త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manne Krishank | రేవంత్ కూతురుతో వ్యాపారాలు చేస్తున్న దుంప శిరీష ఎవ‌రు?

Manne Krishank | త్రినేత్ర న్యూస్‌: రేవంత్ కూతురు నైమిషాతో వ్యాపారాలు చేస్తున్న దుంప శిరీష ఎవ‌ర‌ని బీఆర్ఎస్ నేత మ‌న్నె క్రిశాంక్ ప్ర‌శ్నించారు. మెడికోవర్ హాస్పిటల్స్, మాక్స్ బీఎన్ ఫార్మా, మైండ్ వాల్ కన్‌స్ట్రక్షన్స్, శోదా కన్‌స్ట్రక్షన్స్, స్వచ్ బయో, టెసెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ మీద రేవంత్ రెడ్డి సోదరులు, కుటుంబసభ్యులు రూ.50 వేల కోట్ల స్కాంలు చేశారని ఆరోపించారు.

S

Telangana | Published On Oct 3, 2026, 1.32 pm IST

Manne Krishank | రేవంత్ కూతురుతో వ్యాపారాలు చేస్తున్న దుంప శిరీష ఎవ‌రు?
Advertisement
  • మెడికోవ‌ర్‌ ఆసుపత్రిలో ఆమె ప్రధాన షేర్‌హోల్డర్
  • రేవంత్ కూతురు నైమిష నిర్మిస్తున్న స్కూల్లోనూ శిరీష‌ పార్ట్‌నర్‌గా ఉంది
  • రేవంత్ సోదరులు, కుటుంబసభ్యులు రూ.50 వేల కోట్ల స్కాంలు చేశారు
  • ఇవ‌న్నీ బ‌య‌ట‌పెట్టినందుకు జైలుకు పంపుతారో లేదా ఎన్‌కౌంట‌ర్ చేస్తారేమో
  • నేను చెప్పిన‌వి త‌ప్ప‌ని నిరూపిస్తే బ‌హిరంగంగా సారీ చెప్తా.. ప్రెస్‌మీట్ గూడా పెట్ట‌
  • వీటన్నింటిపై విచార‌ణ‌కు సిద్ధ‌మా?
  • రేవంత్‌రెడ్డికి మ‌న్నె క్రిశాంక్‌ స‌వాల్‌

Manne Krishank | త్రినేత్ర న్యూస్‌: రేవంత్ కూతురు నైమిషాతో వ్యాపారాలు చేస్తున్న దుంప శిరీష ఎవ‌ర‌ని బీఆర్ఎస్ నేత మ‌న్నె క్రిశాంక్ ప్ర‌శ్నించారు. మెడికోవర్ హాస్పిటల్స్, మాక్స్ బీఎన్ ఫార్మా, మైండ్ వాల్ కన్‌స్ట్రక్షన్స్, శోదా కన్‌స్ట్రక్షన్స్, స్వచ్ బయో, టెసెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ మీద రేవంత్ రెడ్డి సోదరులు, కుటుంబసభ్యులు రూ.50 వేల కోట్ల స్కాంలు చేశారని ఆరోపించారు. మెడికోవ‌ర్ ఆసుప్ర‌తిలో ప్ర‌ధాన షేర్ హోల్డ‌ర్‌గా, నైమిష నిర్మిస్తున్న స్కూల్లో కూడా దుంప శిరీష పార్ట్‌న‌ర్‌గా ఉంద‌న్నారు. వీట‌న్నింటిపై రేవంత్‌రెడ్డి విచార‌ణ‌కు సిద్ధ‌మా అని స‌వాల్ విసిరారు. తాను చెప్పిన‌వి త‌ప్ప‌ని నిరూపిస్తే బ‌హిరంంగా సారీ చెప్తాన‌ని.. ప్రెస్‌మీట్ కూడా పెట్ట‌న‌ని తేల్చి చెప్పారు. ఈమేర‌కు ఆయ‌న శ‌నివారం మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఆధారాల కాపీల‌ను ఈడీతో స‌హా అంద‌రికీ పంపుతా..

