త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | కేసీఆర్.. ఒక ఉద్యమం, ఒక విజన్, యుగ ప్రభంజనం : హ‌రీశ్ రావు

Harish Rao | బీఆర్ఎస్ అధినేత (BRS chief) కేసీఆర్ (KCR) పుట్టిన‌రోజు నేడు. ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హ‌రీశ్ రావు (Harish Rao) సైతం కేసీఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.

D

Telangana | Published On Feb 17, 2026, 10.53 am IST

Harish Rao | కేసీఆర్.. ఒక ఉద్యమం, ఒక విజన్, యుగ ప్రభంజనం : హ‌రీశ్ రావు
Advertisement

Harish Rao | బీఆర్ఎస్ అధినేత (BRS chief) కేసీఆర్ (KCR) పుట్టిన‌రోజు నేడు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు నేత‌లు, పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు త‌మ అధినేత‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హ‌రీశ్ రావు (Harish Rao) సైతం కేసీఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.

కేసీఆర్ అనే మూడు అక్షరాలు.. జై తెలంగాణ యుద్ధ నినాదం, దశాబ్దాల ఆకాంక్షల ప్రతిధ్వని, తెలంగాణ ఆత్మగౌరవ గర్జన అని తెలిపారు. కేసీఆర్ అంటే.. ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపం, తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్య సూర్యోదయం అని పేర్కొన్నారు. కేసీఆర్ ఒక ఉద్యమం, ఒక విజన్, యుగ ప్రభంజనం అని కొనియాడారు. యావత్ తెలంగాణను ఏక తాటిపై నడిపి, ఉద్యమం పుట్టించి, ఆ ఉద్యమాన్ని రాష్ట్ర ఆవిర్భావంగా తీర్చిదిద్దిన దృఢసంకల్పం అని తెలిపారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా సుదీర్ఘ పోస్టు పెట్టారు.

“మీ అడుగులు ఆత్మగౌరవ పోరాటానికి దారులు చూపాయి.
మీ ఆలోచనలు అణగారిన గుండెలకు ఆత్మబలాన్ని అందించాయి.
మీ వ్యూహాలు ఆధిపత్య శక్తుల కుట్రల్ని పటాపంచలు చేశాయి.
మీ పట్టుదల, మీ పరిణతి, మీ నిబద్ధత, మీ నిర్భీతి తరతరాల వివక్షా విద్రోహాల నుంచి తెలంగాణను విముక్తి చేశాయి.

ప్రతి తరానికి ఒక టార్చ్‌బేరర్ ఉంటారు…కానీ తెలంగాణకే టార్చ్ బేరర్ మన కేసీఆర్ గారు.

నా జీవిత ప్రయాణంలో మీరు కేవలం నా మేనమామ మాత్రమే కాదు.. అంతకు మించి నా సర్వస్వం.
మేనమామగా ఆశీర్వదించి అపారమైన ప్రేమను పంచారు.
రాజకీయంగా నాకు ఓనమాలు దిద్దించి విలువలు నేర్పించి ప్రజా సేవలో నన్ను తీర్చిదిద్దారు.

ఉద్యమనిర్మాతగా ప్రగతి ప్రదాతగా దేశచరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న మీ జన్మదినం తెలంగాణ ప్రజలకు పర్వదినం...

మీరు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని, జాతికి మీ నాయకత్వం మరిన్ని దశాబ్దాలు దిశా నిదర్శనం చేయాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

తెలంగాణ ప్రజలకు ఎనలేని విశ్వాసం, ఎనలేని ప్రేరణ అయిన ప్రియతమ నేత కేసీఆర్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అని హ‌రీశ్ రావు త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు.

https://x.com/brsharish/status/2023604940267253994?s=46

ట్యాగ్స్:

Advertisement
Advertisement