Gallantry Medal | గ్యాలంటరీ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. తెలంగాణ నుంచి ముగ్గురికి
Gallantry Medals | దేశవ్యాప్తంగా అత్యున్నత సేవలు అందించిన పోలీసులకు కేంద్ర ప్రభుత్వం ఏటా గ్యాలంటరీ (Gallantry Medals), సర్వీస్ మెడల్స్ (Service Medals) అందిస్తున్నది. ఇందులో భాగంగా 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 982 మంది పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు ప్రకటించింది.
త్రినేత్ర.న్యూస్: దేశవ్యాప్తంగా అత్యున్నత సేవలు అందించిన పోలీసులకు కేంద్ర ప్రభుత్వం ఏటా గ్యాలంటరీ (Gallantry Medals), సర్వీస్ మెడల్స్ (Service Medals) అందిస్తున్నది. ఇందులో భాగంగా 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 982 మంది పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు ప్రకటించింది. ఇందులో 125 మందికి గ్యాలంటరీ మెడల్, 101 మంది రాష్ట్రపతి సర్వీస్ మెడల్, 756 మంది మారిటోరియస్ సర్వీస్ మెడల్ ఉన్నాయి.
ఇక తెలంగాణ (Telangana) నుంచి ముగ్గురు గ్యాలంటరీ, సర్వీస్ మెడల్స్ దక్కాయి. వారిలో అదనపు ఎస్పీ జీఎస్ ప్రకాశ్‌రావు, ఎస్ఐ దామోదర్ రెడ్డి రాష్ట్రపతి మెడల్స్ అందుకోనుండగా, హెడ్‌కానిస్టేబుల్ మర్రి వెంకట్‌రెడ్డి గ్యాలంటరీ అవార్డుకు ఎంపికయ్యారు. రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా పోలీసులు, ఫైర్ సిబ్బంది, హోంగార్డులకు కేంద్ర హోం శాఖ గ్యాలంటరీ, సర్వీస్ మెడల్స్ అందిస్తున్నది.
కాగా, గతేడాది రాష్ట్రం నుంచి ఇద్దరు అధికారులకు పోలీస్ మెడల్స్, మరో 12 మందికి ఉత్తమ సేవా పథకాలు దక్కాయి. కమిషనర్ విక్రంసింగ్ మన్, ఎస్పీ మెట్టు మాణిక్‌రాజ్‌కు గ్యాలంటరీ మెడల్స్ అందుకోగా, సీబీఐ జాయింట్ డైరెక్టర్ దాట్ల శ్రీనివాసవర్మకు పోలీసు మెడల్ దక్కింది. ఇక ఉత్తమ పోలీసు సేవా పథకం పొందిన వారిలో ఐజీ కార్తికేయ, ఎస్పీ అన్నల ముత్యంరెడ్డి, డిప్యూటీ కమిషనర్ కమాల్ల రాంకుమార్, డిప్యూటీ కమిషనర్ మహమ్మద్ ఫజ్లుర్ రహమాన్, డీఎస్పీ కోటపాటి వెంకట రమణ, డీఎస్పీ అన్ను వేణుగోపాల్, ఏఎస్‌ఐ రణ్‌వీర్ సింగ్ ఠాకూర్, ఏఎస్‌ఐ పీటర్ జోసెఫ్ బహదూర్, ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ విదత్యా పాథ్యా నాయక్, హెడ్ కానిస్టేబుల్ ఎండీ అయూబ్ ఖాన్ ఉన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