వీటి అన్ని ఆధారాలను కాపీలతో ఈడీకి, మల్లికార్జున ఖర్గేకు, ప్రధాని కార్యాలయానికి, రాష్ట్రపతి కార్యాలయానికి, ప్రతిపక్ష నాయకులకు అందరికీ పంపిస్తాను. మెడికోవర్ హాస్పిటల్స్, మాక్స్ బీఎన్ ఫార్మా, మైండ్ వాల్ కన్‌స్ట్రక్షన్స్‌లో ఎందుకు దుంప శిరీష డైరెక్టర్‌గా ఉన్నారు? వీటిపై విచారణకు రేవంత్ రెడ్డి సిద్ధమా? రేవంత్ రెడ్డి మెడికవర్ ఆసుపత్రిలో దుంప శిరీష పేరిట బినామీ పెట్టుబడులు పెట్టి 13 వేల కోట్లకు ఆసుపత్రిని అమ్మేశారు.

అంత ఆదాయం ఎలా పెరిగింది?

మాక్స్ బీఎన్ ఫార్మా కంపెనీలో ప్రధాన డైరెక్టర్లు రేవంత్ రెడ్డి అల్లుడు సత్యనారాయణ, దుంప శిరీష అనే మహిళ ఉంది. మెడికోవ‌ర్‌ ఆసుపత్రిలో కూడా దుంప శిరీష ప్రధాన షేర్‌హోల్డర్. సహృదయ మాతృ సంస్థ ద్వారా మెడికోవ‌ర్‌ ఆసుపత్రి నిర్మించారు. గత రెండేళ్లుగా సహృదయ మాతృ సంస్థ ఆదాయం 689% పెరిగింది. అయితే ఈ మెడికోవ‌ర్‌ ఆసుపత్రిని రూ.13,300 కోట్లకు అమ్మేశారు. రెండేళ్లలో అంత ఆదాయం ఎలా పెరిగింది? రేవంత్ రెడ్డి కూతురు నైమిష నిర్మిస్తున్న స్కూల్లో కూడా ఈ దుంప శిరీష పార్ట్‌నర్‌గా ఉంది. ఆ స్కూల్లో డైరెక్టర్లు దుంప శిరీష, అనుముల నైమిష రెడ్డిలు, గీతా ఆటోమోటివ్ ఉన్నారు. రేవంత్ రెడ్డి మూడేళ్లలో ఒక్క ప్రభుత్వ హాస్పిటల్, ఒక ప్రభుత్వ పాఠశాల కూడా నిర్మించలేదు. కానీ కొంపల్లిలో పెద్ద ఎత్తున నైమిష రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ భవనం నిర్మాణం జరుగుతుంది. రేవంత్ రెడ్డి కూతురుతో ఇన్ని వ్యాపారాలు చేస్తున్న దుంప శిరీష ఎవరు?

బీజేపీకి ద‌మ్ముంటే విచార‌ణ జ‌రిపించాలి..

రేవంత్ రెడ్డి 2024, ఆగస్ట్‌లో కొరియాకు వెళ్లి హ్యుండాయ్ కంపెనీ పెద్దలను కలిశాడు. ఆ మూడు నెలల తర్వాత గీత ఆటో మోటివ్స్ అని 5 షోరూంలు ప్రారంభం అయ్యాయి. 2009లోనే కేటీఆర్ హోటల్ గురించి అఫిడవిట్‌లో పెట్టారు. ఆ హోటల్ కూడా కిరాయి బంగ్లాలో నడుస్తుంది. దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి రేవంత్ రెడ్డి చూపిస్తున్నాడు. బీజేపీకి దమ్ముంటే రేవంత్ రెడ్డి మెడికోవ‌ర్‌ అంశంపై విచారణ జరపాలి. రెండున్నరేళ్లలో రేవంత్ రెడ్డి కుటుంబం వ్యాపారాలు అడ్డగోలుగా పెరిగాయి. ఇవన్నీ బయటపెట్టినందుకు మళ్లీ జైలుకు పంపిస్తారో లేక ఈసారి ఎన్‌కౌంట‌ర్‌ చేస్తారేమో.. అని క్రిశాంక్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Advertisement
Advertisement