త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ala Venkateshwar Reddy | పాలమూరుకు కావాల్సింది నీ తిట్లు కాదు.. టీఎంసీలు

Ala Venkateshwar Reddy | పాల‌మూరు (Palamuru) జిల్లాకు కావాల్సింది సీఎం రేవంత్ (CM Revanth) తిట్లు కాద‌ని.. టీఎంసీల వాట‌ర్ కావాల‌ని దేవ‌ర‌క‌ద్ర‌ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి (Ala Venkateshwar Reddy) అన్నారు.

S

Telangana | Published On Nov 27, 2026, 3.59 pm IST

Ala Venkateshwar Reddy | పాలమూరుకు కావాల్సింది నీ తిట్లు కాదు.. టీఎంసీలు
Advertisement
  • మీకు అధికార‌మున్నది హామీల అమ‌లు కోసం
  • కోయిల్‌సాగ‌ర్ నీళ్లు తీసుకెళ్తే ఇక్క‌డి రైతులు ఎటు పోవాలే
  • భూత్పూర్ మీటింగ్‌ల ఏడాదికి 20 కోట్లు ఖ‌ర్చు పెడ‌దామ‌న్న‌వ్‌.. క‌నీసం 6 కోట్ల‌యినా వ‌చ్చిన‌యా?
  • 60 శాతం సినిమా అయిపోయింది.. జిల్లాకు ఏం లాభం జ‌రిగింది
  • మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఫైర్‌

Ala Venkateshwar Reddy | త్రినేత్ర న్యూస్‌: పాల‌మూరు (Palamuru) జిల్లాకు కావాల్సింది సీఎం రేవంత్ (CM Revanth) తిట్లు కాద‌ని.. టీఎంసీల వాట‌ర్ కావాల‌ని దేవ‌ర‌క‌ద్ర‌ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి (Ala Venkateshwar Reddy) అన్నారు. మీకు ప్ర‌జ‌లు అధికారం ఇచ్చింది తిట్ట‌డానికి కాద‌ని.. మీరిచ్చిన హామీలు అమ‌లు చేయాల‌ని మండిప‌డ్డారు. ప్ర‌తి సంవ‌త్సరం రూ.20 కోట్లు ఖ‌ర్చు పెడ‌దామ‌ని భూత్పూర్ మీటింగ్‌ల చెప్పాడ‌ని.. మూడేండ్ల‌యినా క‌నీసం రూ.6 కోట్ల‌యినా వ‌చ్చాయా అని నిల‌దీశారు. శుక్ర‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మాట్లాడారు.

15 రోజులకు ఒక్క సభ పెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాడు తప్ప.. హామీల అమలు మాత్రం లేదు. ఎన్నికల ముందు మీటింగ్ పెట్టి నేను పాలమూరు బిడ్డను.. నన్ను గెలిపించండి అన్నాడు.. ఏం లాభం జరిగింది గెలిపిస్తే. కేసీఆర్ కు పేరు వస్తుంది అని ప్రాజెక్టులు పెండింగ్ లో పెట్టిన‌వ్‌. కొడంగల్ కు తప్ప ఇంకా ఎక్కడ అయిన నిధులు వచ్చాయా? నువ్‌ అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రాజెక్ట్, ఒక్క చెక్ డ్యామ్ అయినా కట్టినవా? మేం కడితే మీ నాయకులు కూల్చారు. వారిపై ఇప్పటికీ కేసు నమోదు కాలేదు.

పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి మాత్రం 700 కిలోమీటర్ల దూరం నీళ్ళు తీసుకుపోయాడు. మేం పాదయాత్ర అంటే మంత్రులు వచ్చారు మళ్ళీ ఏమైంది? చీరల పంపిణీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కోటి మంది మహిళలకు చీరలు అని కోటి రూపాయలు ఇచ్చినట్లు చెప్తున్నాడు. పాలమూరు జిల్లాకు ఏం లాభం జరిగింది. కేసీఆర్ ఉన్నప్పుడు దేశానికి ఆదర్శంగా పథకాలు ఉన్నాయి. మిషన్ భగీరథ పథకం దేశంలో ఎక్కడైనా ఉందా, రైతు బంధు ఎక్కడైనా ఉందా?

