Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో మళ్లీ జోరు.. భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు..
Gold And Silver Prices Today | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ భారత్, చైనా వంటి దేశాలపై టారిఫ్‌లను విధిస్తున్నట్లు ప్రకటించడంతో ఈక్విటీ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ టారిఫ్‌ల భయం కారణంగా పెట్టుబడిదారులు ఈక్విటీ మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకుంటున్నారు.
Gold And Silver Prices Today | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ భారత్, చైనా వంటి దేశాలపై టారిఫ్‌లను విధిస్తున్నట్లు ప్రకటించడంతో ఈక్విటీ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ టారిఫ్‌ల భయం కారణంగా పెట్టుబడిదారులు ఈక్విటీ మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకుంటున్నారు. దీంతో బులియన్ మార్కెట్లపై ఆసక్తి పెరిగింది. ఫలితంగా బంగారం, వెండి ధరలు గత రెండు రోజులుగా మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లలో బంగారం ధర ఔన్స్‌కు 2.19 శాతం ఎగబాకి 3,645 డాలర్లకు చేరగా, వెండి ధర 5.48 శాతం పెరిగి 43 డాలర్లకు చేరింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2,517 పాయింట్లు పెరిగి 1,24,900 వద్ద నిలవగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 7,434 పాయింట్లు పెరిగి 1,53,277 వద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. బంగారం ధర ఒక్క రోజులోనే రూ.17వేలకు పైగా పెరగ్గా, వెండి ధర రూ.5వేలు పెరిగింది.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.12,655 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,01,240 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,26,550 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.12,65,500 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.17,500 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,600 ఉండగా, 8 గ్రాముల ధర రూ.92,800గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,16,000 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,60,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.16,000 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.9,491 ఉండగా, 8 గ్రాముల ధర రూ.75,928గా ఉంది. 10 గ్రాముల ధర రూ.94,910 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.9,49,100గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.13,100 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.1,70,000 ఉండగా, తులం ధర రూ.1,700గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.5వేలు పెరిగింది, అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.1,70,000 ఉండగా, తులం ధర రూ.1,700 గా ఉంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Instagram For TV | టీవీలోనూ ఇన్స్టాగ్రామ్.. ఇక పెద్ద స్క్రీన్‌పై రీల్స్..
- ●Samantha | కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ సీక్వెల్లో సమంత - కమ్‌బ్యాక్ అప్పుడేనా?
- ●Self Employed Indians | పింఛన్, ఈపీఎఫ్ లేవు.. రిటైర్మెంట్ ఆదాయం ఎలా పొందాలి?
- ●PM Modi | నారీ శక్తికి ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
- ●Ramchandar Rao | పూలే దంపతుల స్ఫూర్తితో మహిళలకు 33 శాతం సీట్లు ఇస్తం
- ●Bisleri water | బిస్లరీ నీటిలో కోలిఫామ్ బ్యాక్టీరియా.. ప్రాసిక్యూషన్‌కు FSSAI అనుమతి

Instagram For TV | టీవీలోనూ ఇన్స్టాగ్రామ్.. ఇక పెద్ద స్క్రీన్‌పై రీల్స్..

Samantha | కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ సీక్వెల్లో సమంత - కమ్‌బ్యాక్ అప్పుడేనా?

Self Employed Indians | పింఛన్, ఈపీఎఫ్ లేవు.. రిటైర్మెంట్ ఆదాయం ఎలా పొందాలి?

PM Modi | నారీ శక్తికి ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ






