త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Free Training for Police Jobs | ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 60 రోజుల పాటు ఉచిత శిక్షణ

Free Training for Police Jobs | ఎస్ఐ, కానిస్టేబుల్ నియామక పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ గిరిజ‌న సంక్షేమ శాఖ గుడ్ న్యూస్ వినిపించింది.

S

Telangana | Published On Oct 12, 2026, 6.08 pm IST

Free Training for Police Jobs | ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 60 రోజుల పాటు ఉచిత శిక్షణ
Advertisement

Free Training for Police Jobs | త్రినేత్ర న్యూస్‌: ఎస్ఐ, కానిస్టేబుల్ నియామక పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ గిరిజ‌న సంక్షేమ శాఖ గుడ్ న్యూస్ వినిపించింది. హైదరాబాద్‌లోని PETC కేంద్రంలో 60 రోజుల పాటు ఈ ఉచిత‌ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. TGRPB నిర్వహించే ప‌రీక్ష‌ల కోసం మెరిట్ ఆధారంగా మొత్తం 100 మంది అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు.

ఇందులో ఎస్టీ కేటగిరీ నుంచి 75 మంది, ఎస్సీ నుంచి 15 మంది, బీసీ నుంచి 10 మందికి అవకాశం కల్పించనున్నారు. అర్హులైన అభ్యర్థులు http://studycircle.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈనెల 15 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల‌ని గిరిజ‌న సంక్షేమ శాఖ డైరెక్ట‌ర్ సూచించారు. శిక్షణ కార్యక్రమం ఈనెల 23 నుంచి ప్రారంభం అవుతుంద‌ని పేర్కొన్నారు.

పూర్తి వివరాల కోసం 040-27540104 నంబర్‌లో సంప్రదించాల‌ని.. పని దినాల్లో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్‌లో సమాచారం పొందవచ్చన్నారు.

Advertisement
Advertisement