Harish Rao meets Jagga Reddy | 21 ఏండ్ల తర్వాత జగ్గారెడ్డి ఇంటికి హరీశ్‌రావు
Harish Rao meets Jagga Reddy | రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర ఘట్టం ఆవిష్కృతమైంది. నువ్వా నేనా అంటూ కాలు దువ్వుకునే నేతలు ఒక్కచోట కలిశారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు.
- ఏ ఫంక్షన్‌కు హరీశ్ రావును పిలవలే.. కానీ దీనికి మిస్ కావొద్దని పిలిచా
- మా మధ్య రాజకీయాలు, ఎటువంటి మతలబు లేదు
- ఆయనంత పెద్ద లీడర్ కాకున్నా నేను ఓ స్థాయి లీడర్‌నే
- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
- అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించిన హరీశ్‌రావు
Harish Rao meets Jagga Reddy | త్రినేత్ర న్యూస్: రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర ఘట్టం ఆవిష్కృతమైంది. నువ్వా నేనా అంటూ కాలు దువ్వుకునే నేతలు ఒక్కచోట కలిశారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. కాసేపు రాజకీయాలు అటుంచి కలిసి ముచ్చటించుకున్నారు. దీనికి జగ్గారెడ్డి ఇల్లు వేదికైంది. జగ్గారెడ్డి (Jagga Reddy) ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి చేరుకున్న మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) నూతన వధూవరులను ఆశీర్వదించారు. తమ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధంపై ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడారు.
రాజకీయం రాజకీయమే
2004లో హరీశ్‌రావు మంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయన కలిసి ఆయన ఛాంబర్ లో భోజనం చేసే వాళ్ళం. ఆ తర్వాత నేను కాంగ్రెస్ లో వచ్చాక.. మళ్ళీ ఇప్పటి వరకు హరీశ్ రావుని కలవలేదు. 21 ఏళ్ల తర్వాత మొదటిసారి మళ్ళీ ఫ్యామిలీ ఫంక్షన్ లో కలిశాం. నా కూతురి పెళ్లికి హరీశ్‌రావుని పిలవలేకపోయాను. కానీ ఈ ఫంక్షన్ మిస్ కావొద్దని ఆహ్వానించాను. మా ఇద్దరి మధ్య ఎటువంటి రాజకీయాలు లేవు. ఇలా కలవడంలో ఎటువంటి మతలబు లేదు. రాజకీయం రాజకీయమే.
నేను టాపో, తుప్పో
హరీశ్‌రావు బీఆర్ఎస్‌లో అగ్రనేత. నేను కాంగ్రెస్ లో టాప్ లీడర్ కాకపోయినా ఓ స్థాయి లీడర్ నే. అనేక ఫంక్షన్ లకు ఆయన్ని పిలవలేకపోయాను. పదేళ్లు హరీశ్‌రావు మంత్రిగా ఉన్న సమయంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన్ని కలవలేదు. అయితే అంతకుముందు హరీశ్‌రావును ఆహ్వానించిన సందర్భంలోనూ ‘‘వారు టాప్ లీడర్.. నేను టాపో, తుప్పో గానీ..’’ అంటూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలకు అక్కడున్న వారంతా గొల్లున నవ్వారు. హరీశ్‌రావు సైతం చిరునవ్వులు చిందించారు.
నిత్యం విమర్శలు, ప్రతివిమర్శలకు పదును పెట్టే నాయకులు ఇలా కలుసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎలాంటి భేషజాలు లేకుండా ఆప్యాయంగా పలకరించుకోవడం, సరదాగా ముచ్చటించుకోవడం, రాజకీయ విభేదాలు వ్యక్తిగత అనుబంధాలకు అడ్డంకి కాకూడదన్న భావనను ఈ కలయిక చాటిచెప్పడం విశేషం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం








