీఆర్ఎస్ కౌన్సిలర్‌తో కలిపి కాంగ్రెస్ బ‌లం 6కు చేరింది. ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 19వ వార్డు యాదగిరి కిడ్నాప్‌ వివాదంతో వాయిదాప‌డిన‌ మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక శ‌నివారం జ‌రుగనుంది. మున్సిపాల్టీలో మొత్తం 24 వార్డులు ఉండ‌గా బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2, ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు.

Advertisement
Advertisement