కండువా క‌ప్పుకోవాలి లేదంటే క‌మీష‌న్ ఇవ్వాలి

తెలంగాణ ఉద్యమంలోనే రాష్ట్రం వచ్చాక ఏం చేయాలో కేసీఆర్‌ ఆలోచన చేశారు. నేను ముఖ్యమంత్రిగా ఉంటే చాలు అనుకుంటున్న‌వ్‌ అంతే. అందుకే ఏం పథకాలు ఇస్త‌లేవ్‌. కోయిల్ సాగర్ (Koilsagar Reservoir Water) నుండి నీళ్ళు తీసుకురావాలని టెండర్లు పిలిచారు. కోయిల్ సాగర్ కింద ఉన్న రైతులు ఎటు పోవాలి? కోయిల్ సాగర్ నుండి నీళ్ళు ఎందుకు? నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ (Narayanpet-Kodangal Lift Irrigation Project) ఉన్నది కదా. కరప్షన్, కమీషన్ గురించి నీతి మాటలు మాట్లాడుతున్నాడు. దానికి బ్రాండ్ అంబాసిడర్ లు మీరు. బిల్లులు క్లియర్ చేయాలంటే కండువా కప్పుకోవాలి లేదా కమీషన్ ఇవ్వాలి. కండువా కప్పుకున్నా కమీషన్ ఇవ్వాలి. మేం కేసీఆర్ హయంలో రూపాయి ఖర్చు లేకుండా ఇండ్లు ఇచ్చాం. మీరు కొబ్బరికాయ కొట్టి పోతున్నారు. ఒక్కొక్క‌రికి 15 లక్షల రూపాయలు అవుతున్నాయి అని ఆల వెంకటేశ్వర్ రెడ్డి విమ‌ర్శించారు.

మీటింగ్ ర‌మ్మంటే ఏం పీకాడని అంటున్న‌రు: మర్రి జనార్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి వస్తే మా జిల్లాకి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు కావచ్చు అనుకున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి వస్తే ఆయన పార్టీ సొంత ఎమ్మెల్యేలు తిట్టుకుంటున్నారు. నీ సొంత‌త నియోజకవర్గం దత్తత తీసుకోండి అని స్థానిక ఎమ్మెల్యే అడిగితే కనీసం కూడా స్పందన లేదు. కానీ హరీశ్‌రావు, కేటీఆర్ గురించి అవ్వే మాటలు. మహిళ సంఘాలను టార్గెట్ చేసి మీటింగ్ రమ్మని అంటున్నారు. బస్ పెడితే కూడా మహిళల సంఘాలు వెళ్ళడం లేదు. బస్ లో మీటింగ్ రమ్మంటే ఏం పీకాడు అని అంటున్నారు. నీ పార్టీ ఎమ్మెల్యే లు నీ గురించి ఎంత గోరంగా మాట్లాడుతున్నారో చూడు. నిన్ను తిట్టిన తిట్లు ప్రపంచంలో ఎవరిని తిట్టడం లేదు.

కేసీఆర్ కంటే గొప్పగా చేస్తావ్ అని నమ్మి నీకు ఓట్లు వేశారు. ఆయన సొంత ఎమ్మెల్యే అభివృద్ధి గురించి అడిగితే నా రక్తాన్ని చిందిస్త అంటున్నావ్.. నీ రక్తం ఎవరికి కావాలి. నీ రక్తం నీ కుటుంబ సభ్యులు కూడా ఎక్కించుకోరు.. ఇతరులకు ఎందుకు. దేశంలో గ్రామ పంచాయతీలకు అత్యల్ప నిధులు ఇస్తుంది నీ ప్రభుత్వం. మీ పాలనలో పల్లెలు కన్నీరు పెడుతున్న‌య్‌. ట్రాక్టర్ లు ఇస్తే ట్రాక్టర్ లు మూలకు పడ్డాయి. బీఆర్ఎస్ వాళ్ళకు పెన్షన్‌ ఇస్తున్నాం అంటున్నావ్ నీ ఇంట్లో నుండి ఇస్తున్నావా. ఎక్కడ టీవీ పెట్టినా.. ఎక్కడ మైక్ పెట్టినా అవి బంద్ పెడుతున్నారు.

నీ కారు నంబ‌రే నీకు ల‌క్కీ నంబ‌ర్ అయిత‌ది

ఇప్పటికి పెన్షన్ లు తగ్గిస్తున్నారు. 44 లక్షల 63 వేల పెన్షన్లు మాత్రమే ఇస్తున్నారు. కేవలం ఏడు వేల పెన్షన్ లు మాత్రమే ఎక్కువ ఇస్తున్నారు. దీనిపై సవాల్ కు సిద్ధమా? రెండు కిలోమీటర్ల మట్టి తవ్వితే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. హరీశ్‌రావు పార్టీ నుండి దూరం చేయాలని అనుకుంటున్నావ్.. నీతో కాదు. రానున్న రోజుల్లో నిన్ను విడగొట్టడం ఖాయం. నీ కారు నంబర్‌నే నీకు లక్కీ నంబర్ కాబోతుంది. నీకు 90 సీట్లు కాదు.. 9 సీట్లే వస్తాయి. ప్రతిపక్ష పార్టీలను తిడితే హామీలు అమలు అవుతాయా? గతంలో అచ్చంపేటకు వచ్చి గిరి వికాసం కింద వంద రోజుల్లో సోలార్ పంప్ సెట్ లు ఇస్తాం అన్నావ్. ఇవ్వకపోతే కలెక్టర్ ను సస్పెండ్ చేస్తాం అన్నావ్. ఇచ్చావా.. ఇస్తే ఎక్కడ ఇచ్చావో చూపించు. కేవలం కొండారెడ్డిపల్లిలో ఇండ్లకు సోలార్ ఇచ్చావు.

ఈ ప్రెస్ మీట్‌లో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నేత అభిలాష్ రంగినేని పాల్గొన్నారు.

Advertisement
Advertisement