త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Municipal Election Results | సింహ గ‌ర్జ‌న‌.. వడ్డేపల్లి మున్సిపాలిటీ ఫార్వర్డ్‌ బ్లాక్‌ కైవసం

Municipal Election Results | ఫార్వ‌ర్డ్ బ్లాక్ పార్టీ (Forward Block Party) సంచ‌ల‌నం న‌మోదుచేసింది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి (Waddepalli) మున్సిపాలిటీ సింహ గ‌ర్జ‌న చేసింది. మున్సిపాలిటీలోని 10 వార్డుల్లో 8 చోట్ల ఫార్వ‌ర్డ్ బ్లాక్ పార్టీ అభ్య‌ర్థులు గెలుపొందారు.

G

Telangana | Published On Feb 13, 2026, 12.26 pm IST

Municipal Election Results | సింహ గ‌ర్జ‌న‌.. వడ్డేపల్లి మున్సిపాలిటీ ఫార్వర్డ్‌ బ్లాక్‌ కైవసం
Advertisement

Municipal Election Results | త్రినేత్ర.న్యూస్‌: మున్సిప‌ల్ ఎన్నిక‌ల (Municipal Election Results) ఓట్ల లెక్కింపు కొన‌సాగుతున్న‌ది. రాష్ట్రంలోని 116 పురపాలికల్లోని 2582 వార్డుల్లో ఇప్ప‌టివ‌ర‌కు 1357 చోట్ల ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. వాటిలో కాంగ్రెస్ 727 వార్డుల్లో విజ‌యం సాధించ‌గా, బీఆర్ఎస్ 398, బీజేపీ 116, ఇత‌రులు 116 చోట్ల గెలుపొందారు.

ఫార్వ‌ర్డ్ బ్లాక్ పార్టీ (Forward Block Party) సంచ‌ల‌నం న‌మోదుచేసింది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి (Waddepalli) మున్సిపాలిటీ సింహ గ‌ర్జ‌న చేసింది. మున్సిపాలిటీలోని 10 వార్డుల్లో 8 చోట్ల ఫార్వ‌ర్డ్ బ్లాక్ పార్టీ అభ్య‌ర్థులు గెలుపొందారు. సింహం గుర్తు దెబ్బ‌కు కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కో స్థానానికే ప‌రిమ‌వ్వాల్సి వ‌చ్చింది.

ఇక అయిజ మున్సిపాలిటీపై బీఆర్‌ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగుర‌వేసింది. మొత్తం 20 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ 13, కాంగ్రెస్ 7 ద‌క్కించుకున్నాయి. అలంపూర్‌లో ఏ పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌ను ద‌క్కించుకోలేక‌పోయాయి. మున్సిపాలిటీలోని 10 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు చెరో ఐదు చొప్పున గెలుపొందాయి. గ‌ద్వాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్ప‌ష్ట‌మైన మెజార్టీ దిశ‌గా దూసుకుపోతున్న‌ది. 37 వార్డుల‌కు గాను ఇప్ప‌టివ‌ర‌కు 23 స్థానాల్లో ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. ఇందులో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 6, బీజేపీ 4, ఇత‌రులు 3 చోట్ల విజ‌యం సాధించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement