త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vasudeva Reddy | నిరుద్యోగుల‌కు ధైర్య‌మిస్తం.. వారికి అండ‌గా ఉంటం

Vasudeva Reddy | కాంగ్రెస్ పాల‌న‌లో ద‌గాప‌డ్డ నిరుద్యోగుల‌కు ధైర్య‌మిచ్చి వారికి అండ‌గా ఉంటామ‌ని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేష‌న్ మాజీ చైర్మ‌న్ డా. కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి తెలిపారు. కేటీఆర్ 50 జన్మదినాన్ని పురస్కరించుకొని కేటీఆర్ నిరుద్యోగ భరోసా కార్యక్రమాన్ని ఈనెల‌ 22న హనుమకొండలోని న్యూ రాయల్ గార్డెన్‌లో ఆన్‌లైన్ కోచింగ్‌ ప్రారంభించ‌బోతున్నామ‌న్నారు.

S

Telangana | Published On Jul 20, 2026, 4.03 pm IST

Vasudeva Reddy | నిరుద్యోగుల‌కు ధైర్య‌మిస్తం.. వారికి అండ‌గా ఉంటం
Advertisement
  • విన్నర్స్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో ఆన్‌లైన్ కోచింగ్‌
  • కాంగ్రెస్ నిరుద్యోగుల‌ను మోసం చేసింది
  • కేటీఆర్ నిరుద్యోగ భరోసా కార్య‌క్ర‌మం పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌లో కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి

Vasudeva Reddy | త్రినేత్ర‌.న్యూస్: కాంగ్రెస్ పాల‌న‌లో ద‌గాప‌డ్డ నిరుద్యోగుల‌కు ధైర్య‌మిచ్చి వారికి అండ‌గా ఉంటామ‌ని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేష‌న్ మాజీ చైర్మ‌న్ డా. కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి తెలిపారు. కేటీఆర్ 50 జన్మదినాన్ని పురస్కరించుకొని కేటీఆర్ నిరుద్యోగ భరోసా కార్యక్రమాన్ని ఈనెల‌ 22న హనుమకొండలోని న్యూ రాయల్ గార్డెన్‌లో ఆన్‌లైన్ కోచింగ్‌ ప్రారంభించ‌బోతున్నామ‌న్నారు. నిరుద్యోగులు క‌దిలి వ‌చ్చి స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా ఉచిత శిక్ష‌ణ కార్య‌క్ర‌మానికి సంబంధించిన పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. బాల‌స‌ముద్రంలోని భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ హ‌నుమ‌కొండ జిల్లా కార్యాల‌యంలో సోమ‌వారం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడారు. ముఖ్య అతిథులుగా ప్ర‌ముఖ మోటివేట‌ర్ డా.ఆకెళ్ళ రాఘవేంద్ర, బీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు, విద్యార్థి సంఘాల ప్ర‌తినిధులు హాజ‌ర‌వుతున్నార‌న్నారు.

కాంగ్రెస్ నిరుద్యోగులను మోసం చేసింది. ఆగ‌మ‌వుతున్న నిరుద్యోగుల‌కు అండ‌గా ఉంటాం. జూలై 22న హ‌నుమ‌కొండ‌లోని న్యూరాయ‌ల్ గార్డెన్లో ఉచిత శిక్ష‌ణ‌, యాప్ లాంచ్ కార్య‌క్ర‌మం ఉంటుంది. ప్రతిష్టాత్మకమైన విన్నర్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో ఆన్లైన్ కోచింగ్ ఇవ్వన్నున్నాం. మాజీ మంత్రివ‌ర్యులు క‌ల్వ‌కుంట్ల తార‌క రామ‌రావు నాయ‌క‌త్వంలో తెలంగాణ‌లో ఐటీ రంగం పురోగ‌తి చెంది దేశంలోనే అగ్ర‌గామిగా నిలిచింది. పారిశ్రామిక రంగంలో సైతం తెలంగాణ నెంబ‌ర్ 1గా నిలిచింది. కేటీఆర్ నాయ‌క‌త్వంలో విద్యార్థుల‌కు శిక్ష‌ణ ఇచ్చేందుకు టాస్క్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేయ‌డం, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు టీ హబ్, టీ వ‌ర్క్స్ వంటి సంస్థ‌ల‌ను ఏర్పాటు చేశారు అని ఆయ‌న గుర్తు చేశారు.

తెలంగాణ‌లోని యువత నైపుణ్యం పెంపొందించేందుకు అనేక కార్య‌క్ర‌మాల‌ను కేసీఆర్ స‌ర్కారు చేప‌ట్టింది. తెలంగాణ‌లోని కేసీఆర్ స‌ర్కారు 1,62,000 ఉద్యోగాలు ఇచ్చింది. ప్ర‌భుత్వ ఉద్యోగాల‌తో పాటు ప్రయివేట్ రంగంలో సైతం బీఆర్ఎస్ ప్ర‌భుత్వం లక్షల్లో ఉద్యోగాలు క‌ల్పించింది. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేసిన పనిని చెప్పుకోలేక పోయాం. అందుకే ప్ర‌తిప‌క్షంలో ఉన్నాం. 2023 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నిరుద్యోగుల‌కు రెండు ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇస్తామ‌ని హామీ ఇచ్చి, మోసం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 11 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. ఉద్యోగాల విషయంలో ఏ చర్చకైనా సిద్ధం అని వాసుదేవ‌రెడ్డి పేర్కొన్నారు.

ఇటీవ‌ల కేటీఆర్ నిరుద్యోగుల‌కు అండ‌గా నిలిచేందుకు నిర్వ‌హించిన యువ సంగ్రామ స‌ద‌స్సు విజ‌య‌వంతం అయ్యింది. హ‌నుమ‌కొండ‌లో నిరుద్యోగ యువత కదలి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్ర‌జాప్ర‌తినిధులు, మాజీ ప్ర‌జాప్ర‌తినిధులు సైతం కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతారు అని ఆయ‌న వెల్ల‌డించారు.

మాజీ కార్పొరేట‌ర్ జోరిక ర‌మేష్ మాట్లాడుతూ.. ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ, డైనమిక్ లీడర్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా విద్యార్థి నాయ‌కుడు మాజీ చైర్మ‌న్ డా. వాసుదేవ రెడ్డి ఉద్యోగ శిక్ష‌ణ అభ్య‌ర్థ‌ల‌కు ఉచిత శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని అందించ‌డం అభినంద‌నీయమ‌న్నారు. పేద, మధ్య తరగతి నిరుద్యోగ యువత కోసం దాదాపు 20 వేల విలువైన ఆన్‌లైన్ యాప్‌ను ఈ శిక్ష‌ణ‌లో ఉచితంగా అందిస్తార‌ని చెప్పారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు సాయం చేసేందుకు వాసుదేవ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు.

డా.కొమురయ్య మాట్లాడుతూ.. ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని జీవితంలో వారు ఎంచుకున్న లక్ష్యాన్ని నిరుద్యోగులు చేరుకోవాలని ఆకాంక్షించారు. డా. వీరేందర్ మాట్లాడుతూ.. ఈ యాప్‌ను ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. రవినాయక్, రామ్మూర్తి, శరత్ చంద్ర మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని నెర‌వేర్చ‌లేద‌ని మండిప‌డ్డారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేష‌న్ల‌కు కాంగ్రెస్ ఉద్యోగ నియామ‌క ప‌త్రాల‌ను ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చామ‌ని చెప్పుకోవ‌డం వారి చేత‌కానిత‌నానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు.

ఈ కార్యక్రమంలో రాజ్‌కిశోర్‌, డా.కంజ‌ర్ల మ‌నోజ్‌, రాకేష్ యాద‌వ్‌, వీర‌స్వామి, రాజ‌గోపాల్‌, ర‌మేష్ నాయ‌క్‌, కోర‌పెల్లి రాజేష్‌, పానుగంటి శ్రీ‌ధ‌ర్, అర్షం మ‌ధు, ప‌బ్బోజు శ్రీ‌కాంత్ చారి, త‌క్క‌ళ్లప‌ల్లి వినీల్ రావు, రాము, సందీప్ యాద‌వ్‌, రాసూరి రాజేష్‌, తేజ పాల్గొన్నారు.

Advertisement
Advertisement