Merger Talks | కాంగ్రెస్‌లో విలీనం కానున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ.. తుది దశకు చర్చలు!
Merger Talks | తిరుగుబాట్లు, చీలికలతో మహారాష్ట్రలో (Maharashtra) విపక్ష పార్టీలు రోజురోజుకు బలహీనమవుతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన ఆరుగురు ఎంపీలు ఇప్పటికే షిండే సేనలో చేరిపోయారు. ఇప్పటికే చీలిపోయిన శివసేవన ఈ కుదుపుతో మరింత బలహీనమయింది.
Merger Talks | త్రినేత్ర.న్యూస్: తిరుగుబాట్లు, చీలికలతో మహారాష్ట్రలో (Maharashtra) విపక్ష పార్టీలు రోజురోజుకు బలహీనమవుతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన ఆరుగురు ఎంపీలు ఇప్పటికే షిండే సేనలో చేరిపోయారు. ఇప్పటికే చీలిపోయిన శివసేవన ఈ కుదుపుతో మరింత బలహీనమయింది. విపక్ష కూటమిలోని మరో ప్రధాన పార్టీ అయిన శరద్ పవార్ (Sharad Pawar) అధ్యక్షుడిగా ఉన్న ఎన్‌సీపీ (NCP) రెండు వర్గాలు చీలిపోయిన విషయం తెలిసింది. అజిత్‌పవార్ వర్గం అధికార ఎన్డీఏ కూటమిలో చేరగా, శదర్ పవార్ NCP (SP) విపక్షంగా ఉన్నది. ఈక్రమంలో ప్రతిపక్ష శిబిరంలో అనిశ్చితి పెరుగుతున్న తరుణంలో, ఎన్‌సీపీ (ఎస్‌పీ).. కాంగ్రెస్ పార్టీలో (Congress) విలీనమయ్యేందుకు రంగం సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ఇరుపార్టీల అగ్రనేతలు ఇప్పటికే చర్చలు (Merger Talks) ప్రారంభించారు. చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని, అవి తుది దశకు చేరినస్టు సమాచారం. పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న ఎన్‌సీపీ (శరద్ చంద్ర పవార్) ఎమ్మెల్యేలు, ఎంపీలకు కాంగ్రెస్ నాయకత్వం ఆమోదం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.
కాంగ్రెస్ హైకమాండ్, శరద్ పవార్ మధ్య విలీన చర్చలు జరుగుతున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత విజయ్ వడెట్టివార్ ధృవీకరించారు. శరద్ పవార్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయ్యే అవకాశంపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. లౌకికవాద సిద్ధాంతాలను విశ్వసించే వారికి తమ పార్టీ ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుందని చెప్పారు. దీనివల్ల మహారాష్ట్రలో కాంగ్రెస్ మరింత బలోపేతమవుతుందని తెలిపారు.
మరోవైపు మహారాష్ట్ర స్థానిక నేతలు ఈ వార్తలను ఖండిస్తున్నారు. అయితే హైకమాండ్ తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని ప్రకటించారు. కాగా, విలీన చర్చల నేపథ్యంలో తదుపరి నిర్ణయం తీసుకునే ముందు NCP (SP) నాయకత్వం అంతర్గతంగా ఏకాభిప్రాయాన్ని సాధించే పనిలో నిమగ్నమైం ఉంది. రాష్ట్ర స్థాయిలో ఒక ప్రాథమిక అవగాహన కుదిరిన తర్వాత, ఢిల్లీలోని రెండు పార్టీల అగ్రనాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.
గతంలోనూ చర్చలు..
ఈ రెండు పార్టీల మధ్య విలీన చర్చలు గతంలోనూ జరిగాయి. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఈ ప్రతిపాద వచ్చింది. అయితే, ఎన్నికల ప్రచారం కారణంగా చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది. ప్రతిపక్ష కూటమి 'మహా వికాస్ అఘాడి' (MVA) అంతర్గత సవాళ్లు, ఐక్యతకు సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కొంటున్న తరుణంలో మరోసారి ఈ పరిణామం చోటుచేసుకుంది.

27 ఏండ్ల తర్వాత..
1999లో సోనియా గాంధీ విదేశీ మూలాల వివాదం నేపథ్యంలో కాంగ్రెస్‌తో విభేధించిన శరద్ పవార్.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని (NCP) స్థాపించారు. 27 ఏళ్ల తర్వాత, ఇప్పుడు మళ్లీ విలీన చర్చలు జరుగుతున్నాయి. అయితే, 2023 అజిత్ పవార్ తిరుగుబాటు చేసి NCPని చీల్చారు. మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరారు. ఈ చీలిక కారణంగా, పార్టీ వారసత్వం, రాజకీయ గుర్తింపు తమకే చెందుతుందని ఇరు వర్గాలు వాదించుకున్నాయి. దీంతో ఎన్నికల సంఘం అజిత్ వర్గానికి పార్టీ గుర్తయిన గడియారాన్ని కేటాయించింది. కాగా, ఇటీవల జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అజిత్ పవార్ మరణించడంతో.. రెండు వర్గాలు మళ్లీ కలిసిపోతాయనే చర్చ జరిగింది.
అయితే అజిత్ పవార్ వర్గంతో విలీనం జరిగే అవకాశమే లేదని శరద్ పవార్ వర్గం స్పష్టం చేసింది. కాగా, ప్రాంతీయ పార్టీలపై బీజేపీ రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతుండటం, శరద్ పవార్ వయస్సు (85 ఏళ్లు) రీత్యా పార్టీ భవిష్యత్తును సురక్షితం చేసేందుకు మళ్లీ మాతృసంస్థ అయిన కాంగ్రెస్‌లో విలీనం చేయడమే సరైన మార్గమని శరద్ పవార్ వర్గంలోని మెజారిటీ నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నారు. దీనిపై శరద్ పవార్ లేదా కాంగ్రెస్ అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
సంబంధిత వార్తలు

BRS | సరూర్‌నగర్‌లో సంగ్రామ సదస్సు.. బీఆర్ఎస్ నేతల గృహనిర్బంధం
జులై 18, 2026

Chanagani Dayakar | యువ సంగ్రామ సదస్సు కాదు.. నిరుద్యోగులకు బీఆర్ఎస్ చేసిన విద్రోహ సభ: చనగాని దయాకర్
జులై 17, 2026

KTR | కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ వైఫల్యాలను ప్రజలకు వివరిద్దాం.. విద్యార్థుల యువజన సభలో అన్నీ చెబుదాం
జులై 16, 2026
తాజావార్తలు
- ●MBBS | ఎంబీబీఎస్‌లో సీనియర్ సిటిజన్లకు రిజర్వేషన్లు ఎందుకు లేవు?.. హైకోర్టును ఆశ్రయించిన 71 ఏండ్ల నీట్ అభ్యర్థి
- ●Road Accident | లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం
- ●Weekly Horoscope | ఈరాశివారు ఆశించిన ఫలితాలు పొందుతారు.. ఆ పనులకు దూరంగా ఉంటే మంచింది!
- ●ISRO Apprentice | ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో అప్రెంటిస్‌లు.. రాత పరీక్ష లేకుండానే..
- ●Horoscope | జూలై 19 రాశి ఫలాలు.. మీ కోపం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం!
- ●Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక

MBBS | ఎంబీబీఎస్‌లో సీనియర్ సిటిజన్లకు రిజర్వేషన్లు ఎందుకు లేవు?.. హైకోర్టును ఆశ్రయించిన 71 ఏండ్ల నీట్ అభ్యర్థి

Road Accident | లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం

Weekly Horoscope | ఈరాశివారు ఆశించిన ఫలితాలు పొందుతారు.. ఆ పనులకు దూరంగా ఉంటే మంచింది!

ISRO Apprentice | ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో అప్రెంటిస్‌లు.. రాత పరీక్ష లేకుండానే..



