B Vinod Kumar | 8 వేల ఎకరాల కబ్జాను తేల్చకుంటే సీఎం వ్యాఖ్యలను తొలగించాలి: మాజీ ఎంపీ వినోద్‌కుమార్ డిమాండ్
B Vinod Kumar | సిరిసిల్లలో 8000 ఎకరాలు ఎవరు కబ్జా పెట్టారో, 2400 ఎకరాలను ఎవరి దగ్గరి నుంచి ప్రభుత్వం వాపస్ తీసుకుందో నెల రోజుల్లోగా తేల్చాలని మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు.
B Vinod Kumar | త్రినేత్ర న్యూ: సిరిసిల్లలో 8000 ఎకరాలు ఎవరు కబ్జా పెట్టారో, 2400 ఎకరాలను ఎవరి దగ్గరి నుంచి ప్రభుత్వం వాపస్ తీసుకుందో నెల రోజుల్లోగా తేల్చాలని మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. తేల్చకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడిన మాటలను తక్షణమే తొలగించాలన్నారు. ఈ విషయంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ నాయకత్వంలో స్పీకర్‌కు కూడా పిటిషన్ ఇస్తామని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
సిరిసిల్ల కలెక్టర్ దగ్గర ఆర్టీఐ కింద పిటిషన్ పెట్టాం. 8000 ఎకరాలు ఎవరు కబ్జా పెట్టారు.. ఏ ఊరిలో, ఏ సర్వే నంబర్‌లో, ఎవరి దగ్గరి నుంచి తీసుకున్నరు? జిల్లా కలెక్టర్ 2400 ఎకరాల భూమిని వాపస్ తీసుకున్నడని సీఎం రేవంత్ స్వయంగా అసెంబ్లీలో చెప్పిండు. ఎవరి దగ్గరి నుంచి తీసుకున్నరో చెప్పాలి. నెల రోజులు ఆగుతం. అప్పుడు చట్టం చెప్తది. వన్ మంత్‌లో ఈ జిల్లా కలెక్టర్ ఇవ్వాలే.
80 ఎకరాలు కూడా కబ్జా పెట్టలే..
8000 ఎకరాలు కబ్జా చేసింది ఎవరో, 2400 ఎకరాలు ప్రభుత్వం ఎవరి దగ్గర నుంచి తీసుకున్నదనే లెక్కలు రాకపోతే.. రేవంత్ శాసన సభలో మాట్లాడిన మాటలను తొలగించాలి. డెఫినెట్‌గా స్పీకర్ దగ్గర పిటిషన్ వేస్తాం. గంగుల కమలాకర్ నాయకత్వంలో రేపు వెళ్లాలి. గంగులను రిక్వెస్ట్ చేస్తున్నా. 800 కాదు 80 ఎకరాలు కూడా కబ్జా పెట్టలేదు అని వినోద్ కుమార్ అన్నారు.
తాజావార్తలు
- ●Hyderabad Service Apartments Police Warning | మీ సర్వీస్ అపార్ట్మెంట్లో ఇవి జరిగితే ఇల్లు సీజ్ చేస్తాం: సైబరాబాద్ పోలీసుల తీవ్ర హెచ్చరిక
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లు భారీగా పతనం.. వారం రోజుల్లో రూ.20 లక్షల కోట్లు ఆవిరి..
- ●Harish Rao | ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసే కుట్ర
- ●Mumbai UPI Protest | రూ.2,000 దాటితే యూపీఐ వాడరా? కొత్త ఛార్జీలపై భగ్గుమంటున్న జనం.. సర్వేలో షాకింగ్ నిజాలు
- ●Ntr | ఎన్టీఆర్ వాచ్ ధర రెండు కోట్లా? - చిన్న సినిమా బడ్జెట్‌తో సమానమంటూ నెటిజన్ల కామెంట్లు
- ●Maxivision Hospital Case | టెస్టుల కోసం వెళ్తే సర్జరీ చేసినట్లు చూపించి క్లెయిమ్ కొట్టేసిన హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రి

Hyderabad Service Apartments Police Warning | మీ సర్వీస్ అపార్ట్మెంట్లో ఇవి జరిగితే ఇల్లు సీజ్ చేస్తాం: సైబరాబాద్ పోలీసుల తీవ్ర హెచ్చరిక

Stock Markets | స్టాక్ మార్కెట్లు భారీగా పతనం.. వారం రోజుల్లో రూ.20 లక్షల కోట్లు ఆవిరి..

Harish Rao | ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసే కుట్ర

Mumbai UPI Protest | రూ.2,000 దాటితే యూపీఐ వాడరా? కొత్త ఛార్జీలపై భగ్గుమంటున్న జనం.. సర్వేలో షాకింగ్ నిజాలు





