Peddi Sudarshan Reddy | దేవాదుల వద్ద దావత్.. ఉత్తమ్‌కు ఇంకా సిగ్గు రాలేదు : పెద్ది సుదర్శన్ రెడ్డి
Peddi Sudarshan Reddy | రైతులకు సాగునీరు అందివ్వకుండా కాంగ్రెస్ మంత్రులు వచ్చి దేవాదుల వద్ద దావత్ చేసుకుని వెళ్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. నీటి పారుదల శాఖ మంత్రిగా కొనసాగుతున్న సిగ్గులేని ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇంకా సిగ్గు రాలేదని ఆయన దుయ్యబట్టారు.
Peddi Sudarshan Reddy | త్రినేత్ర.న్యూస్ : రైతులకు సాగునీరు అందివ్వకుండా కాంగ్రెస్ మంత్రులు వచ్చి దేవాదుల వద్ద దావత్ చేసుకుని వెళ్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. నీటి పారుదల శాఖ మంత్రిగా కొనసాగుతున్న సిగ్గులేని ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇంకా సిగ్గు రాలేదని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవితతో కలిసి పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం ఏడు రకాల సన్న వడ్ల పంటను పండించాలని చెప్పింది. ఏడు రకాల సీడ్ పంపిణీ వ్యవస్థను అధికార పార్టీ ఎమ్మెల్యేలు సమీక్ష చేశారు. ఆన్ లైన్ చేసుకున్న రైతులకు మాత్రమే రూ. 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రభుత్వం అంటోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవాదులపై ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎల్ నినోపై ప్రభుత్వానికి స్పష్టత ఉందా..? బీఆర్ఎస్ ఒత్తిడితోనే దేవాదుల మోటార్లు ఆన్ చేశారు. దేవాదుల వద్దకు మంత్రులు విహార యాత్రకు వచ్చినట్లు వచ్చారని పెద్ది విమర్శించారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి అవివేకి, అహంకారి..
ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు ఇచ్చిన మాటను తప్పుతున్నారు. రైతుల గొంతు నొక్కుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న రైతులు ఆలోచించాలి. మంత్రులు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి మాట్లాడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి అవివేకి, అహంకారి, అవినీతి పరుడు. సిగ్గు లేని ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇంకా సిగ్గు రాలేదు. హరీష్ రావుకు ఇరిగేషన్‌పై జ్ఞానం లేదనడం బుద్ది మాంద్యం. మంత్రులకు కాంట్రాక్టులు, కమీషన్లపై అవగాహన ఉందని పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం

Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..

Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?





