Electric Bus | మరో ఎలక్ట్రిక్ బస్సులో చెలరేగిన మంటలు.. రెండు వారాల్లో రెండో ఘటన
Electric Bus | ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో (Electric Bus) వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో నిలిపి ఉన్న మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్నది.
Electric Bus | త్రినేత్ర.న్యూస్: ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో (Electric Bus) వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు వారాల క్రితం కరీంగనర్ జిల్లా (Karimnagar) అలుగునూర్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా దగ్ధమైన ఘటన మరువకముందే.. తాజాగా కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో నిలిపి ఉన్న మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్నది.
కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో నిలిపి ఉన్న ఎలక్ట్రిక్ బస్సు బ్యాటరీ విభాగంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి బస్సు మొత్తానికి వ్యాపించడంతో మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఆ సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. బ్యాటరీలో షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

గత నెల 21న అలుగునూర్ శివారులో ఎలక్ట్రిక్ బస్సు కాలి బూడిదైన విషయం తెలిసిందే. కరీంనగర్–హైదరాబాద్ మార్గంలో వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపి ప్రయాణికులందరినీ కిందకు దించడంతో అంతా సురక్షితంగా బయటపడ్డారు. మూడు ఫైర్ ఇంజన్లు రెండు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.
సంబంధిత వార్తలు

Suryapet | సూర్యాపేట జిల్లాలో ఢీకొట్టుకున్న రెండు ప్రైవేట్ బస్సులు!
ఆగస్టు 16, 2026

Attempt Murder | హత్యాయత్నం కేసులో బండి సంజయ్ ముఖ్య అనుచరుడు, బీజేపీ కార్పొరేటర్ అరెస్ట్
ఆగస్టు 11, 2026

Tirupati-Karimnagar Express | మారిన తిరుపతి-కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు వేళలు.. పెరిగిన ప్రయాణ సమయం!
ఆగస్టు 8, 2026
తాజావార్తలు
- ●HYDRA Prajavani Complaints | హైడ్రా కూల్చిన చోటే మళ్లీ నిర్మాణాలు.. పార్కులనూ వదలట్లేదు
- ●22A చిక్కుముడి: అసలేంటీ నిషేధిత భూముల రగడ? బాధితులు ఇదిగో ఇలా చేయండి !
- ●CM Revanth Reddy | ఎర్రగడ్డకు వెళ్లి టిమ్స్ కట్టానని చెప్పాడట!. కేటీఆర్‌పై రేవంత్ సెటైర్లు..!
- ●CM Revanth Reddy | పేదల కోసం రేవంత్ అన్న ఉన్నడని భరోసా కల్పించాలి : సీఎం రేవంత్
- ●CM Revanth Reddy | ప్రజాపాలనలో వైద్యానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●BUS and Lorry Accident | కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు.. ఐదుగురి పరిస్థితి విషమం

HYDRA Prajavani Complaints | హైడ్రా కూల్చిన చోటే మళ్లీ నిర్మాణాలు.. పార్కులనూ వదలట్లేదు

22A చిక్కుముడి: అసలేంటీ నిషేధిత భూముల రగడ? బాధితులు ఇదిగో ఇలా చేయండి !

CM Revanth Reddy | ఎర్రగడ్డకు వెళ్లి టిమ్స్ కట్టానని చెప్పాడట!. కేటీఆర్‌పై రేవంత్ సెటైర్లు..!

CM Revanth Reddy | పేదల కోసం రేవంత్ అన్న ఉన్నడని భరోసా కల్పించాలి : సీఎం రేవంత్



