Gade Innaiah | గాదె ఇన్నయ్యకు మాతృవియోగం.. జైలు నుంచి విడుదలయ్యేనా..?
Gade Innaiah | పీపుల్స్ వార్ మాజీ నేత గాదె ఇన్నయ్యకు మాతృవియోగం కలిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి థెరిసమ్మ గురువారం రాత్రి కన్నుమూశారు.
Gade Innaiah | త్రినేత్ర.న్యూస్ : పీపుల్స్ వార్ మాజీ నేత గాదె ఇన్నయ్యకు మాతృవియోగం కలిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి థెరిసమ్మ గురువారం రాత్రి కన్నుమూశారు. థెరిసమ్మ మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎన్ఐఏ అరెస్టుతో ప్రస్తుతం జైల్లో ఉన్న ఇన్నయ్య తన తల్లిని కడసారి చూసేందుకు పోలీసులు అనుమతిస్తారా..? లేదా..? అన్నది సందేహంగా మారింది.
గాదె ఇన్నయ్య మాత్రం ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. నిషేధిత మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారనే కారణంగా 2025 డిసెంబర్ 21న ఆయనను ఎన్ఐఏ పోలీసులు ఉపా చట్టం కింద అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం విదితమే. ఈ క్రమంలో జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం సాగరం గ్రామంలోని ఇన్నయ్య సొంతింట్లో రెండు రోజుల క్రితం పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఆశ్రమంలోనూ తనిఖీలు నిర్వహించారు. సొంతింట్లో రూ. లక్ష నగదును సీజ్ చేశారు. ఆశ్రమంలో కొన్ని పుస్తకాలు, ల్యాప్‌టాప్, ఐప్యాడ్‌లను సీజ్ చేసి నేరపూరిత పత్రాలను స్వాధీనం చేసుకుని తీసుకెళ్తున్నామని ఆశ్రమ నిర్వాహకురాలికి పత్రం అందించి వెళ్లారు పోలీసులు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






