Santosh Kumar | దుశ్చర్ల సత్యనారాయణను పరామర్శించిన మాజీ ఎంపీ సంతోశ్ కుమార్
Santosh Kumar | పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయణను (Dushcharla Satyanarayana) బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోశ్ కుమార్ (Santosh Kumar) పరామర్శించారు.
Santosh Kumar | త్రినేత్ర.న్యూస్: ప్రకృతి ప్రేమికులు దుశ్చర్ల సత్యనారాయణను (Dushcharla Satyanarayana) గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ (Santosh Kumar) పరామర్శించారు. నిమ్స్ హాస్పిటల్ చికిత్స పొందుతున్న ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రకృతి ప్రేమికులు సత్యనారాయణపై గొడ్డలితో దాడి చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి దాడి మంచి పద్ధతి కాదని, బాధ్యులపై ప్రభుత్వం చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని సంతోష్ కుమార్ కోరారు.

ఈ సందర్బంగా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రకృతి ఉంటేనే మనం ఉంటామని, ప్రకృతి లేకుండా మనుషులము ఉన్నా కూడా ఈ జీవితం వ్యర్థం అన్నారు. అడవిని సొంతంగా సృష్టించింది తన సొంత ప్రయోజనాల కోసం కాదని సమాజం కోసమని చెప్పారు. ఇలాంటి దానికి సహకరించాల్సింది పోగా, తనపై భౌతిక దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నా ప్రాణం పోయినా పరవాలేదు కానీ చివరి శ్వాస వరకు అడవిని కాపాడుతానని, ప్రకృతిని పరిరక్షణకు పాటుపడుతానని చెప్పారు. సంతోష్ కుమార్ కూడా పచ్చదనాన్ని పెంచడం కోసం గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినందుకు ఆయనకు అభినందనలు తెలిచేస్తున్నా. తనపై జరిగిన దాడి గురించి తెలుసుకొని, పరామర్శించి, అండగా ఉంటానని ధైర్యాన్ని నింపిన సంతోష్ కుమార్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు రాఘవేందర్ యాదవ్, కిషోర్ గౌడ్, గర్రెపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Visited NIMS Hospital to meet Sri Dushcharla Satyanarayana garu, a true nature hero attacked for his dedication to protecting our environment.
His words, “If nature exists, we exist,” remind us of our duty to safeguard it.
We must demand justice!#SaveNature… pic.twitter.com/9BcxmANGQr— Santosh Kumar J (@SantoshKumarBRS) April 25, 2026
Read Also..
పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయణపై గొర్ల కాపర్ల దాడి..
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






