త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Municipal Elections | పంచాయ‌తీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో రూ. 4 కోట్ల‌కు పైగా న‌గ‌దు సీజ్

Municipal Elections | కొద్ది రోజుల క్రితం తెలంగాణ వ్యాప్తంగా గ్రామ‌పంచాయ‌తీ, మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే ఈ రెండు ఎన్నిక‌ల సంద‌ర్భంగా రూ. 4 కోట్ల‌కు పైగా న‌గ‌దు సీజ్ అయిన‌ట్లు ఆర్టీఐ ద్వారా తెలిసింది.

S

Telangana | Published On Mar 14, 2026, 7.27 pm IST

Municipal Elections | పంచాయ‌తీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో రూ. 4 కోట్ల‌కు పైగా న‌గ‌దు సీజ్
Advertisement

Municipal Elections | త్రినేత్ర‌.న్యూస్ : కొద్ది రోజుల క్రితం తెలంగాణ వ్యాప్తంగా గ్రామ‌పంచాయ‌తీ, మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే ఈ రెండు ఎన్నిక‌ల సంద‌ర్భంగా రూ. 4 కోట్ల‌కు పైగా న‌గ‌దు సీజ్ అయిన‌ట్లు ఆర్టీఐ ద్వారా తెలిసింది. న‌గ‌దుతో పాటు బంగారం, మ‌ద్యం, డ్ర‌గ్స్‌తో పాటు ఉచితాల‌కు సంబంధించిన వ‌స్తువుల వివ‌రాల‌ను కూడా వెల్ల‌డయ్యాయి. ఎన్ని కేసులు న‌మోదయ్యాయో కూడా తెలిసింది.

గ్రామ పంచాయితీ, మున్సిప‌ల్ వివ‌రాల‌ను వేర్వేరుగా జిల్లాల వారీగా అందించాల‌ని యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా ద‌ర‌ఖాస్తు చేసింది. ఎన్నిక‌ల సంఘం అందించిన స‌మాచారాన్ని యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ పౌండ‌ర్ రాజేంద్ర ప‌ల్నాటి విడుద‌ల చేశారు.

గ్రామ‌పంచాయ‌తీ ఎన్నిక‌లు

సీజ్ చేసిన మొత్తం న‌గ‌దు - రూ. 2,48,08,440
బంగారం, మ‌ద్యం, డ్ర‌గ్స్, ఉచితాల విలువ - రూ. 7,35,14,683
న‌మోదైన ఎఫ్ఐఆర్ కేసులు - 4246

మున్సిపాలిటీ ఎన్నిక‌లు

సీజ్ చేసిన మొత్తం న‌గ‌దు - రూ.1,56,29,170
బంగారం, మ‌ద్యం, డ్ర‌గ్స్, ఉచితాల విలువ - రూ. 1,99,46,440
న‌మోదైన ఎఫ్ఐఆర్ కేసులు - 2547

Advertisement
Advertisement