త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | బంగారం ధ‌ర‌ల‌కు భారీ బూస్ట్‌.. ఒక్క రోజులోనే రూ.26వేలు పెరుగుద‌ల‌.. కార‌ణాలేమిటి..?

Gold And Silver Prices Today | బంగారం ధ‌ర‌లు ఏడాది క‌నిష్ట స్థాయిల‌కు ప‌డిపోవ‌డంతో అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో భారీ షార్ట్ క‌వ‌రింగ్ చోటు చేసుకుంది. దీంతో మ‌ళ్లీ ఆ లోహం ధ‌ర‌లు ఒక్క‌సారిగా ఎగిశాయి. గ‌త సెష‌న్ ముగింపు స‌మ‌యంలో అక‌స్మాత్తుగా భారీ ర్యాలీ వ‌చ్చి అది గురువారం కూడా కొన‌సాగుతోంది.

S

Business | Published On Nov 26, 2026, 11.17 am IST

Gold And Silver Prices Today | బంగారం ధ‌ర‌ల‌కు భారీ బూస్ట్‌.. ఒక్క రోజులోనే రూ.26వేలు పెరుగుద‌ల‌.. కార‌ణాలేమిటి..?
Advertisement

Gold And Silver Prices Today | బంగారం ధ‌ర‌లు ఏడాది క‌నిష్ట స్థాయిల‌కు ప‌డిపోవ‌డంతో అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో భారీ షార్ట్ క‌వ‌రింగ్ చోటు చేసుకుంది. దీంతో మ‌ళ్లీ ఆ లోహం ధ‌ర‌లు ఒక్క‌సారిగా ఎగిశాయి. గ‌త సెష‌న్ ముగింపు స‌మ‌యంలో అక‌స్మాత్తుగా భారీ ర్యాలీ వ‌చ్చి అది గురువారం కూడా కొన‌సాగుతోంది. దీంతో ఇవాళ బంగారం ధ‌ర‌లు భారీగానే పెరిగాయి. అయితే అమెరికాలో పెరుగుతున్న ద్ర‌వ్యోల్బ‌ణం, డాల‌ర్ బ‌ల‌ప‌డుతుండ‌డం వంటి కార‌ణాల‌తో పెట్టుబ‌డిదారులు అప్ర‌మ‌త్తంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో ఈ ర్యాలీ కొన‌సాగుతుందా, లేదా అని ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. ఇక అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్ల‌లో గురువారం ఔన్స్ బంగారం ధ‌ర 0.38 శాతం స్వ‌ల్పంగా పెరిగి 3,602 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 1.95 శాతం ఎగ‌బాకి 42 డాల‌ర్ల‌కు చేరుకుంది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 2,713 పాయింట్లు పెరిగి 1,23,850కి చేర‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 6,177 పాయింట్లు పెరిగి 1,48,694కు చేరుకుంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం ధ‌ర‌లు భారీగా పెరిగాయి. ఒక్క రోజులోనే రూ.26వేల‌కు పైగా పెరుగుద‌ల చోటు చేసుకోగా, వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.12,589 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,00,712 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,25,890 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.12,58,900 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.26,100 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,540 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.92,320గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,15,400 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,54,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.24,000 పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.9,442 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.75,536గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.94,420 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.9,44,200గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.19,600 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.1,65,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.1,650గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.1,65,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.1,650 గా ఉంది.

Advertisement
Advertisement