త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Liquor Price Hike | దసరా పండుగ వేళ మందుబాబులకు షాక్.. భారీగా పెరిగిన విదేశీ మద్యం ధరలు

Liquor Price Hike | ద‌స‌రా పండుగ స‌మ‌యంలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం (Telangana ) భారీ షాకిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా విక్ర‌యిస్తున్న విదేశీ మద్యం బ్రాండ్ల ధ‌ర‌ల‌ను (Liquor Price Hike) పెంచింది. దాదాపు 352 విదేశీ మ‌ద్యం (Foreign Liquor) బ్రాండ్ల ధ‌ర‌ను స‌గ‌టున 6 శాతం వ‌ర‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది.

G

Telangana | Published On Oct 14, 2026, 1.02 pm IST

Liquor Price Hike | దసరా పండుగ వేళ మందుబాబులకు షాక్.. భారీగా పెరిగిన విదేశీ మద్యం ధరలు
Advertisement

Liquor Price Hike | త్రినేత్ర న్యూస్‌: ద‌స‌రా పండుగ స‌మ‌యంలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం (Telangana ) భారీ షాకిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా విక్ర‌యిస్తున్న విదేశీ మద్యం బ్రాండ్ల ధ‌ర‌ల‌ను (Liquor Price Hike) పెంచింది. దాదాపు 352 విదేశీ మ‌ద్యం (Foreign Liquor) బ్రాండ్ల ధ‌ర‌ను స‌గ‌టున 6 శాతం వ‌ర‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. ఈమేర‌కు ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ ఆదేశాలు జారీచేశారు. ఈ పెంపుతో స్కాచ్, సింగిల్ మాల్ట్ విస్కీలు, వోడ్కా, జిన్, టేకిలా, వైన్ (జానీ వాకర్, చివాస్ రీగల్ వంటి పాపులర్ బ్రాండ్లు) ధరలు బ్రాండ్‌ను బట్టి ఫుల్‌ బాటిల్‌పై రూ.30 నుంచి రూ.100 వరకు వినియోగదారులపై భారం పడనుంది. పెరిగిన ధ‌ర‌లు ఈ నెల 12 నుంచి అమ‌ల్లో ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది. ప్రస్తుతం డిపోల్లో ఉన్న నిల్వలతోపాటు ఇకపై రవాణా చేసే ప్రతి విదేశీ మద్యం బాటిల్‌పై తప్పనిసరిగా నూతన ఎమ్మార్పీతో కూడిన స్టిక్కర్లను అతికించాలని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో స‌వ‌రించిన ధ‌ర‌ల జాబితాను అబ్కారీ శాఖ తాజాగా విడుదల చేసింది.

కొత్త ధ‌ర‌లు ఇలా..

  • గ్లెన్‌మోరంగీ సిగ్నెట్: రూ.50,660
  • గ్లెన్‌మోరంగీ 18 ఇయర్స్: రూ.27,270
  • రాయల్ సెల్యూట్ 21 ఇయర్స్: రూ.27,220
  • యమజాకి డిస్టిలర్స్ రిజర్వ్: రూ.17,450
  • హిబికి జపనీస్ హార్మొనీ: రూ.17,400
  • గ్లెన్ గ్రాంట్ 18 ఇయర్స్: రూ.13,420
  • శివాస్ రీగల్ 18 ఇయర్స్: రూ.10,540
  • గ్లెన్‌ఫిడిచ్ 15 ఇయర్స్: రూ.10,510
  • గ్లెన్‌ఫిడిచ్ 12 ఇయర్స్: రూ.7,910
  • టాకర్ 10 ఇయర్స్: రూ.7,430
  • లాఫ్రోయిగ్ సింగిల్ మాల్ట్: రూ.7,100
  • జానీ వాకర్ బ్లాక్ లేబుల్: రూ.5,140
  • శివాస్ రీగల్ 12 ఇయర్స్: రూ.4,940
  • జె అండ్ బి రేర్: రూ.2,730
  • జానీ వాకర్ రెడ్ లేబుల్: రూ. 2,650
  • బెల్వెడెరే ప్యూర్ వోడ్కా: రూ.7,280
  • హెండ్రిక్స్ జిన్: రూ.6,940
  • బెలుగా నోబుల్ రష్యన్ వోడ్కా: రూ.5,810
  • గ్రే గూస్ వోడ్కా: రూ.5,050
  • బాంబే సఫైర్ డ్రై జిన్: రూ.2,820
  • ఆబ్సల్యూట్ వోడ్కా: రూ.2,680
  • డొమ్ పెరిగ్నాన్ రోజ్ షాంపైన్: రూ.1,16,560
  • మోయెట్ అండ్ చాన్డన్ ఐస్ షాంపైన్: రూ.18,870
  • మోయెట్ అండ్ చాన్డన్ బ్రూట్: రూ.14,270

కాగా, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మద్యంపై సుంకాన్ని కేంద్రం తగ్గించిన‌ప్ప‌టికీ రాష్ట్రంలో విదేశీ మద్యం ధరలు పెరగడం గ‌మ‌నార్హం. దిగుమతి సుంకం తగ్గింపు ప్రయోజ‌నం నేరుగా అందుతుందని భావించినప్ప‌టికీ ధరల పెంపుతో వినియోగదారులు నిరాశకులోన‌వుతున్నారు.

Advertisement
Advertisement