KTR | దుశ్చర్ల సత్యనారాయణపై దాడి అమానుషం: కేటీఆర్
KTR | నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య మీద దశాబ్దాల పాటు పోరాటం చేసిన యోధుడు దుశ్చర్ల సత్యనారాయణ (Duscharla Satyanarayana) మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేటీఆర్ (KTR) తెలిపారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని ఎక్స్ వేదికగా కోరారు.
KTR | త్రినేత్ర.న్యూస్: నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య మీద దశాబ్దాల పాటు పోరాటం చేసిన యోధుడు దుశ్చర్ల సత్యనారాయణ (Duscharla Satyanarayana) మీద జరిగిన దాడిని అమానుషమని, దీన్ని త్రీవ్రంగా ఖండిస్తున్నానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) తెలిపారు. దాడి చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దుశ్చర్లకు మెరుగైన వైద్య సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురంలోని తన 70 ఎకరాల్లోని వ్యవసాయ క్షేత్రంలో గొర్లను మేపొద్దని చెప్పినందుకు గొర్ల కాపర్లు(Shepherds) ఆయనపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సూర్యాపేట జిల్లా దవాఖానకు తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ప్రభుత్వ ఖర్చులతో దుశ్చర్లకు వైద్యం: సీఎం
పర్యావరణవేత్త, జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు దుశ్చర్ల సత్యనారాయణ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. దుశ్చర్లకు పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతో వైద్యం అందించనున్నట్లు వెల్లడించారు. ఇందుకు నిమ్స్ ఆసుపత్రిలో తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దుశ్చర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకోవాలని ఓఎస్డీ వేముల శ్రీనివాసులుకు సూచించారు. వెంటనే నిమ్స్ ఆసుపత్రిలో వైద్యం చేయించడానికి ఏర్పాట్లు చేయించారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



